సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Mar 16, 2020 , 23:02:14

చర్యలు తీసుకోవాలి

చర్యలు తీసుకోవాలి

కరోనా వైరస్‌ విస్తరించకుండా రాష్ట్ర ప్రభు త్వం ముందస్తు చర్యలు తీసుకున్నది. ఇం దులో భాగంగా పాఠశాలలతో పాటు, సిని మా హాళ్లు, పార్క్‌లు, పబ్‌లు వంటి జన సమ్మర్థం ఉండే అన్నింటిని తాత్కాలికంగా మూసి వేయాలంటూ ఆదేశాలు జారీచేయ డం హర్షణీయం. అయితే ఇదే అదనుగా కొందరు సొమ్ము చేసుకునేందుకు ప్రయ త్నించటం గర్హనీయం. జలుబు, దగ్గు, జ్వరంతో రోగులు ప్రైవేట్‌ దవాఖాలను ఆశ్ర యిస్తే పరీక్షల పేరిట అందినకాడికి దండు కుంటున్నారు. కాబట్టి ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజ లు కూడా దగ్గు, జలుబు లాంటివి వచ్చిన ప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండా లి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవా లి.అనవసర భయాలకు గురికాకూడదు.

- బందెల శ్రీనివాస్‌, కమాన్‌, కరీంనగర్‌


రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలె

రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రమాదాలతో మర ణాలు, క్షతగ్రాతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ మరణాలకు నిర్ల క్ష్యం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడుపడటం లాంటివే కార ణాలని పలు నివేదికలు తెలుపుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మితి మీరిన వేగం, మద్యం తాగి వాహనాలు నడిపే వారి డ్రైవింగ్‌ లైసె న్సులను రద్దు చేయాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడు తుంది. రోడ్డు నిబంధనలకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలి.   

- బేగరి ప్రవీణ్‌కుమార్‌, అంతారం, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా


ప్రత్యేక వసతులు కల్పించాలె

కరోనా ప్రభావం, భయాలు తీవ్రంగా ఉన్న సమయంలో పదో తరగతి పిల్లలకు పరీక్షలు నడుస్తున్నాయి. కాబట్టి అధికారులు పిల్లలందరికీ వ్యాధినుంచి రక్షణ కోసం మాస్క్‌లు, చేతులు కడుక్కునే ప్రత్యేక వసతులు కల్పించాలి. తద్వారా పిల్లల్లో ధైర్యాన్ని పెంచాలి.     

-సంధ్య విరగదిండ్ల, పార్వతిపురం , వనపర్తి జిల్లా


logo