గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 16, 2020 , 23:05:28

పర్యావరణం కోసం యుద్ధం

పర్యావరణం కోసం యుద్ధం

వ్యవసాయం-పర్యావరణ యూనిట్‌గా స్థానిక సాంకేతిక పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహార, పోషక వ్యవస్థల్లో నష్టాలను నివారించాలి. పంటల మార్పిడి, జీవ సేంద్రియ ఎరువులు, జీవ నియంత్రణ పద్ధతులు, పర్యావరణ వ్యవస్థతో ఇమిడ్చి, ఆధునికతను జోడించడం ద్వారా వ్యవసాయాన్ని సుస్థిరపరుచాలి. భూమి ఆరోగ్య పరిరక్షణ, నీటి సంరక్షణ, భూసారం పెంపొందింపు, నేల కోతను నివారించటం ద్వారా ఉత్పాదకతను పెంచడం దీర్ఘకాలిక లక్ష్యంగా ఎంచుకోవాలి.

పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు కేవలం భారత్‌  అనుకుంటేనే కాదు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమగ్ర కార్యాచరణ అవసరం. కోపెన్‌ హాగెన్‌ సదస్సులో నిర్ణయించినట్లుగా ఉద్గారాలను తగ్గించటం ద్వారా ఉష్ణోగ్రత పెరుగకుండా భారత్‌ కృషిచేయాలి.  పర్యావరణ మార్పులకు అనుకూల విధానాలను రూపొందించుకుంటూనే, అభివృద్ధి చెందిన దేశాలు కార్బన్‌ ఉద్గారాల విడుదలకు మూల్యం చెల్లించేవిధంగా ఒత్తిడి తెస్తేనే పర్యావరణం పరిరక్షించబడుతుంది.

పర్యావరణ మార్పులు వ్యవసాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫలితంగా ఆహారభద్రతపై నీలినీడలు అలుముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభు త్వం చేపడుతున్న చర్యలు ఎంతో మేలు చేస్తున్నాయి. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన హరితహారంతో మొక్కలు వనాల పెంపకం చేపట్టింది. అనావృష్టిని ఎదుర్కొనేందుకు చెరువుల పునరుద్ధరణ దాదా పు పూర్తయ్యింది. పంటల వైవిధ్యీకరణకు బాటలువేసింది. దీంతో పర్యావరణ మార్పులు విపరీతంగా చోటుచేసుకున్నప్పటికీ, సాగును సజావు గా సాగించేందుకు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నది. ఒక్క మాట లో చెప్పాలంటే, పర్యావరణ మార్పులను తట్టుకునేందుకు, తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగానే తయారైందని తెలుస్తున్నది.వాతావరణ మార్పులతో అభివృద్ధి  దేశాల్లో ఆహారధా న్యాల ఉత్పత్తి తరిగిపోతున్నది. మరో రెండు సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత పెరిగి తే దేశంలో ప్రధాన ఆహారపంట వరి ఉత్పాదకత హెక్టారుకు ఒక టన్ను తగ్గిపోనున్నది. 2050 నాటికీ ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా, దేశంలో మరో ప్రధాన ఆహారపంట గోధుమ ఉత్పాదకత తగ్గిపోతుంది. సాగుకు అనుకూల భూమి తగ్గిపోనున్నది. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటరకాలు సాగుకు పనికిరావు. ఏడాదికి ఒక్క మన దేశంలోనే దాదాపు 70 లక్షల టన్నుల మేర ఉత్పత్తి పడిపోనున్నది. దీనికితోడు ఆకస్మిక వరదలు, వర్షాల లేమి సంభవించనున్నాయి. 2009లో సంభవించిన అననుకూల వర్షాభావ పరిస్థితుల వల్ల, ఒక కోటి 50 లక్షల టన్నుల వరి, 40 లక్షల టన్నుల ఇతర ఉత్పత్తి పడిపోయింది. పర్యావరణ మార్పుల వల్ల, అసాధారణ పరిస్థితులు భారత వ్యవసాయంలో చోటుచేసుకుంటున్నాయి.   అసాధారణ వాతావరణ పరిస్థితులున్న దేశాల్లో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నది. ఒక్క 2015లోనే దేశంలో 15 రాష్ర్టాలు వీటి ప్రభావాన పడితే, దాదాపు 33 శాతం పంటల సాగు విస్తీర్ణం దెబ్బతిన్న ది. ఇరువై వేల కోట్ల రూపాయల పైనే రైతులు నష్టపోయారు. పంటల బీమా లాంటి పథకాలతో ఆదుకుంటే తప్ప, రైతు సాగులో నిలబడలేరని భారత హరితవిప్లవ పితామహులు స్వామినాథన్‌ గుర్తుచేయాల్సి వచ్చిం ది. ఇది దేశ ఆహారభద్రతకు ప్రత్యక్ష హెచ్చరిక. ఎంత త్వరగా పరిష్కారం వెతికితే, అంత త్వరగా దేశం, ఆహార భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.

