గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 14, 2020 , 22:33:09

ఫెడరల్‌ ఫ్రంట్‌ అవసరం

ఫెడరల్‌ ఫ్రంట్‌ అవసరం

జాతీయపార్టీలు కేంద్రంలో అధికారంలో ఉంటూ రాష్ర్టాలన్నింటినీ ఒకేలాగా చూడటం లేదు. ప్రాంతీయ పార్టీలు రావాల్సిన అవసరాన్ని గమనించకుండా, విశ్లేషించుకోకుండా తమ పాలనలో లేని రాష్ర్టాలపై వివక్ష చూపుతున్నాయి. కొన్నిసార్లయితే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేస్తున్నాయి. కేంద్రంలో ఉన్న పార్టీని సమర్థించే వారిని రాష్ర్టాల్లో గవర్నర్లుగా నియమించి ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ నేపథ్యం లో ఫెడరల్‌ ఫ్రంట్‌కు అధ్యక్షత వహించగల సామర్థ్యం ఉన్న నాయకుడిగా కేసీఆర్‌ ఫ్రంట్‌ సారథ్యం వహించడమే మంచిది.

రాజ్యాంగం అవతారికలో భారత దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రకటించారు. వివిధ భాషలు, సంస్కృతులు, మతాలు, చారిత్రక భౌగోళిక పరిస్థితులున్న ఉపఖండం భారతదేశం. ప్రజలతో ఎన్నుకోబడిన పార్టీ, సభ్యులు దేశాన్ని, రాష్ర్టాలను పాలిస్తారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ, సంకీర్ణ ప్రభుత్వం కానీ ఫెడరల్‌ స్ఫూర్తిని కాపాడవలసిన అవసరమున్నది. ఫెడరల్‌ స్ఫూర్తిని కాపా డుతామంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ర్టాలపై సం పూర్ణాధికారాలను కలిగి ఉంటూనే కేంద్ర ప్రభుత్వంతోనూ సత్సంబంధా లు కలిగి ఉండాలి. బహుళ పార్టీ వ్యవస్థ ఉన్న దేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల అధికారాలను గుర్తించి నిష్పాక్షికంగా ఉండాలి. పార్టీలు, భేదాలు ఎన్నికల సమయంలో మాత్రమే అని భావించాలి. ఎవరికివ్వాల్సిన వాటా వారికిచ్చినప్పు డే ఫెడరల్‌ స్ఫూర్తి కాపాడబడుతుంది. పన్ను రూపంలో ప్రతి రాష్ట్రం నుంచి కేంద్రానికి లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో కేంద్రం ఏ రాష్ర్టానికివ్వాల్సిన వాటా ఇచ్చితీరాలి. జలవనరుల పంపకం విషయంలోనూ, కరువు కాటకాల సమయంలోనూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఏటా బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ రాష్ర్టాలకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటా ఇవ్వాల్సిందే. రాష్ర్టాల మధ్య తగాదాలు సంభవించినప్పు డు ఆయా రాష్ర్టాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిష్పాక్షిక పరిష్కారాలు చూపాలి. అదే సమయంలో రాష్ర్టాలు కేంద్ర సార్వభౌమత్వాన్ని అంగీకరించి తీరాలి.

