గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 12, 2020 , 23:42:31

ప్రగతి పట్టణం

ప్రగతి పట్టణం

పట్టణాల్లో అస్తవ్యస్థంగా ఉన్న విద్యుత్‌ తీగలు, స్తంభాలు, రోడ్లపక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లతో ప్రమాదాలు జరిగి, ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా విద్యుత్‌ వ్యవస్థను బాగు చేస్తున్నారు. రానున్న 8 నెలల్లో ప్రమాద రహిత విద్యుత్‌ సరఫరాను పట్టణాల్లో ఉండేవిధంగా అధికారులను కేటీఆర్‌ పురమాయించారు.

తెలంగాణ రాష్ట్రం పసికందు అయితేనేమి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో దేశం నివ్వెరపోయే విధంగా అగ్రగామిగా నిలబడుతున్నది. రాష్ట్రం సాధించుకున్నప్పటి నుం చి ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్‌ ప్రభుత్వంపై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తూ అభివృద్ధికి, సంక్షేమానికి, సుపరిపాలనకు అడుగడుగునా అవరోధాలు కల్పిస్తూ బురదజల్లుతున్నాయి. ఏ కార్యక్రమమైనా మొకాలొడ్డటమే కానీ, నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వలేకపోతున్నాయి. దృఢమైన మనసులు, సృజనాత్మక ఆలోచనల గురించి చర్చిస్తాయి. బలహీన మనస్సులు వ్యక్తుల గురించి మాత్రమే చర్చిస్తాయని ప్రముఖ గ్రీకు తత్వవేత్త సోక్రటీస్‌ అన్న మాటలు ఈ సందర్భంగా మన నం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సృజనాత్మక చింతనే కాకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, సాహసోపేతంగా వాటిని అమలుపర్చడంలో ఆయనకు ఆయనే సాటి. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణం గా గతంలో నిర్వహించిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చిం ది. దాని స్ఫూర్తి గా రాష్ట్రంలో మొదటి దఫాగా ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం విజయవంతమైంది.


దేశంలో పలు మహా నగరాలు, పట్టణాలు వాయు, శబ్ద కాలుష్యంతో, బస్తీలు, ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్‌ సమస్యతో సతమతమవుతున్నాయి. కనీ స మౌలిక సదుపాయాలు కరువై పట్టణవాసులకు జీవనం దుర్లభంగా మారింది. తెలంగాణలో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతున్నది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 42.6 శాతం ప్రజలు నగరాల్లో జీవిస్తున్నారని 2023 నాటికి ఇది 50 శాతం దాటుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో పెట్టుకొని పట్టణాల్లో పారదర్శకమైన పాలన కోసం, 128 మున్సిపాలిటీ లు, 13 మున్సిపల్‌ కార్పొరేషన్ల కోసం నూతన తెలంగాణ మున్సిపాలిటీ చట్టం-2019 తీసుకొచ్చారు. దాన్ని అక్షరాల అమలుపరుచడానికి పదిరోజుల పట్టణ ప్రగతిని చేపట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక మంచి పట్టణం ఎలా ఉండాలనే అంశం పై సంపూర్ణ అవగాహన ఉన్నది. ప్రతిరోజు చెత్తను, మురుగునీటిని నిర్మూలించి పరిశుభ్రంగా ఉంచడం, శుద్ధమైన మంచినీటి సరఫరా జరుగడం, రాత్రుల్లో వీధిలైట్లు వెలుగులు వెదజల్లడం లాంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే రహదారులపై గుంతలు ఉండకుండా చూసుకోవడం, పట్టణాల్లో పచ్చదనం పెంచడం, డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికలు, సమీకృత మార్కెట్లు, యువతకు క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లు ఇవ న్నీ ఉంటేనే అది మంచి పట్టణం అవుతుందనేది కేసీఆర్‌ భావన. ఈ ఆలోచనలకు అనుగుణంగానే పట్టణ ప్రగతి కార్యక్రమం ముఖ్యంగా ఐదు అం శాలపై కేంద్రీకరించారు. 1.పారిశుధ్య నిర్వహణ 2.హరిత ప్రణాళిక, 3.విద్యుత్‌ సరఫరా 4. నగరస్థాయి ప్రణాళికలు, చర్యలు, 5.అక్రమ లే ఔట్‌ల గుర్తింపు తదితరాలున్నాయి.