తెలుగు రాష్ర్టాలకు మరిన్ని పర్యావరణ సవాళ్లు పొంచి ఉన్నట్లు ప్రపం చబ్యాంకు ‘షాక్‌ వేవ్స్‌' నివేదిక తెలుపుతున్నది. పర్యావరణ మార్పుల ప్రభావాన్ని గత 25 ఏండ్లలో అధ్యయనంలో 14 శాతం ప్రజలు పేదరి కం నుంచి బయటపడితే, ఏడాదికి సరాసరిన 12 శాతం ప్రజలు మళ్లీ పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. ఎండల తీవ్రత, వర్షాల లేమి వల్ల,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  గత 25 ఏండ్లలో 15 వేల మందికి పైగా పేదలు చనిపోయారు. ప్రపంచంలో సూడాన్‌ దేశం తర్వాత, అత్యధిక మరణాలు జరిగినయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే. 2030 నాటికీ ఐదు శాతం మేర ఆహారధాన్యాల ఉత్పత్తి పడిపోతుంది. దీంతో పేదరికం పెరుగనున్నది. 2030 నాటికీ పేదరిక నిర్మూలన చర్యలు చేపట్టకపొతే, పేదరికం 30 శాతానికి చేరుకోనున్నది. కరువు, నీటికొరత, తద్వారా పంట నష్టాల వల్ల పంటల దిగుబడులు తగ్గి ఆహారకొరత పెరగనున్నదని నివేదిక తెలిపింది. ఇక దేశంలో 2013-14లో 26.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి  ఉంటే, 2014-15లో 4 శాతం తగ్గి  25.3 కోట్ల టన్నులు మాత్ర మే ఉత్పత్తి అయింది. అందుకు కారణం పర్యావరణ మార్పే.ప్యారిస్‌లో జరుగుతున్న కాప్‌-21 సదస్సులో ప్రభుత్వం తీసుకోబో యే చర్యలను భారత్‌ ఇప్పటికే ప్రకటించింది. పర్యావరణ మార్పులకు అనుకూల చర్యలు చేపట్టడానికి వచ్చే పదిహేనేండ్లలో 165 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నదని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కర్బన ఉద్గారాలలో మూడవ స్థానంలో ఉన్న భారత్‌ సౌరశక్తి ఉత్పత్తిని పెంపొందిచేందుకు రూ.198 కోట్లు కేటాయించింది. భవిష్యత్తులో వాతావరణ మార్పులను తట్టుకునేందుకు సమీకృత అభివృద్ధే శరణ్యమని నివేదిక చెబుతున్నది. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే వ్యవసాయ పద్ధతులు రైతు లకు చేరవేయాలి. ముఖ్యంగా వ్యవసాయాధారిత రంగాలపై పన్ను భారం తగ్గించాలి. పేద ప్రజల సంక్షేమానికి  ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మొత్తంగా ప్రభుత్వం ఒక రక్షణ కవచంగా ప్రజలకు చేరువవ్వాలి.

