గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 13, 2020 , 23:33:15

ప్రతిఘటనకు పర్యాయపదం

ప్రతిఘటనకు పర్యాయపదం

భారతీయ విద్యాభవన్‌తో పల్ఖీవాలాకు యాభై ఏండ్ల అనుబంధం. 1990 నుంచి ఆయనే భవన్‌ ఉపాధ్యక్షుడు. చేతికి వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవిని, భారత ప్రభుత్వ అటార్నీ జనరల్‌ పదవిని చిరునవ్వుతో తృణీకరించిన త్యాగమూర్తి పల్ఖీవాలా. పల్ఖీవాలా వాదనలు, ఆయన విశ్వాసాలు,అభిప్రాయాలు తమకు నచ్చకపోయినప్పటికీ అప్పటి కేంద్ర ప్రభుత్వ నాయకులు ఆయనను ‘పద్మవిభూషణ్‌' బిరుదంతో సత్కరించారు. ఆయన అరవింద మహర్షి శిష్యుడు.

తన వృత్తి సంపాదనతో భారత వాణిజ్య రాజధాని బొంబాయి నగరాన్ని వేలంలో కొనగలిగిన శక్తి సామర్థ్యాలున్నప్పటికీ పల్ఖీవాలా అతి నిరాడంబరంగా, ధనార్జన కాంక్ష లేకుండా జీవించారు. పార్సీ కుటుంబంలో పుట్టినప్పటికీ, మత దురభిమానానికి అతీతుడై పల్ఖీవాలా హైందవమతాన్ని, భారతీయ సంస్కృతి వైవిధ్యాన్ని, విశిష్టతను ఎంతో గౌరవించారు. 

ఆయన అసాధారణ మనీషి, అచంచల విశ్వాసాల మహర్షి. వైవి ధ్య విలసిత భారతీయ సంస్కృతి ఔన్నత్యానికి, ఉదాత్తతకు ఆయన వ్యక్తిత్వం అక్షరాలా ప్రతిబింబం, సమున్నత ప్రతీక. భారత స్వాతంత్య్ర జాతీయ ఉద్యమాల ఆశయాలు, ఆదర్శాలకు, స్వతంత్ర భారత రాజ్యాంగం ప్రాతిపదిక సూత్రాలకు, భారత ప్రజాస్వామ్యానికి, భారత ప్రజాకోటి ప్రాథమిక హక్కులకు, మానవతకు గత ఆరేండ్ల నుంచి ఏదో ఒక వికృత రూపంలో ఎన్నడూ లేని ప్రమాదం వాటిల్లుతున్నదన్న భయాందోళనలు దేశమంతటా రగుల్కొన్న క్లిష్ట సమయంలో ఆయన, ఆయన పోరాటాలు జ్ఞాపకం రావడం సహజం. ఆయ న బహుముఖ ప్రతిభావంతుడు, మేధస్సు మేరుపర్వతం ఆయన. ప్రతి భా సంపదలో ఆయన సాటిలేని శ్రీమంతుడు. ఆయన ఎదురులేని న్యాయశాస్త్ర నిష్ణాతుడు. ఆర్థికవేత్త. ఆయన వాగ్‌విలాసం, వాదనా పటి మ అఖండమైనవి, అద్వితీయమైనవి. గొప్ప వక్త, గొప్ప రచయిత - పలు ప్రశస్త, అమూల్య గ్రంథాలు ఆయన మస్తిష్కంలో మథనమై, ఆయన లేఖిని నుంచి వెలువడినాయి. ఆయన ప్రతిఘటనకు పర్యాయపదం. ఇరువై ఆరేండ్ల యువకుడిగా ఆయన 1946లో, ఒక జూనియర్‌ గా, బొంబాయి హైకోర్టులో, న్యాయవాద వృత్తి ప్రారంభించారు.  అంతకుముందు జరిగిన ఒక సంఘటన - ప్రఖ్యాత న్యాయవాది ఎం.సి.చాగ్ల (స్వతంత్ర భారతంలో, జవహర్‌లాల్‌ నెహ్రూ హయాంలో, వెల్లడైన బహుశా మొదటి కుంభకోణం ముంద్రా కుంభకోణంపై విచారణకు కేం ద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్‌ చైర్మన్‌ చాగ్ల. చాగ్ల విచారణ ఫలితంగా అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి టి.టి.కృష్ణమాచారి, ఆర్థిక కార్యదర్శి హెచ్‌.ఎం. పటేల్‌ తదితరులు తమ పదవులకు రాజీనామా ఇచ్చారు.) బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యత స్వీకరించిన రోజు మధ్యాహ్నం లంచ్‌ సమయంలో చాగ్ల గదికి ఆయన వెళ్లాడు. ఏ వేళైనా వచ్చి హైకోర్టు గ్రంథాలయంలో పుస్తకాలు చదువడానికి ఆయన చాగ్ల అనుమతి కోరాడు. అనుమతి లభించగానే ఆ గ్రంథాలయంలోని అన్ని పుస్తకాలను చదివిన ఘనత ఆయనది. ఆయనే నానాభాయి అర్దేషిర్‌ పల్ఖీవాలా. స్వతంత్ర భారతంలో, నియంతృత్వ ధోరణులకు, రాజ్యాంగ దుర్వినియోగానికి, సందు దొరికినప్పుడు ప్రాథమిక హక్కులకు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినప్పుడు ధైర్య సాహసాలతో అనేక ప్రజావేదికలపై గొంతు విప్పి, న్యాయస్థానాల్లో ప్రతిభావంతంగా ప్రతిఘటించి న అచ్చమైన ప్రజాతంత్రవాది నాని పల్ఖీవాలా. 

