సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Mar 12, 2020 , 23:41:04

బాధ్యతారహిత ప్రకటన

బాధ్యతారహిత ప్రకటన

‘కరోనా’ వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని వణికి స్తున్నది. ఈ వ్యాధి నుంచి తమ ప్రజలను రక్షించుకునేందుకు కరోనా ప్రభావిత దేశా లు అవిరళ కృషిచేస్తున్నవి. చైనాను తీసుకు న్నట్లయితే అత్యాధునికమైన టెక్నాలజీతో పది రోజుల్లో వెయ్యి పడకల దవాఖానను నిర్మించుకొని కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నది. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే భారతీయులను కరోనా లక్షణాల్లేవని వైద్యు లు నిర్ధారిస్తేనే దేశంలోకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం హేయనీ యం. కరోనా లక్షణాలున్న భారతీయుడు విదేశాల్లోంచి వస్తే వారికి మెరుగైన చికిత్స అందించి కాపాడుకోవాల్సింది పోయి కేంద్రం ఇలా బాధ్యతారహితంగా ప్రకటించ టం విడ్డూరం.   

- మడిగ రామస్వామి, అంతారం, చేవెళ్ల


వెంటనే మరమ్మతులు చేయాలె

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలు తాగడానికి మంచినీళ్లు లేక ఎన్ని తిప్పలు పడ్డారో స్వయంగా చూసిన సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ఆవి ర్భావ అనంతరం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ‘మిషన్‌ భగీరథ’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పుడు మారుమూల గ్రామాలకు కూడా ‘మిషన్‌ భగీరథ’ నీరు అందుతున్నది. అయితే అక్క డక్కడా ‘మిషన్‌ భగీరథ’పైపులు లీకేజీ అయి చుక్కచుక్కా ఒడిసి పట్టు కున్న నీళ్లు రోడ్డు పాలవుతున్నాయి. కాబట్టి సంబంధిత అధికారులు లీకేజీ పైపులకు వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.      

- చుంచు అరుణ్‌కుమార్‌, వెల్గనూర్‌, మంచిర్యాల జిల్లా


కల్తీని అరికట్టాలె

నగరాల్లోని హోటళ్లలో ప్రతి నిత్యావసర వస్తువులో కల్తీ రాజ్యమేలుతు న్నది. పాల నుంచి మొదలు వంటనూనె వరకు కల్తీ వస్తువులు తయారు చేస్తున్నారు. తద్వారా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కాబ ట్టి సంబంధిత అధికారులు కల్తీని అరికట్టి కల్తీ వ్యాపారులపై కఠిన చర్య లు తీసుకోవాలి. అప్పుడే ప్రజల ప్రాణాలను రక్షించినవారమవుతాం.   

- జవ్వాజి సుధాకర్‌, కురిక్యాల, కరీంనగర్‌


logo