శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Editorial - Mar 13, 2020 , 23:30:37

పల్లెకు సరి పట్టణానికి నిధి

పల్లెకు సరి పట్టణానికి నిధి

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశంలోని అన్ని పట్టణాలకు కలిపి రూ.50 వేల కోట్లు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కేటాయించిన కేటాయింపుల్లో 20 శాతం ఒక్క హైదరాబాద్‌లోనే ఈయేడు ఖర్చు పెట్టబోతున్నది. హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణ, నగరాలకూ రూ.4 వేల కోట్లు కనీస మౌళిక వసతులు, జీవనప్రమాణాల పెంపు కోసం నిధులు వెచ్చించబోతున్నది.

ఒకవైపు కరోనా ఆర్థికమాంద్యం ఉరుముతూ ఉరకలెత్తిస్తున్నది. మరోవైపు కేంద్రం ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నది. ఇంకోవై పు ప్రైవేట్‌ కార్పొరేట్‌ బ్యాంకులు అవినీతిమయ ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపు కొనసాగుతున్నయి. ఇలాంటి క్లిష్ట సమస్యల ముందర సంక్షేమానికి, సమ్మిళిత అభివృద్ధికి గ్రామాలు, పట్టణాల మధ్య కేటాయింపుల్లో  సమతుల్యత పాటిస్తూ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఆహ్వానించదగిన పరిణామం. 2011 జాతీయ గణాంకాల సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్ర పట్టణ జనాభా 2026 నాటికి 50 శాతం పెరిగి 2036 నాటికి గ్రామీణ జనాభా 40 శాతానికి పడిపోయి 60 శాతం మంది ప్రజలు పట్టణాల్లో నిసించే అవకాశం ఉన్నది.  అయితే ఎక్కువగా హైదరాబాద్‌ జనాభా అదనంగా 40 శాతం పెరిగే అవకాశం ఉన్నది. ‘లియాసిస్‌ పారిస్‌ రియల్‌ ఎస్టేట్‌ రేటింగ్స్‌ పరిశోధన’ సంస్థ 2019లో చేసిన సర్వేలో దేశంలో మొదటి అతిపెద్ద 35 నగరాల్లో ఇండ్ల కొనుగోలు 2 శాతం మేరకు తగ్గిపోయి ఖాళీగా ఇండ్లు మిగిలాయి. దీంతో ఆయా నగరాల్లో 13 లక్షల 10 వేల ఇండ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇంకా చెప్పాలంటే  గ్రేటర్‌ ముంబైలో 7 శాతం, చెన్నైలో 9 శాతం మేర ఇండ్ల కొనుగోళ్లు తగ్గిపోయాయి. హైదరాబాద్‌ లో మాత్రమే 5 శాతం మేరకు ఇండ్ల కొనుగోళ్లు గతం కంటే పెరిగాయి.

‘యూఎస్‌ పాపులేషన్‌ డివిజన్‌' 2018లో జరిపిన సర్వే ప్రకారం 2015-20 కాలంలో శరవేగంగా అభివృ ద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఉండటం రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి నమూనా ను తెలియజేస్తున్నది. పై విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సీఎం కేసీఆర్‌ కళ్లలో కదులుతున్న ‘కోటి ఎకరాల మాగాణి’ నినాద పునాదులపై ‘కోటి జనాల జీవన ప్రమాణాల జాన’ అనేవిధంగా హైదరాబాద్‌ ప్రజలు అత్యున్నతమైన, సురక్షితమైన జీవనం కొనసాగించడానికి ఉక్కు సంకల్పంతో అభివృద్ధిలో దూసుకుపో తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి నెల సుమారు రూ.వెయ్యి కోట్లు నగరాభి వృద్ధి కోసం ఖర్చుచేయడానికి కేటాయింపులు చేస్తున్నారు. మొత్తం లక్ష కోట్ల  ప్రగ తి పద్దులో ఇది 10 శాతంగా ఉండటం గమనార్హం. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశంలోని అన్ని పట్టణాలకు కలిపి రూ.50 వేల కోట్లు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం  కేంద్రం కేటాయించిన కేటాయింపుల్లో 20 శాతం ఒక్క హైదరాబాద్‌లోనే ఈయే డు ఖర్చు పెట్టబోతున్నది. హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణ, నగరాలకూ రూ.4 వేల కోట్లు కనీస మౌళిక వసతులు, జీవనప్రమాణాల పెంపు కోసం నిధులు వెచ్చించబోతున్నది.

