బుధవారం 01 ఏప్రిల్ 2020
Editorial - Mar 16, 2020 , 23:02:47

పాలన బాగుంది.. పన్నులు భారమా?

పాలన బాగుంది.. పన్నులు భారమా?

తమ ముఖ్యమంత్రి వ్యక్తిత్వం, నిజాయితీ మీద విశ్వాసం ఉంచినప్పుడు,ఆయనేం చేసినా, తమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే చేస్తారని నమ్మినప్పుడు నాయకుని కోసం ప్రాణమైనా ఇస్తారు. ప్రజల నుంచి అలాంటి నమ్మకాన్ని సాధించడం, విశ్వాసాన్ని గెలుచుకోవడం అంత ఆషామాషీ కాదు. ఇవాళ ప్రజల నమ్మకాన్నిపూర్తిస్థాయిలో గెలుచుకున్న నాయకుడు తెలంగాణలో ఒక్క కేసీఆరే అనడంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు.

సాధారణంగా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనుకునే కొన్ని చర్యలను/సంస్కరణలను అసెంబ్లీ/పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత తీసుకుంటాయి ప్రభుత్వాలు.  చట్టసభలు నడుస్తున్న సమయంలో ప్రభుత్వాలు తాము తీసుకోదలచిన చర్యలకు లేదా సంస్కరణలకు సభ అనుమతి పొందాలి. సభలో ప్రతిఘటన ఎదురవుతుందనుకున్నప్పుడు సభాకాలం ముగిశాక సదరు చర్యలు తీసుకుంటాయి. కరెంట్‌, ఇంధనం చార్జీలు, రవాణా చార్జీలు పెంచడం లాంటివి సభలు జరుగుతున్నప్పుడు చేపట్టడానికి ప్రభుత్వాలు సాహసించవు. గతంలో పార్లమెంట్‌ సమావేశాలు ముగిశాక పెట్రోల్‌, గ్యాస్‌ ధరల ను కేంద్రం పెంచి విమర్శలపాలైన ఉదంతాలు అనేకం ఉన్నాయి.మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కరెంట్‌ చార్జీ లు, ఆస్తి పన్నులు పెంచుతామని సభా సాక్షిగా ప్రకటించి సరికొత్త ఒరవడికి సాహసించారు సీఎం కేసీఆర్‌. ఓట్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టలేమని నిర్ద్వంద్వంగా ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రజల నెత్తి న భారం వేసేటపుడు ముఖ్యమంత్రులు కొంచెం భయపడుతారు. నిజానికి గత ఆరేండ్లలో రెండుసార్లు స్వల్పంగా కరెంట్‌ చార్జీలను పెంచారు.   ఇది మూడోసారి. ఏమా సాహసం! అయినప్పటికీ కరెంట్‌ చార్జీలు పెంచుతామని కేసీఆర్‌ ప్రకటించినప్పటికీ ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత కనిపించలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికంగా పెంచిన  కరెంట్‌ చార్జీలు కొంచెం తగ్గించమని ఆందోళన చేసిన రైతుల మీద కాల్పులకు తెగబడి ముగ్గురి ప్రాణాలను తీశారు. కానీ, మొన్నటి కేసీఆర్‌ ప్రకట న తర్వాత ప్రతిపక్షాలు రెచ్చగొట్టినప్పటికీ, ప్రజల నుంచి నిరసన వ్యక్తం కాలేదు. ప్రజల మీద కేసీఆర్‌కు ఉన్న నమ్మకమా? ప్రజలకు తన మీదున్న నమ్మకమా? కారణాలు విశ్లేషించడం పెద్ద కష్టమేమీ కాదు.

