సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Mar 14, 2020 , 22:36:36

‘అక్వాకల్చర్‌'దే భవిష్యత్తు

‘అక్వాకల్చర్‌'దే భవిష్యత్తు

తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత అనేక మౌలికమైన అంశాలమీద పూర్తి అవగాహన, సూక్ష్మ పరిశీలన కలిగిన సీఎం కేసీఆర్‌ మత్స్య సంపద పెంచేందుకు కృషిచేస్తున్నారు. కాళేశ్వరం లాంటి భారీ నీటి ప్రాజెక్టులతో ఆ జలవనరుల ఆధారంగా చేపట్టవలసిన మత్స్యరంగ అభివృద్ధికి ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళికతో ముందుకుపోతున్నారు. అందువల్ల రాష్ట్రంలో కొత్తగా వచ్చిన జలవనరుల్లో‘అక్వాకల్చర్‌' అభివృద్ధి ‘టెక్నాలజీ’ని గురించి మత్స్యకారుల్లోనూ, ఔత్సాహికుల్లోనూ అవసరమైన అవగాహనను పెంపొందించేందుకు ప్రయత్నాలు జరుగాలి.

మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అమల్లోకి వస్తున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే సంప్రదాయ విధానాలమీద ఆధారపడిన ఏ రంగమైనా మార్కెట్‌ పోటీని తట్టుకుంటుంది. నాలుగుకాలాల పాటు ఉనికిని కోల్పోకుండా నిలబడగలుగుతుంది. మానవాళికి ఆహారభద్రతను అందించడంతో పా టు, ఉపాధి అవకాశాలను కల్పించడంలోనూ, ఆరోగ్య పరిరక్షణలోనూ వ్యవసాయం తర్వా త అతి ప్రధానమైన పాత్రను పోషిస్తున్న మత్స్యరంగంలో అనేక పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. అనేక శతాబ్దాల కాలంగా మత్స్య ఉత్పత్తిలో సింహభాగాన్ని జోడించిన సముద్ర జలవనరుల నుంచి చేపల ఉత్పత్తి రోజురోజుకూ తగ్గిపోతున్నది. ఉపరితల జలవనరుల్లో చేప ల ఉత్పత్తి శాతం నానాటికీ పెరుగుతున్నది. ఈ క్రమంలో మత్స్యపారిశ్రామిక రంగంలో అందుబాటులోకి వచ్చిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడిన ‘అక్వాకల్చర్‌' రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. చేపల ఉత్పత్తి లో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం చేపల ఉత్పత్తిలో సుమా రు 65 శాతం ఉపరితల జలవనరుల నుంచి లభిస్తుండగా, అందులో సగభాగం వరకు ‘అక్వా కల్చర్‌' నుంచి సమకూరుతున్నది. దీంతో రానున్నకాలంలో అక్వారంగం అభివృద్ధిని సులభంగానే అంచనా వేయవచ్చు. సముద్రతీరం లేని తెలంగాణ ఉపరితల జలవనరుల విస్తీర్ణంలో దేశంలో మూడవ స్థానంలో నిలిచి ఉన్న కారణంగా మన రాష్ట్రంలో ‘అక్వాకల్చర్‌' రంగం అభివృద్ధికి భవిష్యత్తులో విస్తారమైన అవకాశాలున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

ప్రపంచ చేపల ఉత్పత్తిలో చైనా తర్వాత భారతదేశం రెండవ స్థానంలో ఉన్నది. అయినా ప్రపంచ మత్స్య ఉత్పత్తుల్లో మన దేశం జోడిస్తున్నది కేవలం 6.5 శాతం మాత్రమే. మన రాష్ట్రంలోని విస్తారమైన ఉపరితల జలవనరులు మంచినీటి చేపలను పెంచడానికి ‘అక్వాక ల్చ ర్‌' పద్ధతుల్లో ఆధునిక విధానాలు అమలుపరిచేందుకు అనుకూలంగా ఉన్నాయి.