వందేండ్ల కిందట, 19 20 జనవరి 16న బొంబయిలోని ఒక మధ్య తరగతి ఫార్సీ కుటుంబం లో నానీ పల్ఖీవాలా జన్మించారు. ఇది ఆయన శతజయంతి సంవత్సరం. భావప్రకటన, పత్రికా స్వాతంత్య్రం కోసం అహర్నిశలు పరితపించిన, రాత్రింబగళ్లు నిరంతర పోరాటం జరిపిన యోధుడు, న్యాయశాస్త్ర కోవిదుడు, రాజ్యాంగ విశ్లేషకుడు పల్ఖీవాలా బొంబాయిలో పల్లకీలను ఉత్ప త్తి చేసే వంశంలో జన్మించినప్పటికీ జీవితంలో ఎన్నడూ తన కోసం, స్వార్థం కోసం ఎవరి పల్లకీలు మోయలేదు... దేశ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ పల్లకీ బోయిగా మాత్రమే ఆయన ఉపయోగపడ్డాడు. నోరు విప్పితే- ‘దేశద్రోహం’గా చిత్రిస్తున్న, పసికందులను సైతం ‘దేశ ద్రోహులు’గా పరిగణిస్తున్న ఈరోజుల్లో గాంధీ మహాత్ముని మాటలు, ఈ మాటలతో ప్రేరణ పొందిన పల్ఖీవాలా జ్ఞాపకం రావడంలో వింతలేదు. తనకు వ్యతిరేకంగా ‘దేశద్రోహం’ కేసు పెట్టి (తన నవజీవన్‌ పత్రికలో నాలుగు వ్యాసాలు రాసినందుకు!) ఆరేండ్ల జైలుశిక్ష విధించినప్పుడు గాంధీజీ అన్న మాటలు- If we do not nurture the freedom of express -ing ones opinion this Country will not go forward.... The smallest of small individuals should have the right to PROT -EST. స్వతంత్ర భారత రాజ్యాంగ రచన కమిటీలో సభ్యుడై ప్రముఖ పాత్ర వహించిన కె.ఎం.మున్షీ The essence of democracy is cri -ticism of government.. అని అన్నారు. స్వతంత్ర భారత రాజ్యాంగంలో, స్వతంత్ర భారతంలో ‘దేశద్రోహం’ (Sedition) అన్న పదం ఉండరాదని మున్షీ అభిప్రాయపడ్డారు. గాంధీజీ, మున్షీ బాటలో నడిచి పల్ఖీవాలా దేశప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయశాస్త్ర బద్ధ పోరాటం నడిపారు.

ఒక జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించిన తర్వాత ఆరేం డ్లకే (1952లో) పల్ఖీవాలా స్వతంత్రుడై వృత్తిని కొనసాగించారు. అనంతరం కేవలం నాలుగేండ్లకే (1956లో) పల్ఖీవాలా సుప్రీంకోర్టులో ఈ దేశంలోని అల్పసంఖ్యాక వర్గాలకు (మైనారిటీలు) సంబంధించిన 29, 30 అధికరణాల మీద సమర్థవంతంగా వాదించి దేశం దృష్టిని, విశేషించి రాజ్యాంగ రక్షణకు ప్రాధాన్యం ఇచ్చే విద్యావంతుల, మేధావుల, చైతన్యవంతుల దృష్టిని ఆకర్షించారు. సుప్రీంకోర్టులో పలు కీలకమైన కేసుల్లో (గోలక్‌నాథ్‌ కేసు, కేశవానంద భారతీకేసు, బ్యాంకుల జాతీయీకరణ కేసు, రాభరణాల రద్దు కేసు మొదలైనవి) అపారమైన న్యాయశాస్త్ర వైదుష్యంతో, అత్యంత సమర్థవంతంగా, అద్భుత వాదనాపటిమతో వాదించి పల్ఖీవాలా రాజ్యంగం ఆధిక్యతను నిరూపించారు. కేశవానంద భారతి కేసులో, సుప్రీంకోర్టులో, పల్ఖీవాలా ఐదు నెలలు వాదించి చరిత్ర సృష్టించారు. ఈ కేసు ప్రాథమిక హక్కుల కేసుగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. భారత రాజ్యాంగం ప్రాతిపదిక స్వరూపాన్ని-బేసిక్‌ స్ట్రక్చర్‌ను (ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు) మార్చే హక్కు, అధికారం భారత పార్లమెంట్‌కు సైతం లేదని సుప్రీంకోర్టు 1973లో మహత్తరమైన తీర్పు ఇవ్వడంలో పల్ఖీవాలా పాత్ర కీలకమైనది, చిరస్మరణీయమైనది. కొన్నేండ్లు కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌ను విశ్లేషిస్తూ (చేతిలో కాగితం ముక్కయి నా లేకుండా) దేశమంతటా పర్యటించి పల్ఖీవాలా కావించిన వందలాది ప్రసంగాలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు వేల వేదికలపై ఆయన కావించి న విజ్ఞానప్రద ఉపన్యాసాలు మరో చరిత్రను సృష్టించాయి.