రాష్ట్రం విడిపోయాక తెలంగాణ మూడేండ్ల పాటు కరెంట్‌ కోతలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంచనాలు వేశారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా స్వయంగా కొన్నాళ్లపాటు కరెంట్‌ కష్టాలు తప్పవని చెప్పడంతో వ్యవసాయికంగా, పారిశ్రామికంగా తెలంగాణ వెనుకబడుతుందేమో అని సందేహించాం. గృహావసరాలకు కూడా కరెంట్‌ సరఫరా కష్టమవుతుందని నమ్మారు చాలామంది. చిన్నచిన్న పరిశ్రమలు మూతపడిపోతాయని, పరిశ్రమలు వెళ్లిపోతాయని రకరకాలుగా భయపెట్టారు. కానీ, ప్రజల భయాలను, అనుమానాలను పటాపంచలు చేస్తూ విద్యుత్‌ ఉత్పత్తిలో మొదటి ఏడాదిలోనే ప్రభుత్వం సాధించిన విజయం నభూతో. రాష్ట్రం విడిపోయి న తర్వాత ఈరోజు వరకు.. గత ఆరేండ్లలో కరెంట్‌ పోవడమన్నది చూడలేదు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయగలిగారు.  ఫలితంగా ఈ రోజు తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో అగ్రగామిగా ఉండటమే గాక ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానానికి ఎగబాకి దక్షిణ భారత అన్నపూర్ణగా ఖ్యాతినొందింది. ఇవాళ తెలంగాణలో ఎక్కడచూసినా నీటి గలగలలు, పచ్చదనపు పరవళ్లు కనిపిస్తున్నాయి.  చెరువులు నీళ్లతో నిగనిగలాడుతున్నాయి. అలుగులు పరుగులు తీస్తున్నా యి. కాళేశ్వరపు రవళులు గజ్జెకట్టి నాట్యమడుతున్నాయి. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఇంత విజయాన్ని సాధించడానికి కేసీఆర్‌ ఎన్ని కష్టాలు పడిఉంటారు? ఎంత అలోచించి ఉంటారు? దాన్ని విపక్షాలు పట్టించుకోరు. కేంద్రంతో మైత్రి లేదు. అదనంగా నయా పైసా కూడా కేంద్రం  విదిల్చదు. తెలంగాణకు శాశ్వత ఆస్తి లాంటి కాళేశ్వరానికి కేంద్రం ఒక్క రూపా యి కూడా ఇవ్వలేదు. తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ, ఒక్క పథకానికి కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫల మవుతున్నారు. అయినప్పటికీ కేసీఆర్‌ చిత్తశుద్ధి, సంకల్పబలం ప్రజల పట్ల ఆపేక్ష అన్ని వ్యతిరేకతలను తట్టుకొని సగర్వంగా నిలబడింది.