పారిశుధ్య నిర్వహణలో భాగంగా ఎప్పటికప్పుడు చెత్తా చెదారాన్ని తొలిగించడం, మురుగు కాల్వలను శుభ్రపరుస్తూ మురుగునీరు నిల్వ లేకుండా ప్రవహించేరీతిగా చర్యలు తీసుకున్నారు. దుర్వాసన, ఈగలు దోమల బారి నుంచి పట్టణ ప్రజలను కాపాడుతున్నారు. ఆరోగ్యం కోసం పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల కూల్చివేత, పబ్లిక్‌ మూత్రశాలల మరమ్ముతులు, నూతన నిర్మాణాలు చేపడుతు న్నారు. చెత్తను డంపింగ్‌యార్డులకు తరలించేందుకు, పారిశుధ్య నిర్వహణకు 3100 వాహనాలు అవసరమని నిర్ధారించి, ఇప్పటికే అందుబాటు లో ఉన్న 600 వాహనాలకు మరో 2,500 వాహనాల కొనుగోళ్లకు అనుమతులు ఇచ్చారు. పారిశుధ్య నిర్వహణతో పాటుగా కాలుష్య నివారణ కూడా తప్పనిసరి. ఇంటింటికి విధిగా మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరంగా చేపట్టారు. పది రోజులుగా కొనసాగిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో హరిత ప్రణాళిక వంద శాతం విజయవంతమైందని ప్రజలు సంతోషిస్తున్నారు.


పట్టణాల్లో అస్తవ్యస్థంగా ఉన్న విద్యుత్‌ తీగలు, స్తంభాలు, రోడ్లపక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లతో ప్రమాదాలు జరిగి, ప్రజలు ప్రాణాలు కోల్పోకుం డా విద్యుత్‌ వ్యవస్థను బాగు చేస్తున్నారు. రానున్న 8 నెలల్లో ప్రమాద రహిత విద్యుత్‌ సరఫరాను పట్టణాల్లో ఉండేవిధంగా అధికారులను కేటీఆ ర్‌ పురమాయించారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసు కుంటున్నారు. స్థానిక ప్రజల భాగసామ్యంతో నిర్దిష్టమైన ప్రదేశాల్లో పార్కింగ్‌ సదుపాయలు కల్పిస్తు న్నారు. అన్ని పట్టణాల్లో ఉద్యానవనాల, క్రీడాస్థలాల ఏర్పాటు, ఓపెన్‌జిమ్‌ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని, మానసిక, శారీరక ఆరోగ్య రక్షణకు వీటి అవసరం ఎంతో ఉన్నది. అందుకే ఇప్పటికే హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ వంటి పట్టణాల్లో వీటిని ఏర్పాటుచేశారు. గతంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పట్టణప్రగతిలో గుర్తించారు. రోడ్ల సుందరీకరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించడం జరిగింది. ‘ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌' కార్యక్రమానికి అనుగుణంగా పట్టణప్రగతిలో ఇంటింటికీ సర్వే నిర్వహించి నిరక్షరాస్యులను గుర్తించి, వారిని అక్షరా స్యులుగా మార్చేందు కు కృషి చేస్తున్నారు.


ప్రభుత్వాధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో, ఉద్యోగ నిబద్ధతతో పనిచేసినట్లయితే ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి. నూతన మున్సిపాలిటీ చట్టంలో పేర్కొన్నట్లు ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వా మ్యంతో 50 శాతం పనులను పూర్తిచేసి పైసా ఖర్చులేకుండా పట్టణాలకు మహర్దశను తీసుకురావచ్చు. నూతన మున్సిపల్‌ చట్టం-2019లో నిర్దేశించిన లక్ష్యాలకు, గమ్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘బంగారు తెలంగాణ’ స్వప్నం త్వరలోనే సాకరమవుతుంది.

(వ్యాసకర్త: డీన్‌, ఫ్యాకల్టీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, కేయూ)


logo
>>>>>>