తన వృత్తి సంపాదనతో భారత వాణిజ్య రాజధాని బొంబాయి నగరాన్ని వేలంలో కొనగలిగిన శక్తి సామర్థ్యాలున్నప్పటికీ పల్ఖీవాలా అతి నిరాడంబరంగా, ధనార్జన కాంక్ష లేకుండా జీవించారు. పార్సీ కుటుంబంలో పుట్టినప్పటికీ, మత దురభిమానానికి అతీతుడై పల్ఖీవాలా హైం దవమతాన్ని, భారతీయ సంస్కృతి వైవిధ్యాన్ని, విశిష్టతను ఎంతో గౌరవించారు. భారతీయ సంస్కృతీ వికాసం పరమావధిగా కె.ఎం.మున్షీ స్థాపించిన భారతీయ విద్యాభవన్‌తో పల్ఖీవాలాకు యాభై ఏండ్ల అనుబంధం. 1990 నుంచి ఆయనే భవన్‌ ఉపాధ్యక్షుడు. చేతికి వచ్చిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవిని, భారత ప్రభుత్వ అటార్నీ జనరల్‌ పదవిని చిరునవ్వుతో తృణీకరించిన త్యాగమూర్తి పల్ఖీవాలా. పల్ఖీవాలా వాదనలు, ఆయన విశ్వాసాలు, అభిప్రాయాలు తమకు నచ్చకపోయినప్పటికీ అప్పటి కేంద్ర ప్రభుత్వ నాయకులు ఆయనను ‘పద్మవిభూషణ్‌' బిరుదంతో సత్కరించారు. ఆయన అరవింద మహర్షి శిష్యుడు. ఆది శంకరాచార్యుల బోధనలను, సిద్ధాంతాలను, తాత్త్వికతను, రచనలను పల్ఖీవా లా శ్రద్ధాసక్తులతో అధ్యయనం చేశారు. మొరార్జీ ప్రభుత్వం పల్ఖీవాలాను అమెరికాలో మన రాయబారిగా నియమించింది. ఏడు విశ్వవిద్యాలయాలు పల్ఖీవాలాను గౌరవ డాక్టరేట్లతో సన్మానించాయి. ప్రాథమిక, మానవహక్కుల పరిరక్షణ కోసం పల్ఖీవాలా ఉద్యమించారని ప్రిన్స్‌టన్‌, (యూఎస్‌ఏ) వర్సిటీ ప్రశంసించింది. భారతదేశానికి భగవంతుడు ప్రసాదించిన కానుక పల్ఖీవాలా అని సి.రాజగోపాలచారి ప్రశంసించారు.

దాదాపు మూడు వందల ఏండ్ల రాచరిక, ముష్కరపాలన నుంచి కేసీఆర్‌ వజ్ర సంకల్పంతో, భీష్మ ప్రతిజ్ఞతో విముక్తి పొంది ఆరేండ్ల కిందట స్వతంత్ర భారతదేశంలో చివరి రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం ఆ మహానాయకుని నేతృత్వంలో ప్రగతిపథాన పయనిస్తూ మూడు పూవులు, ఆరు కాయలుగా వికసిస్తూ, అగ్రగణ్య రాష్ట్రంగా తలె త్తి నిలువడం అద్భుత శుభపరిణామం. ఆరేండ్ల కిందట ‘ఒక్క పైసా లేదు పో’ అన్న తూష్ణీకరణకు గురైన తెలంగాణ ప్రజలు ఈ రోజు ఆర్థిక, సామాజిక, అపూర్వ అభివృద్ధితో, దేశంలోనే అత్యధిక తలసరి సగటు ఆదాయంతో, జాతీయస్థాయి కంటే ఎక్కువ వార్షిక అభివృద్ధి రేటుతో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్‌ను ఇటీవల రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టే ఉన్నత, ఉత్తమ స్థితికి అధిరోహించడం ప్రజాస్వామ్య చరిత్రలో మహోన్నత ఘట్టం. ‘ఉప్పొంగి పోయింది గోదావరి’ అంటూ నాడు పాడిన కవులు ‘గిరులను దాటింది గోదావరి, తరులను చుంబించి గోదావరి, తెలగాణ గోదారి నయగారమొలికింది, తెలగాణ దరులను తాకింది, సిరులను తెచ్చింది గోదావరి, శివమెత్తి ఆడింది గోదావరి’ అని నూతన గీతకలను ఆలాపించవలసి ఉంటుంది.


logo