మంగళవారం 31 మార్చి 2020
Editorial - Mar 13, 2020 , 23:38:47

కరోనా భయం

కరోనా భయం

చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్‌ అక్కడ తగ్గుముఖం పట్టగా, ఇరాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, దక్షిణకొరియా, అమెరికాతో సహా పలుదేశాల్లో విజృంభిస్తున్నది. ఇప్పటికి 125 దేశాల్లో వైరస్‌ బాధితుల సంఖ్య 1,25,293 కాగా, 4,600 మంది మరణించారని తెలుస్తున్నది. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్‌ దేశాల్లో ఎక్కువ మరణాలు సంభవించాయి. ఆసియా దేశాల్లో వైరస్‌ విస్తరణ తీవ్రత ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.

విశ్వవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్‌ ప్రజల ప్రాణాలను బలి తీసుకోవటమే కాదు, అన్నివ్యవస్థలనూ ఆవిరిచేస్తున్నది. వర్తక, వాణిజ్య, పర్యాటకరంగాలతో పాటు క్రీడారంగాన్నీ కుదేలు చేస్తున్నది. చరిత్రలో మున్నెన్నడూ లేనివిధంగా భారత్‌లో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. కరోనాతో పరిణమిస్తున్న ప్రపంచవ్యాప్త విపరిణామాలతో దేశీయ ఆర్థికవ్యవస్థ పెనుతుఫానులో చిగురుటాకులా వణికిపోతున్నది. మరోవైపు పౌరజీవనం తీవ్రంగా ప్రభావితమవుతున్నది. సామూహిక కార్యకలాపాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. పెండ్లిండ్ల వంటి శుభకార్యాలు కూడా వాయిదాపడే పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడుతున్నాయి. దేశదేశాల్లో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, పరిశోధనలను పక్కనబెడుతున్నాయి. పర్యాటకులు ఎవరెస్టు శిఖరం ఎక్కడానికి చైనా అనుమతులు నిలిపేసింది. అంగారకుడిపై పరిశోధన కోసం రష్యా-ఐరోపా దేశాలు తలపెట్టిన అరుణ గ్రహ మిషన్‌ వాయిదా వేసుకున్నాయి. ఇస్రో కూడా తన ప్రయోగాలను వాయిదా వేసినట్లు ప్రకటించటం గమనార్హం.

అగ్రరాజ్యం అమెరికాతో సహా అనేక దేశాలు కోవిడ్‌-19తో కకావికలమవుతున్నాయి. ఏకంగా 30 రోజుల పాటు తమ దేశానికి రావద్దంటూ 26 ఐరోపా దేశాల పౌరులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశించారు. విమానయానాలను నియంత్రించారు. వాషింగ్టన్‌ డీసీ సహా 15 రాష్ర్టాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కొలరాడో, నెవెడా, విస్కాన్సన్‌లలో ఎన్నికల సభలను రద్దుచేసుకున్నారు. ఇక ఇటలీ అయితే అన్నిరకాల కార్యకలాపాలను నిలిపేసి దేశాన్నే స్తంభింపజేసిం ది. ఫ్రాన్స్‌ తదితర యూరప్‌ దేశాలన్నీ అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తూ కోవిడ్‌ను కట్టడిచేయటం కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ట్రంప్‌ చర్యలు ఆర్థికవ్యవస్థలకు అశనిపాతమంటూ యురోపియన్‌ నేతలు విమర్శిస్తుంటే, వైరస్‌ నియంత్రణలో ఈయూ సరిగా స్పందించలేదని ట్రంప్‌ తప్పుబట్టారు. విపత్కర సమయాల్లో పరస్పర విమర్శలు కాకుండా ఉమ్మడి కార్యాచరణ అవసరం. మహమ్మారిగా మారిన కోవిడ్‌-19ను కట్టడి చేసేందు కు దేశాలన్నీ చేతులు కలపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపును అనుసరించాల్సిన సమయమిది.

చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్‌ అక్కడ తగ్గుముఖం పట్టగా, ఇరాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, దక్షిణకొరియా, అమెరికాతో సహా పలుదేశాల్లో విజృంభిస్తున్నది. ఇప్పటికి 125 దేశాల్లో వైరస్‌ బాధితుల సంఖ్య 1,25,293 కాగా, 4,600 మంది మరణించారని తెలుస్తున్నది. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్‌ దేశాల్లో ఎక్కువ మరణాలు సంభవించాయి. ఆసియా దేశాల్లో వైరస్‌ విస్తరణ తీవ్రత ఎక్కువగా ఉం డటం ఆందోళన కలిగిస్తున్నది. అతితక్కువ సమయంలోనే ఆసియా దేశాల్లో 90,765 కరోనా కేసులు నమోదు కాగా, 3,253 మంది చనిపోయారు. దేశంలో కూడా ఏదో మూలన కొత్త కేసు నమోదవు తూ బాధితుల సంఖ్య 74కు చేరుకున్నది. మరో 15 వందల మందిపై వైద్యపరిశీలన కొనసాగుతుండగా, మొన్ననే తొలి మరణం చోటుచేసుకోవటం ఆందోళన కలిగిస్తున్నది. హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ టామ్‌ హాంక్స్‌, ఆయన భార్య రీటా హాంక్స్‌, ప్రఖ్యాత గాయకుడు ఎల్విన్‌ ప్రెస్లీ, కెనడా ప్రధాని జస్టి స్‌ ట్రూడో,అతని సహచరి సోఫీ వైరస్‌ బారినపడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలతో పాటు ఇది పౌరులూ అప్రమత్తం కావాల్సిన సమయం. చికిత్స కన్నా నివారణే ఉత్తమ మార్గం కదా!


logo
>>>>>>