2011 జనాభా గణాంకాల ప్రకారం దేశంలో 13.4 శాతం కుటుంబాలకు స్థిర నివాసం లేదని తేలింది. అందులో పట్టణ ప్రాంతంలో నివసించేవారే ఎక్కువ. ఉమ్మడి పాలకులు చేసిన అవినీతి కారణంగా జాతీయ సగటు కంటే 50 శాతం ఎక్కువ గా ఇండ్లు లేని వారున్నారు. అలాగే 1961 జాతీయ గణాంకా ల ప్రకారం పట్టణాల్లో సొంత ఇండ్లు లేని కుటుంబాలు 46 శాతం ఉంటే 57 ఏండ్ల తర్వాత కూడా 2018 ఆర్థిక సర్వే ప్రకారం 28 శాతం ప్రజల సొంతింటి కల ఇంకా నెరవేరలేదు. ఇలాంటి సమస్యలున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతిల్లు లేని నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు కట్టియ్యాలనే ఉద్దేశంతో రెండు పడకల ఇండ్ల నిర్మాణానికి 2018 పద్దుల ప్రకారం రూ. 22 వేల కోట్ల వ్యయంతో 2.83 లక్షల ఇండ్లను నిర్మించి ఇవ్వాలని సంకల్పించింది. అందులో లక్ష ఇండ్లు ఒక్క హైదరాబాద్‌లోనే కడుతామని చెప్పి అమలుచేస్తున్నారు. ఇప్పటివరకు 40 శాతం పూర్తయ్యాయి. మొత్తం పూర్త యితే ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 6 లక్షల జనాభాకు తమ సొంతింట్లో నిద్రిం చే మహాభాగ్యం కలుగుతుంది. అందుకే ఈ బడ్జెట్‌లో గతం కంటే 10 రెట్ల నిధులను పెంచారు. 

ఇక పల్లె ప్రజల జీవనప్రమాణాలు, ఆయురార్థం పెంచడానికి, ఎవరి సహాయం లేకుండా స్వశక్తితో వ్యవసాయం చేసి మంచి దిగుబడి పొందడానికి, మానసిక స్థైర్యంతో జీవనం కొనసాగించడానికి బడ్జెట్‌లో ప్రగతి పద్దు కింద రూ.42,729 కోట్లను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, వ్యవసా య, అనుబంధశాఖల రూపే ణా నిధులను కేటాయించిం ది. ఇది మొత్తం ప్రగతి పద్దులో 43 శాతం కావడం 60 శాతం గ్రామీణ జనాభాకు లబ్ధి చేకూరనున్నది.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ది. వారి సంప్రదాయ వృత్తులను ప్రోత్సహిస్తున్నది. చేపల ఉత్పత్తిలో ప్రపంచంలో నే భారత్‌ మూడవ అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం. ఈ రంగంలో కోటి నలభై లక్షల మం దికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పాలు, మాంసం ఉత్పత్తిలో యూపీ వాటా అమోఘం. సంప్రదాయ, స్వయం ఉపాధి ఉత్పత్తి, సేవారంగాలను ఉమ్మ డి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రాంతానికి రావలసిన లాభాలు రాకుండా చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో బర్లు, గొర్లు, మేకలు పంపిణీ చేస్తున్నది. దీనివల్ల ఈ యేడాది జాతీయ సగటు కంటే రెండింత ల వృద్ధి సాధించింది తెలంగాణ రాష్ట్రం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెరిగాయనడంలో సందేహం లేదు.


logo