కేంద్ర, రాష్ర్టాల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడే దేశాభివృద్ధి, రాష్ర్టాల అభివృద్ధి వేగవంతం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబం ధాలు ఉండటమంటే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండటం కాదు.  బహుళపార్టీ వ్యవస్థలో అది సాధ్యం కాదు. అలా ఉండాలనుకోవడం ఫెడరల్‌ స్ఫూర్తికి, ప్రజాస్వామ్యస్ఫూర్తికి కూడా మంచిది కాదు. అలా ఉంటేనే రాష్ర్టాలకు ఇవ్వాల్సిన నిధులు ఇస్తామనడం సరైంది కాదు. ప్రజాసామ్య దేశంలో ప్రజలు ఆయా పార్టీలను బట్టి, నాయకులను బట్టి, స్థానిక, ప్రాంతీయ స్థితిగతులను బట్టి ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. కేం ద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీని ఎన్నుకోవాల్సిన అవసరమూ లేదు, ఎన్నుకోవద్దనీ లేదు. ప్రజలకు తమ ఇష్టమున్న పార్టీకి, వ్యక్తికి ఓటు వేసుకొని గెలిపించుకునే ప్రజాస్వామిక హక్కున్నది. ఆ పనినే భారతీయ ఓటర్లు చేస్తున్నారు. అందుకే కేంద్రంలో ఉన్న పార్టీ లేదా కూటమి మాత్రమే అన్ని రాష్ర్టాల్లోనూ అధికారంలోకి రావడం లేదు. ఇది ప్రజలు చూపుతున్న ఫెడర ల్‌ స్ఫూర్తికి నిదర్శనం. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలే ఫెడరల్‌ స్ఫూర్తికి భంగం కలిగిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ మిత్రపక్షాలు రాష్ర్టాల్లో అధికారంలో ఉంటే ఒకవిధంగా, అలా లేని రాష్ర్టాల పట్ల మరో విధంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ విషయాన్ని మొట్టమొదట గుర్తించిన నాయకుడు కేసీఆర్‌. నాలుగున్నర దశాబ్దాలపైగా రాజకీయాల్లో ఉన్న విశేష రాజకీయానుభవం కలిగిఉన్న కేసీఆర్‌ జాతీయపార్టీల్లో ఫెడరల్‌స్ఫూర్తి కొరవడటం వల్లనే ఫెడరల్‌ ఫ్రంట్‌ అవసరాన్ని గుర్తించాడు. గత పార్లమెంటు ఎన్నికల ముందు ఆ విషయాన్ని ముందుకుతెచ్చినా ఫ్రంట్‌ ఏర్పడటానికి ఆ సమ యం సరిపోలేదు.జాతీయపార్టీలలో ఫెడరల్‌ స్ఫూర్తి కరువవడం వల్ల రాష్ర్టాలను గుర్తించలేదు. అందువల్లనే అనేక ప్రాంతీయ పార్టీలు రావాల్సిన అవసరం ఏర్పడిం ది. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, వెస్ట్‌ బెంగాల్‌, ఒడిషా లాంటి రాష్ర్టాల్లో జాతీయపార్టీలు నామమాత్రంగానే మిగిలాయి. దేశంలో మహా నగరాలై న హైదరాబాద్‌, కలకత్తా, ఢిల్లీ, చెన్నై, ముంబైలలో జాతీయపార్టీల చిరునామాలు గల్లంతయ్యే స్థితి వచ్చింది. తెలంగాణలో కేసీఆర్‌ ఒంటిచేత్తో అన్ని జాతీయపార్టీలను మట్టికరిపించారు. ఇది ఆయా పార్టీల స్యయంకృతం. ఫెడరల్‌ స్ఫూర్తికి భంగం కలిగించడం వల్ల కలిగిన ప్రజా వ్యతిరేకత వల్లనే, కేసీఆర్‌ లాంటి నాయకుడిపై అపార నమ్మకం ఉండటం వల్లనే టీఆర్‌ఎస్‌ విజయాల బాటపట్టింది. రాష్ర్టాల ప్రయోజనాలు తద్వారా దేశ ప్రయోజనాలు కాపాడబడాలంటే దేశానికి కేసీఆర్‌ కోరుకుంటున్న ఫెడరల్‌ఫ్రంట్‌ ఆవశ్యకత ఉన్నది.గత ఆరేండ్ల బీజేపీ పాలన చూసిన తర్వాత ఈ అవసరం మరింత పెరిగిందన్నది వాస్తవం. ఆ ఫెడరల్‌ ఫ్రంట్‌ కేసీఆర్‌ లాంటి సమర్థుడైన నాయకుడి వల్లే సాధ్యమవుతుంది. కేంద్ర సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీని, స్యయంపాలనను గుర్తించడం ఫెడరల్‌ ఫ్రంట్‌ ముఖ్యోద్దేశ్యం. ఈ ఫ్రంట్‌ ప్రాంతీయపార్టీల కలయికతో బలమైన ఫ్రంట్‌గా ఏర్పడి, ఫెడరల్‌ స్వభావం ఉన్న పార్టీలన్నింటినీ కలుపుకుంటుంది. అలా అందర్నీ కలుపగల నేర్పు, సైద్ధాంతిక బలమున్న నాయకుడు కేసీఆర్‌ ఒక్కడే.

