గురువారం 09 ఏప్రిల్ 2020
Editorial - Mar 12, 2020 , 23:44:37

వివక్షకు వికృత రూపం

వివక్షకు వికృత రూపం

నేను ఈ వ్యాసం రాస్తున్న సమయానికి ప్రయాణికులతో కూడిన గ్రాండ్‌ప్రిన్సెస్‌ నౌక ఓక్‌లాండ్‌ డాక్‌యార్డ్‌లో నిలిచి ఉన్నది. అది కాలిఫోర్నియా నుంచి వ్యాధిగ్రస్థులైన కొందరితో వచ్చింది. కరోనా వైరస్‌ సోకిన వారిని నౌకను దిగడానికి ముందు పరీక్షించి తగు చికిత్సలు, మందులు ఇవ్వవలసిన ఆవశ్యకత ఏర్పడింది. స్థానిక అధికారులు ఓడలోని వారికి ఇచ్చేందుకు ఔషధాలను విమానం ద్వారా తరలించాల్సి ఉన్నది. కానీ ట్రంప్‌ అధికారగణం మాత్రం వారికి వైద్యసాయం అందించటంలో తగురీతిలో స్పందించిన దాఖలాలు కనిపించలేదు.

అమెరికా అభివృద్ధి, ముందుచూపు, చాతుర్యం, నైపుణ్యా ల గురించి ఎంతో పేరున్నది. రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో అమెరికా సాధించిన విజయాలు, శాస్త్ర సాంకేతికరంగాల్లో పురోగతి ఘనమైనవి. అంతరిక్షం మొదలుకొని సమస్తరంగాల్లో అమెరికాకు ఏ దేశం సాటి లేదనేది వాస్త వం. అయినా అమెరికా సాధించిన విజయాల్లో కూడా కొన్ని ఖాళీలున్నాయని వియెత్నాం యుద్ధంలో ఓడిపోయిన తర్వాత తెలిసివచ్చింది. అప్పటినుంచి అమెరికా ఘనతను పునర్నిర్వచించటం మొదలైంది. ఇటీవలికాలంలో అమెరికాను పీడిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు అమెరికా పరిమితులను చాటిచెబుతున్నాయి. వరదలు, హరికేన్లు, టోర్నడోలు అమెరికాను అతలాకుతలం చేస్తున్న తీరు అమెరికా సాధించిన ఘనత, అభివృద్ధిని వెక్కిరించే విధంగా ఉంటున్నది.


గతంలో ఎదుర్కొన్న అనేక సమస్యలను అమెరికా తనదైన శైలిలో పరిష్కరించుకున్నది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అణ్వాయుధాల తయా రీలో ముందడుగువేసి ప్రపంచం ముందు నిలిచింది. భూకంపాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అమెరికా అనేక ముందస్తు చర్యలు తీసుకున్నది. అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో సంరక్షణ చర్యలకు సంబంధించి మాక్‌డ్రిల్స్‌ కూడా నిరంతరం నిర్వహిస్తారు. బయటినుంచి చూసేవారికి అమెరికా తీసుకుంటు న్న ముందస్తు జాగ్రత్తలు చూస్తే అబ్బురమనిపిస్తుంది. పాఠశాల నుంచి వివిధ సంస్థల దాకా పటిష్ట రక్షణ చర్యలు తీసుకుంటారు. అణ్వాయుధ దాడి మొదలు కొని వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే వైపరీత్యాల దాకా అమెరికా దేనినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటుంది. కానీ.. ప్రస్తుత కోవిడ్‌-19 విషయమై అమెరికా తీసుకున్న ముందస్తు చర్యలను గమని స్తే ఏ మాత్రం సిద్ధంగా, క్రియాశీలంగా లేదని తెలుస్తుంది.కరోనా వైరస్‌ విషయంలో స్థానిక పాఠశాల యాజమాన్యం మొదలు శ్వేతసౌధం దాకా ఘోర వైఫల్యం కనిపిస్తున్నది. చైనా గత రెండు నెలలుగా కరోనాను ఎదు ర్కోవటం కోసం చేస్తున్న పోరాటం, ప్రయత్నాలు కండ్ల ముందు కనపడుతున్నా, అమెరికా కనీసంగా ముందుజాగ్రత్త వహించలేదు. ఈ వైఫ ల్యం మనకేం చెబుతున్నది!


