శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Mar 12, 2020 , T00:04

ఓర్వలేకే సింగరేణిపై అక్కసు

ఓర్వలేకే సింగరేణిపై అక్కసు

ఎన్‌.శ్రీధర్‌ సింగరేణిని దేశంలోనే నెంబర్‌-1 కంపెనీగా నిలిపారు. 2014తో పోలిస్తే 2019 నాటికి కంపెనీ వివిధ విభాగాల్లో సాధించిన ప్రగతి దీనికి ఉదాహరణ. సింగరేణిని నవరత్న కంపెనీలకు దీటుగా నిలబడేలా చేశారు. థర్మల్‌, సోలార్‌ విద్యుత్తు ఉత్పాదన రంగంలోకి దిగిన తొలి బొగ్గు కంపెనీగా సింగరేణి రికార్డుకెక్కడానికి ఎన్‌.శ్రీధర్‌ కృషినే ప్రధాన కారణం. సంక్షేమంలో కూడా సింగరేణి అగ్రభాగాన ఉంటున్నది.

‘సింగరేణి అవినీతి గని’గా మారిందంటూ రాసిన కథనాల్లో అయిదు అంశాలను లేవనెత్తారు. ఓసీ గనుల్లో ఓవర్‌ బర్డెన్‌ తొలిగించే కాంట్రాక్టర్ల నియామకంలో రాజకీయ జోక్యం ఉంటున్నదని,కాంట్రాక్టర్లకు మేలు చేసేవిధంగా ‘లీడ్‌' (దూరం) లెక్కల్లో తప్పు రాస్తున్నారనీ, తాడిచర్ల అనే బొగ్గు బ్లాకును వేరేవాళ్లకు అప్పగించారనీ, ఈ-యాక్షన్‌ ద్వారా బొగ్గు అమ్మలేకపోతున్నారని,సీ అండ్‌ ఎండీ వచ్చి నాలుగేండ్లయినా ఇంకా వెళ్లిపోవడం లేదు, గతంలో ఏ సీఎండీ ఇంతకాలం పనిచేయలేదనీ ఆరోపించారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలు. 

సింగరేణి కాలరీస్‌ కంపెనీపై ఒక పత్రిక, రెండు న్యూస్‌ ఛాన ల్స్‌ బురదజల్లే యత్నం చేశాయి. కించపరుచడమే ధ్యేయంగా సాగిన ఈ పసలేని కథనాలను సింగరేణి కార్మికులతో పాటు తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నది. గతం లో ఇలాంటి విద్వేషపూరిత కథనాలు తెలంగాణ ప్రాజెక్టులపై, విద్యుత్‌, ఆర్టీసీ సంస్థలపై కూడా వచ్చాయి. కాబట్టి వీళ్ల పని ‘విషం చిమ్మడమే’నని సింగరేణి ఉద్యోగులు అర్థం చేసుకుంటున్నారు.‘సింగరేణి అవినీతి గని’గా మారిందంటూ రాసిన కథనాల్లో అయిదు అంశాలను లేవనెత్తారు. ఓసీ గనుల్లో ఓవర్‌ బర్డెన్‌ తొలిగించే కాంట్రాక్ట ర్ల నియామకంలో రాజకీయ జోక్యం ఉంటున్నదని, కాంట్రాక్టర్లకు మేలు చేసేవిధంగా ‘లీడ్‌' (దూరం) లెక్కల్లో తప్పు రాస్తున్నారనీ, తాడిచర్ల అనే బొగ్గు బ్లాకును వేరేవాళ్లకు అప్పగించారనీ, ఈ-యాక్షన్‌ ద్వారా బొగ్గు అమ్మలేకపోతున్నారని, సీ అండ్‌ ఎండీ వచ్చి నాలుగేండ్లయినా ఇంకా వెళ్లిపోవడం లేదు, గతంలో ఏ సీఎండీ ఇంతకాలం పనిచేయలేదనీ ఆరోపించారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలు. సింగరేణిలో ఓవర్‌ బర్డెన్‌ కాంట్రాక్టు పనుల కేటాయింపుపై ఒక అసంబద్ధమైన ఆరోపణ చేశారు. సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్‌ పనుల కేటాయింపులు ఎలా జరుగుతాయనే విషయంపై అవగాహన ఉంటే ఈ ఆరోపణ చేసేవారు కాదు. ఓబీ పనుల కేటాయింపు వ్యవహారం మొత్తం ఆన్‌లైన్‌ ద్వారా, ఓపెన్‌ టెండర్‌ విధానంలో జరుగుతుంటుంది. ఇది కోట్ల రూపాయల వ్యయంతో కూడుకున్నది కనుక అన్ని విషయాలు పారదర్శకంగా నిర్వహిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఎవరు తక్కువ రేటు కోట్‌ చేస్తా రో వారినే ఎల్‌-1గా గుర్తించి, పనులు కేటాయిస్తారు. ఇదంతా ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారానే జరుగుతుంది.ప్రస్తుతం రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని కూడా అమలు జరుపుతున్నారు. ఈ విధానం ద్వారా ఎల్‌-1 రేటును ప్రామాణికంగా తీసుకొని మరొకసారి ఆన్‌లైన్‌లో బిడ్డింగ్‌ అవకాశం ఇస్తారు. ఈ రివర్స్‌ టెండర్‌లో ఎవరు ఎల్‌-1గా ఉంటారో వారికే ఓబీ కాంట్రాక్టు పని అప్పగిస్తారు. అదికూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారులు సభ్యులుగా ఉండే బోర్డ్‌ డైరెక్టర్ల సమావేశంలో పరిశీలించి, ఆమోదించిన తర్వాతే కేటాయిస్తారు. ఈ ప్రక్రియ ఇంత పారదర్శకంగా సాగుతున్నప్పుడు, ఏ వ్యక్తికీ అనుకూలంగా వ్యవహారించే అవకాశమే లేదు.