దక్షిణాది పార్టీల నాయకులు వైఎస్‌ జగన్‌, స్టాలిన్‌, కుమారస్వామి, శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, నవీన్‌ పట్నాయక్‌, మమతా బెనర్జీ, ఉత్తరభారతంలో అఖిలేష్‌ యాద వ్‌, కేజ్రీవాల్‌, నితీశ్‌కుమార్‌, మాయావతి, శరద్‌ యాదవ్‌ లాంటి వారితో కేసీఆర్‌ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఎం.ఐ.ఎం.లాంటి పార్టీలతోనూ, ఏ ఇతర ప్రాంతీయ పార్టీలతోనూ శతృత్వం లేదు. దూరదృష్టితో ఏడాది కిందటే ఫెడరల్‌ ఫ్రంట్‌ కావాలన్న కేసీఆర్‌ ఇప్పుడా ఫ్రంట్‌ను బలోపేతం చేయగల స్థాయిలో ఉన్నారు. కేసీఆర్‌ వేసిన పునాది, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడిన పద్ధతి రాష్ట్రంలో అతని నాయకత్వాన్ని శాశ్వతం చేశాయి. ఇప్పుడు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగల సమయం, అవసరం కేసీఆర్‌కు ఉన్నది. దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టిన కేసీఆర్‌ పాలనపై రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ మంచి పేరున్నది. ఇది జాతీయ రాజకీయాల్లో రాణించడానికెంతో ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌కు గత మూడు, నాలుగేండ్లుగా తరలివస్తున్న జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు కేసీఆర్‌ ప్రతిష్ఠను మరింతగా పెంచాయి. కుల, మత, భాష, ప్రాంతీయతల కు, పార్టీలకతీతంగా అందర్నీ కలుపుకపోగల నేర్పు, ఓర్పు కేసీఆర్‌కు ఉన్నాయని గత ఆరేండ్ల పాలన రుజువుచేసింది.జాతీయపార్టీలు కేంద్రంలో అధికారంలో ఉంటూ రాష్ర్టాలన్నింటినీ ఒకే లాగా చూడటం లేదు. ప్రాంతీయ పార్టీలు రావాల్సిన అవసరాన్ని గమనించకుండా, విశ్లేషించుకోకుండా తమ పాలనలో లేని రాష్ర్టాలపై వివక్ష చూపుతున్నాయి. కొన్నిసార్లయితే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేస్తున్నాయి. కేంద్రంలో ఉన్న పార్టీని సమర్థించే వారిని రాష్ర్టాల్లో గవర్నర్లుగా నియమించి ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ నేపథ్యం లో ఫెడరల్‌ ఫ్రంట్‌కు అధ్యక్షత వహించగల సామర్థ్యం ఉన్న నాయకుడిగా కేసీఆర్‌ ఫ్రంట్‌ సారథ్యం వహించడమే మంచిది.

జాతీయపార్టీలు మత మైనారిటీలను ఓటర్లుగా మాత్రమే చూస్తున్నాయి. దక్షిణాదిపై కేంద్రపార్టీల వివక్ష ఆధిపత్యం కొనసాగుతున్నది. దక్షిణాదికి రావలసిన నిధుల విషయంలోనూ అంతే. ఈయేడు కేంద్రం రూపొందించిన బడ్జె ట్‌ చూసినా, ఇదివరకటి బడ్జెట్‌లను చూసినా కేంద్రం చూపుతున్న వివక్ష అర్థ మవుతుంది. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలోనూ ఈ వివక్ష స్పష్టం గా కనపడుతున్నది. ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ, ముస్లింల రిజర్వేషన్ల విషయంలోనూ కేసీఆర్‌ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేం ద్రం వాటిని పెండింగ్‌లోనే ఉంచింది. కేంద్రంలో హిందీ రాష్ర్టాలకు ఉన్న ప్రాధాన్యం దక్షిణాది రాష్ర్టాలకు లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ద్వారా జాతీయ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించాలి. 


logo