నేను ఈ వ్యాసం రాస్తున్న సమయానికి ప్రయాణికులతో కూడిన గ్రాండ్‌ప్రిన్సెస్‌ నౌక ఓక్‌లాండ్‌ డాక్‌యార్డ్‌లో నిలిచి ఉన్నది. అది కాలిఫోర్నియా నుంచి వ్యాధిగ్రస్థులైన కొందరితో వచ్చింది. కరోనా వైరస్‌ సోకిన వారిని నౌకను దిగడానికి ముందు పరీక్షించి తగు చికిత్సలు, మందులు ఇవ్వవలసిన ఆవశ్యకత ఏర్పడింది. స్థానిక అధికారులు ఓడలోని వారికి ఇచ్చేందుకు ఔషధాలను విమానం ద్వారా తరలించాల్సి ఉన్నది. కానీ ట్రంప్‌ అధికారగణం మాత్రం వారికి వైద్యసాయం అందించటంలో తగురీతిలో స్పందించిన దాఖలాలు కనిపించలేదు. దీంతో ఓడలోని కరోనా బాధిత ప్రయాణికులు ప్రభుత్వ నిర్లక్ష్యానికీ బలయ్యే పరిస్థితి ఏర్పడింది. రోగగ్రస్థులంతా ఓడలోని గదుల్లోనే పరీక్షల కోసం ఎదురుచూశా రు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రమాదాన్ని ఎదుర్కొనే సంసిద్ధత లేదు. దీంతో దేశవ్యాప్తంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. ఇతర దేశాలు ముఖ్యంగా ఇటలీ, దక్షిణకొరియాలో ఉన్న కుటుంబ సభ్యులు, మిత్రుల నుంచి చాలా విషాదకరమైన వార్తలు సామాజిక మాధ్యమాల ద్వారా వింటున్న స్థితి ఏర్పడింది.


కరోనా వైరస్‌ విస్తరణ అమెరికా సమాజంలోని అసమానతలను, లొసుగులను బహిర్గతపరిచింది. సిలికాన్‌వ్యాలీలోని ఉద్యోగులు, కులీన నగరవాసులంతా తమ పనులను ఇండ్లనుంచే చేసుకోవటం ప్రారంభిం చారు. అభివృద్ధి చెందిన టెక్నాలజీ వెబ్‌-2.0 సాయంతో పనులు జరు గుతున్నాయి. అమెజాన్‌, గూగుల్‌ ఇంకా ఇతర కార్పొరేట్‌ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను తమ ఇండ్లనుంచే పనులు చేయాలని ఆదేశించాయి. విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధనలు జరుగుతున్నాయి. నీవు విజ్ఞానవంతుడివైతే నీకు పని చేయడానికి ఎప్పటికీ అవకాశం ఉంటుందని చెప్పే అమెరికాలో ఇప్పుడున్న పరిస్థితి ఇది. ఒకవేళ నీకు ఉన్నతవర్గాలకున్న సౌక ర్యం లేకపోతే.., నీవు నీ జీవనభృతి కోసం రోడ్డెక్కాల్సి వస్తే వైరస్‌తో సహజీవనం చేయాల్సిందే. ఎస్‌ఎఫ్‌ అఖాతం ప్రాంతంలో వేలాదిమంది కనీస పారిశుధ్యం లేక అవస్థలు పడుతున్నారు. విస్తారంగా ఉన్న కార్మికులు, ఇతర పనులు చేసకునేవారూ పనికి దూరంగా ఉండలేక జీవన్మరణ స్థితిని ఎదుర్కొంటున్నారు.