కేంద్రం రోజుకోసారి ఇంధనం ధరలను పెంచుతుంది. (దీనికి సవరించడమని ముద్దు పేరు). మొన్ననే మొబైల్స్‌ మీద జీఎస్టీని ఏకంగా ఆరుశాతం పెంచింది. ఇగ గ్యాస్‌ ధరలు నెలకోసారి పెరుగుతుంటాయి. వాటన్నింటినీ నోరు మూసుకొని భరించేవారు అర్ధ రూపాయి మేర కరెంట్‌ చార్జీలు పెంచితే అగ్గి మీద గుగ్గిలమవుతారు. అదేదో ప్రకటనలో డబ్బులు ఊరికే రావు అని చెప్పినట్లు, కరెంట్‌ కూడా ఊరికే రాదు. దాని ఉత్పత్తికి అయ్యే ఖర్చుతో పోలిస్తే, వినియోగదారుల దగ్గర వసూలు చేసేది చాలా తక్కువ. రైతులకు ఉచితంగా ఇవ్వాలి. అదీగాక దొంగతనంగా కరెంట్‌ వాడుకోవడం మనదగ్గర ఎక్కువ. ఇన్ని ఇబ్బందులను అధిగమించి వినియోగదారులకు కోపం రాకుండా కరెంట్‌ సరఫరా చేయడం కత్తిమీద సాము లాంటిది. అయినా ప్రజాగ్రహానికి గురవుతామని వెరసి కరెంట్‌ చార్జీలను పెంచడానికి వెనుకాడుతాయి ప్రభుత్వాలు. కానీ, అలా నిభాయించుకొని రావడం ఎన్నాళ్లో సాధ్యం కాదు. అయితే చార్జీలను ఎందుకు పెంచాల్సి వస్తున్నదో ప్రజలకు వివరించి వారి ఆమోదం పొందడం పరిపక్వత గలిగిన పాలకుని లక్షణం. అందుకే కేసీఆర్‌ నిర్భయంగా సభలోనే చార్జీల పెంపు అంశాన్ని నిర్మొహమాటంగా ప్రస్తావించారు.ఇక నిరాఘాటంగా సాగుతున్న సంక్షేమ పథకాలు కేసీఆర్‌ను ప్రజల గుం డెల్లో దేవుడిలా కొలువుంచాయి. తొంభై శాతం ప్రజలు కేసీఆర్‌ పాలన పట్ల సంతృప్తులుగా ఉన్నారు. ఒక పార్టీ పాలనలో తమకు మేలు కీడు ఎం తెంత శాతం ఉన్నాయో బేరీజు వేసుకుంటారు. ఎక్కువ శాతం మేలు జరుగుతున్నదని నమ్మినప్పు డు ఒకట్రెండు శాతం కీడును పట్టించుకోరు. పైగా తమ ముఖ్యమంత్రి వ్యక్తిత్వం, నిజాయితీ మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనేం చేసినా, తమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే చేస్తారని నమ్మినప్పుడు నాయకుని కోసం ప్రాణమైనా ఇస్తారు. ప్రజల నుంచి అలాంటి నమ్మకాన్ని సాధించడం, విశ్వాసాన్ని గెలుచుకోవడం అంత ఆషామాషీ కాదు. ఇవాళ ప్రజల నమ్మకాన్ని పూర్తిస్థాయిలో గెలుచుకున్న నాయకుడు తెలంగాణలో ఒక్క కేసీఆరే అనడంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. అందువల్లనే కేసీఆర్‌ రెండోసారి ఘనవిజయాన్ని సాధించడమే కాక, ఇటీవల జరిగిన స్థానిక సంస్థ ల ఎన్నికల్లో కూడా 95 శాతం విజయాలు సాధించగలిగింది. కేసీఆర్‌ మనకు వ్యతిరేకంగా ఏమీ చేయడనే విశ్వాసం ప్రజల్లో స్థిరపడింది. అందుకే కేసీఆర్‌ ఏం చేసినా ప్రజలు గుండెల మీద చేతులు వేసుకొని ఆమోదిస్తారు. గప్పాలు కొట్టుకోవడం, డప్పులు కొట్టుకోవడం, భజనలు చేయించుకోవడం, మీడియాను చేరదీసి స్తోత్రాలు చేయించుకోకపోవడం కేసీఆర్‌ను ఒక విలక్షణ నాయకుడిగా నిలబెట్టాయి. పనిచేసి చూపించి ప్రజలను ఓట్లు అడుగు అనే సిద్ధాంతానికి కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారు కాబట్టే ఇవాళ కేసీఆర్‌కు ఎదురులేకుండాపోయింది. ఇరుగు పొరుగు రాష్ర్టాలు కూడా కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఆయన పథకాలను మనస్ఫూర్తిగా స్వీకరించి తమ రాష్ర్టా ల్లో కూడా అమలుచేస్తున్నాయి. మొదట్లో తెలంగాణలో ఎందరో ఎగతాళి చేసిన గొర్రెల పంపిణీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలుచేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక రైతుబంధు పథకాన్ని కేంద్రం కూడా అమ లుచేస్తున్నది. ఇవన్నీ ముందుచూపు, దార్శనికత కలిగిన నాయకులకే సాధ్య మయ్యే విషయాలు. అవే ఆయనకు శ్రీరామరక్ష.

(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు)


logo
>>>>>>