గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 15, 2020 , 22:28:29

అదే గల్లీ

అదే గల్లీ

పూలమార్కెట్‌.. బస్టాండూ 

అత్తర్‌ దుకాణాల సెంటరూ  

ఇప్పటికీ.. అటు పక్కనేవున్నాయి


సినిమా పోస్టర్లు వేసే 

ఆటోల చౌరస్తా.. అలాగే వుంది

  

కమ్మని పొగలు లేచే 

అద్దాల చాయ్‌ హోటల్‌  

ఏమీ మారు ్పలేకుండా

ఇంకా దేవిడీ గేటుదగ్గరే వుంది


సాయంత్రాల్లో పెద్దవాళ్లు కూర్చునే

పావురాల అరుగు

పెచ్చులూడినా 

కూలిపోకుండా కనిపిస్తూనే వుంది


మా ఇంటి నెంబర్‌

నేను తిరిగే బతుకమ్మగల్లీ రూపం

అస్సలంటే అస్సలు మారనే లేదు..


అయినా ఎందుకోమరి

ప్రయాణం కోసం  

ఇన్నిన్ని సౌకర్యాలు పెరిగినా

రావడానికీ వెళ్ళడానికీ అదే దారైనా

అందరికీ దూరం పెరిగినట్లనిపిస్తోంది.. ...

- ఆశారాజు, 93923 02245


logo