 వ్యాపారులు తమ కార్యకలాపాలను నిలిపేస్తే, తమ వద్ద పనిచేసే వారికి దిన కూలీలు చెల్లించలేని స్థితి ఏర్పడింది. నిర్మాణ, రవాణా రంగాల కార్మికులు, చిల్లర వ్యాపారులు అనివార్యంగా పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఉన్నది. జిల్లా, ప్రాంతీయ అధికారులు పాఠశాల విద్యార్థులను ఇండ్లకే పరిమితం కావాలని కోరా రు. ఒక పాఠశాలలు మాత్రమే కాదు, దవాఖానలతో సహా ప్రభుత్వరంగంలోని ప్రతి సంస్థ మూతపడింది. న్యూయార్క్‌ నగరంలోని అనాథలైన వేలాది మంది పాఠశాల విద్యార్థులు స్కూళ్లలో ఒక పూట తిండితో బతుకులు వెళ్ళదీస్తున్నారు. ఈ విద్యార్థులను గాలికివదిలేసి అధికారులు తమ దారిన తాము వెళ్లిపోయారు. నిజానికి ఇలా వ్యవహరించినందుకు, విద్యార్థులకు కనీస వైద్య సాయం అందించనందుకు ట్రంప్‌ వారిని తగిన విధం గా శిక్షించాలి.


అమెరికాలో జరిగిన వైద్యరంగ, జీవిత బీమా రంగాల ప్రైవేటీకరణ కారణంగా ఏర్పడుతున్న దుష్పరిణామాలు రాబోయేకాలంలో మరింత వికృతంగా ఉండబోతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా బీమా లేని వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఒక కాలిఫోర్నియా నగరాన్నే తీసుకుంటే దక్షిణ అమెరికా నుంచి వలసవచ్చిన వారిలో 40 శాతం మందికి ఎలాంటి వైద్య సదుపాయం అందించే భద్రత లేదు. 


అమెరికాలో జరిగిన వైద్యరంగ, జీవిత బీమా రంగాల ప్రైవేటీకరణ కారణంగా ఏర్పడుతున్న దుష్పరిణామాలు రాబోయేకాలంలో మరింత వికృతంగా ఉండబోతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా బీమా లేని వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఒక కాలిఫోర్నియా నగరాన్నే తీసుకుంటే దక్షిణ అమెరికా నుంచి వలసవచ్చిన వారిలో 40 శాతం మందికి ఎలాంటి వైద్య సదుపాయం అందించే భద్రత లేదు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినా దాని ఆసరాగా దండుకునే వారే ఎక్కువయ్యారు కానీ, బాధితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే వారు కరువయ్యారు. అమెరికా ప్రభుత్వంలోని అనేక రంగాలు, వ్యవస్థలు ప్రైవేటు పరమై, వాటి నుంచి ప్రజలకు కష్టకాలంలో అందాల్సిన సేవలు అందక పోగా, ప్రభుత్వ ధనమంతా ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి పోతున్నది. ఇరా క్‌, ఆఫ్ఘనిస్థాన్‌ యుద్ధాలు కూడా ప్రైవేటుపరం చేసిన తీరు అమెరికాలోనే గాక, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. ఈ నేపథ్యం లో కోవిడ్‌-19ను కట్టడి చేయటానికి బదులుగా, ప్రైవేటురంగం గత ఆచరణకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాల్లో మునిగి ఉన్నది.