గత పాలకులు తెలంగాణ మత్స్యపారిశ్రామిక రంగం పట్ల బుద్ధిపూర్వకంగా అమలుపరిచిన నిర్లక్ష్య విధానా లు ఎంతో నష్టం చేశాయి. తెలంగాణలో కాకతీయుల కాలం నుంచి విస్తారంగా నిర్మించుకున్న సంప్రదాయక గొలుసుకట్టు చెరువులు, కుంటలు, నదులు, వాగులు, వంకలు చేపల ఉత్పత్తికి పెద్దగా పనికిరావనే కుట్రపూరి త ఆలోచనలను బలంగా నాటారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం, జూరాల, శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, సింగూ రు లాంటి జలాశయాల్లో మత్స్య సంపదను అభివృద్ధి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మత్స్య రం గం మీద ఆధారపడిన కుటుంబాలను సంప్రదాయ జలవనరులకే పరిమితం చేసి అందుబాటులో ఉన్న భారీ జలాశయాలను బుద్ధిపూర్వక విస్మరణకు గురిచేశారు. ఫలితంగా తరతరాలుగా చేపల వేటను నమ్ముకొని జీవిస్తున్న లక్షలాది మత్స్యకార కుటుంబాలు బతుకుదెరువు కోసం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత అనేక మౌలికమైన అంశాలమీద పూర్తి అవగాహన, సూక్ష్మ పరిశీలన కలిగిన సీఎం కేసీఆర్‌ మత్స్య సంపద పెంచేందుకు కృషిచేస్తున్నారు. కాళేశ్వరం లాంటి భారీ నీటి ప్రాజెక్టుల తో ఆ జలవనరు ల ఆధారంగా చేపట్టవలసిన మత్స్యరంగ అభివృద్ధికి ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళిక తో ముందుకుపోతున్నారు. అందువ ల్ల రాష్ట్రంలో కొత్తగా వచ్చిన జలవనరుల్లో ‘అక్వాకల్చర్‌' అభివృద్ధి ‘టెక్నాలజీ’ని గురించి మత్స్యకారుల్లోనూ, ఔత్సాహికుల్లోనూ అవసరమైన అవగాహనను పెంపొందించేందుకు ప్రయత్నాలు జరుగాలి.

అక్వాకల్చర్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రధాన పాత్రను పోషిస్తుంది. ముఖ్యంగా నీటి విస్తీర్ణం, సాంద్రత, లోతు ఎక్కువ ఉండే జలాశయాలతో పాటుగా, భూమి ఉపరితలంపై కూడా కృత్రిమంగా నీటి సదుపాయాలను సమకూర్చుకొని అక్వాకల్చర్‌ విధానంలో చేపలను పెంచేందుకు అవకాశాలున్నాయి. భారీ పెట్టుబడులతో నిర్వహించే ‘ఇన్‌ పాండ్‌ రేస్‌ వే సిస్టం’ (ఐపీఆర్‌ ఎస్‌), ‘రీ సర్క్యులేటరీ అక్వాకల్చర్‌ సిస్టం (ఆర్‌ఏఎస్‌రాస్‌), ‘ఫ్లోటింగ్‌ కేజ్‌ కల్చర్‌' లాంటి పద్ధతులతో పాటుగా తక్కువ పెట్టుబడితో నిర్వహించగలిగే ‘బయో ఫ్లాక్‌ ఫిష్‌ ఫార్మింగ్‌'(బీఎఫ్‌టీ),‘పెన్‌కల్చర్‌', ‘రివరెన్‌ ఫిష్‌ ఫార్మింగ్‌' (ఆర్‌ఎఫ్‌ఎఫ్‌) లాంటి ఆధునిక విధానాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ ఆధునిక ‘అక్వాకల్చర్‌' పద్ధతులపై రాష్ట్రంలోనూ ప్రైవేట్‌సంస్థలతో పాటు, యువ పారిశ్రామికవేత్తలు, మత్స్యకారులు ఆసక్తిని కనబరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మత్స్యశాఖ ద్వారా ఈ ఆధునిక విధానాలను ప్రోత్సహించేందు కు అనేక పథకాలను అమలుపరుస్తున్నది. మత్స్యశాఖ ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ను సుమారు రూ.వెయ్యి కోట్ల నిధులతో అమలుపరుస్తున్నది. దీంతో మత్స్య పారిశ్రామికరంగంలో వేలాదిమంది యువతీయువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

(వ్యాసకర్త: ‘తెలంగాణ ఫిషరీస్‌ సొసైటీ’వ్యవస్థాపక అధ్యక్షులు)


logo