సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Mar 15, 2020 , 22:25:25

స్వాధ్యాయ సాహితీ పురస్కారం

స్వాధ్యాయ సాహితీ పురస్కారం

సుప్రసిద్ధ కవి, విమర్శకుడు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య స్థాపించిన స్వాధ్యాయ పరిశోధన విద్యాసంస్థ ఏటా సాహితీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరస్తూ నాణ్యమైన రచనలు చేసినవారికి పురస్కారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సంవత్సరం గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి మార్చి 22న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ ఉప్పల్‌ సమీపంలోని నారపల్లిలోని స్వాధ్యాయ పరిశోధన సంస్థలో జరుగు సభలో ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో మామిడి హరికృష్ణ, కట్టా        శేఖర్‌ రెడ్డి, బుద్ధా మురళి, ఏనుగు నర్సింహారెడ్డి తదితర సాహితీవేత్తలు పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం.

- కోవెల సంతోష్‌కుమార్‌, స్వాధ్యాయ పరిశోధన సంస్థ అధ్యక్షుడు

- కస్తూరి మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి


‘పడిలేచే కెరటం’, ‘అరణ్యపర్వం’ ఆవిష్కరణ

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సలీం రెండు నవలలు     ‘పడిలేచే కెరటం’,‘అరణ్యపర్వం’ ఆవిష్కరణ సభ మార్చి 17న సాయంత్రం 6 గంటలకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రం షోయబ్‌ హాల్‌లో జరుగుతుంది. ఏనుగు నర్సింహారెడ్డి, కేవీ రమణ, నందిని సిధారెడ్డి, పీ జ్యోతి, కస్తూరి మురళీకృష్ణ, కేపీ అశోక్‌కుమార్‌ ప్రసంగిస్తారు.

- పాలపిట్ట బుక్స్‌


తిరుమల స్వరాజ్యలక్ష్మి పురస్కార ప్రదానం

తిరుమల స్వరాజ్యలక్ష్మి పురస్కార ప్రదానం సభ మార్చి 16న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌, తెలంగాణ సారస్వత పరిషత్తు ఆవరణలో జరుగుతుంది. డాక్టర్‌ కొండపల్లి నీహారిణికి పురస్కారం ప్రదానం చేస్తారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరుగు సభలో అతిథులుగా డాక్టర్‌ తిరుమల శ్రీనివాసాచార్య, డాక్టర్‌ సుమతీ నరేంద్ర హాజరవుతారు. ‘సంప్రదాయ సాహిత్యం-కవయిత్రులు’ అంశంపై ప్రసంగం ఉంటుంది. 

- డాక్టర్‌ జే  చెన్నయ్య, తెలంగాణ సారస్వత పరిషత్తు


logo