ఐదు దశాబ్దాల కిందట హరిత విప్లవం సాకారమవుతున్న కాలంలో కోటి టన్నుల గోధుమలు దేశంలోకి దిగుమతి చేసుకుంటే, నేడు కూడా కోటి టన్నుల ఆహార పదార్థాలు దిగుమతి చేసుకుంటున్నాం. పెరిగిన సాంకేతికత, శాస్త్రీయ పరిస్థితిని మెరుగుపరచలేకపోయిందంటే అందు కు కారణం పర్యావరణ మార్పే. ఫలితంగా గత ముప్ఫై ఏండ్లలో క్షామ పరిస్థితులతో అభివృద్ధి చెందుతున్న దేశాలు విలవిల్లాడాయి.  ప్రకృతి విపత్తుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 1.5 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్ల నష్టం జరిగిందని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల ప్రజలు వ్యవసాయంపై ఆధారపడితే, కేవ లం 4.2 శాతం నిధులే అందుకు కేటాయించబడుతున్నాయి.పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు కేవలం భారత్‌  అనుకుంటేనే కాదు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమగ్ర కార్యాచరణ అవసరం. కోపెన్‌ హాగెన్‌ సదస్సులో నిర్ణయించినట్లుగా ఉద్గారాల ను తగ్గించటం ద్వారా ఉష్ణోగ్రత పెరుగకుండా భారత్‌ కృషిచేయాలి.  పర్యావరణ మార్పులకు అనుకూల విధానాలను రూపొందించుకుంటూ నే, అభివృద్ధి చెందిన దేశాలు కార్బన్‌ ఉద్గారాల విడుదలకు మూల్యం చెల్లించేవిధంగా ఒత్తిడి తెస్తేనే పర్యావరణం పరిరక్షించబడుతుంది.సార్క్‌ దేశాలతో పాటు ప్రాంతీయ సహకారంతో వీటిని సాధించాలి.  జాతీయస్థాయిలో ముఖ్యంగా పర్యావరణ అనుకూల విధానాలు రూపొందించాలి. స్థానికంగా పర్యావరణ మార్పుల ప్రభావాలను తగ్గిం చే తరుణోపాయాలు తరచిచూడాలి. సుస్థిర సాగు వ్యవస్థలు రూపొందించాలి. వ్యవసాయం-పర్యావరణ యూనిట్‌గా స్థానిక సాంకేతిక పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహార, పోషక వ్యవస్థల్లో నష్టాలను నివారించాలి. పంటల మార్పిడి, జీవ సేంద్రియ ఎరువులు, జీవ నియంత్రణ పద్ధతులు, పర్యావరణ వ్యవస్థతో ఇమిడ్చి, ఆధునికతను జోడించడం ద్వారా వ్యవసాయాన్ని సుస్థిరపరుచాలి. భూమి ఆరోగ్య పరిరక్షణ, నీటి సంరక్షణ, భూసారం పెంపొందింపు, నేల కోతను నివారించటం ద్వారా ఉత్పాదకతను పెంచడం దీర్ఘకాలిక లక్ష్యంగా ఎంచుకోవాలి. పర్యావరణ మార్పులను ఎదుర్కొనగలిగే సూత్రమిదే. ఉత్పాదకతను పెంచటంతో పాటు, పశుపక్షాదులు, నీరు, నేల వనరులను కాపాడగలిగే శక్తి జీవవైవిధ్యానిది. దీంతో చీడ, పీడలను, కరువుకాటకాలను తట్టుకునే పంట రకా లు వైవిధ్యంతోనే సాధ్యం. పంటలు, చేపలు, కోళ్లు, అటవీ ఉత్పత్తులు, పాడితో కూడిన ఉత్పత్తి ఆధారిత సాగు వ్యవస్థను రూపొందించాలి.పట్టణాలు, నగరాల్లో వ్యర్థాలను సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగే వ్యవసాయాన్ని యుద్ధప్రాతిపదికన పెంపొందించాలి. తద్వారా పర్యావరణ ఆధారిత దిగుబడి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఇంకుడు గుంత లు, పోషక ఎరువులనిచ్చే చెట్లు, బయోగ్యాస్‌ వాడకాన్ని పెంపొందించ టం ద్వారా వర్షాధార ప్రాంతాలను కాపాడుకోవచ్చు.రైతు సాంఘిక, ఆర్థికవ్యవస్థలను పెంపొందించే టెక్నాలజీ, ఉత్పత్తి కారక వ్యవస్థలు అవసరం. నికర ఆదాయాన్ని అందించగలిగే వ్యవసా యం, రైతుల సుస్థిర ఆర్థికానికి ఆధారం. సహకారసంస్థలు, ఉత్పత్తి కం పెనీలు, గ్రూపు సాగులను ప్రోత్సహించటం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు చేయూతనివ్వాలి. పంటల బీమా కీలకమైనది. అయితే దేశం లో 20 శాతం రైతులు మాత్రమే పంటల బీమా చేస్తున్నారు. 80 శాతం మంది రైతులు ఈ రక్షణ చట్టం కిందకు రావటంలేదు. దేశంలో 14 కోట్ల మంది రైతుల భవిషత్తు, దేశ ఆహారభద్రతతో ముడిపడి ఉన్న పర్యావరణ మార్పుల నుంచి వ్యవసాయాన్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాలదే. సమగ్రమైన ప్రణాళికలతో, కార్యాచరణకు దిగాల్సిన సమయం ఇది. 


logo
>>>>>>