ఈ విషాద గాథ ఇలా ఉంటే, అమెరికాలోని భిన్న సామాజిక సమూహాల జీవనం మరింత బాధాకరమైనది. ఉదారవాద పరిశీలకులు కూడా ట్రంప్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ట్రంప్‌ నిర్లక్ష్యానికి మరో కోణం కూడా ఉన్నది. ఎన్నికల్లో లబ్ధి కోసమే వ్యూహాత్మకంగానే ట్రంప్‌ ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలున్నాయి. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి రాబోయే అధ్యక్ష ఎన్నికల కోసం లెక్కలేసుకుంటున్నది. క్రిస్టియన్‌ సమూహాల ఓట్ల కోసం ప్రణాళికాబద్ధ నిర్లక్ష్యానికి పూనుకుంటున్నది.


మొత్తం మీద కన్సర్వేటివ్‌లు, క్రిస్టియన్‌ మత బోధకులు కరోనా వైరస్‌ను త్వరలోనే కట్టడి చేస్తామని చెబుతున్నారు. ఒక మతబోధకుడైన క్రిస్టియన్‌ ఫాదర్‌ అయితే.. ప్రపంచంలో పతనమైన లైంగిక జీవనం ఫలితమే ఈ వైరస్‌ అని చెప్పుకొస్తున్నారు. మరికొందరు ఆశాజీవులు ఇది దైవదత్తం కాదంటున్నారు. మరొకరైతే ఇజ్రాయిల్‌కు తగురీతిన సాయం గా నిలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని చెబుతున్నారు. మరొక జ్యోతిష్కుడైతే.. గర్భవిచ్ఛిత్తి విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటే కరోనా వచ్చేదికాదని చెబుతున్నాడు.


ముఖ్యమైన విషయమేమంటే.. ట్రంప్‌ నోటి నుంచి వచ్చే మాటలే ఆ సమాజం నుంచి వస్తున్నాయి. మైనారిటీలకు వ్యతిరేకంగా  క్రిస్టియన్‌ జాతీయవాదం ఎలా ఉంటుందో, ఎలా మాట్లాడుతుందో వ్యక్తమవుతున్నది. వివిధ సామాజిక సమూహాలు, మైనారిటీలు, వలసజీవులు, స్త్రీలు, ప్రజాస్వామికవాదుల పట్ల ట్రంప్‌ వ్యతిరేక వైఖరిని చాటుకుంటున్నారు. ఒబా మా కాలంలో కూడా జ్యోతిష్కులు ఎబోలా వైరస్‌, ఆఫ్రికా జాతికి చెంది న వ్యక్తిపాలన మూలంగానే వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇలాంటివెన్నో కథనాలు అమెరికా సంపన్న కన్సర్వేటివ్‌ వర్గాల్లో ప్రచారంలో ఉన్నాయి.


అమెరికా ప్రభుత్వం తరఫున కోవిడ్‌-19ను నివారించటానికి బాధ్య త వహిస్తున్న ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ స్వయంగా సంప్రదాయ క్రిస్టియ న్‌. ఇతను ఇప్పటివరకు విస్పష్ట ప్రకటన చేయలేదు. వైరస్‌ విస్తరణను అడ్డుకోవటం కోసం, బాధితులకు సరైన వైద్యం అందించటం కోసం చాలినంతగా ప్రయత్నిస్తున్న దాఖలాలు కనిపించకపోవటం ఆశ్చర్యక రం. ఈ క్రమంలో అమెరికా శాస్త్రవేత్తల అశక్తత సర్వ త్రా కనిపిస్తున్నది. ఈ సంక్షోభం అమెరికా సమాజానికి సంబంధించినది మాత్రమే కాదు, మొత్తం ఆధునిక సమాజానిది. మన ఆధునికాభివృద్ధి, శాస్త్రసాంకేతిక రంగాలది కూడా. ప్రకృతి వనరులను విస్తారంగా కొల్లగొట్టడం కారణం గా తలెత్తిన విపత్తు. ఈ ధోరణిని విడనాడకుంటే.. మనం మళ్లీ తిరిగిరాని ప్రమాద తీరాలకు చేరుకుంటాం.

(వ్యాసకర్త: చరిత్ర విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో స్టేట్‌ యూనివర్సిటీ)


logo