ఓబీ కాంట్రాక్టర్లకు లీడ్‌ విషయంలో అనుకూల అక్రమాలు అంటూ మరో పాతకాలం నాటి ఆరోపణ చేశారు. సింగరేణి సర్వే విభాగంలో అంతకుముందటి సాంకేతికత వేరు. ఇప్పటి ఆధునిక సాంకేతికత వేరు. కచ్చితమైన లెక్కలను పొందుపర్చగలిగిన 3 డీ లేజర్‌ స్కానర్‌ యంత్రాల ద్వారా ఓవర్‌ బర్డెన్‌ పనుల అంచనాలు, తవ్వకాలు, కొలతలు, లెక్కలు అన్నీ తేడా లేకుండా జరుపుతున్నారు. గతంలో మాదిరి మానవ ప్రమే యం లేదు. ఓబీ తవ్వే బెంచీ నుంచి ఓబీని పోసే డంపు వరకూ దూరా న్ని కచ్చితంగా ముందుగా గుర్తించి కాంట్రాక్టులో పొందుపరుస్తున్నారు. అసలు ఓబీ కాంట్రాక్టరు, ఎంత మట్టిని, ఎంత విస్తీర్ణంలో ఎక్కడ నుంచి తీయాలి, దాన్ని ఎంత దూరంలో గల, ఏ డెక్‌ మీద ఎలా పోయాలనేది ఆర్డర్‌ కాపీలోనే పొందుపరుస్తున్నారు. రెండంచెల తనిఖీని ప్రవేశపెట్టా రు. కర్నాటకలో గాలి జనార్ధన్‌రెడ్డి గనుల్లో, తొలిగించిన ఖనిజం పరిమాణాన్ని కొలవడానికి ప్రభుత్వం సింగరేణికి చెందిన ఈ స్కానర్‌ను వినియోగించిందీ అంటే దీని ప్రామాణికతను అర్థం చేసుకోవచ్చు. అలా గే వార్తల్లో పేర్కొన్న మేడిపల్లి ఓసీ లీడ్‌ లెక్క వ్యవహారం కూడా తెలంగాణ రాకపూర్వం జరిగిన పాత విషయం. ఆ కేసులో విచారణలు పూర్త యి కూడా ఏండ్లు గడుస్తున్నాయి. ఇప్పుడు ఆ తరహా తప్పు జరిగే అవకాశమే లేదు, జరిగితే ఉపేక్షించే పరిస్థితి కూడా లేదు.తాడిచర్ల బ్లాకును వేరే వాళ్లకు కంపెనీ ఇచ్చిందనేది మరో ఆరోపణ.  ఉమ్మడి ఏపీలో వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం తాడిచర్ల బ్లాకు ను నాటి రాష్ట్ర జెన్‌కోకు కేటాయించారు. దీనిలో సింగరేణి పాత్ర ఏముంటుంది? బొగ్గు బ్లాకు కేటాయించేది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ. ఇది జరిగి దాదాపు పదేండ్లు కావస్తున్నది.

సింగరేణికి నేడు ఒడిశాలో నైనీ, న్యూ పాత్రపాద అనే రెండు బ్లాకు లను కేంద్రం కేటాయించింది. సింగరేణి వృద్ధిరేటు చూసి కేంద్రం ఈ కేటాయింపు జరిపింది. ఇది తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి సాధించిన విజయం. పదేండ్ల కిందటి తాడిచర్ల బ్లాకు గురించి ప్రస్తావించినవారు ఇప్పుడు సింగరేణి సాధించిన 1500 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వల భారీ బ్లాకుల విషయాన్ని గుర్తించకపోవడం దురుద్దేశమే!.సింగరేణిలో అటెండెన్స్‌ విధానం ఎస్‌ఏపీ (శాప్‌) ద్వారా నడుస్తుంది. అటెండెన్స్‌ పడిన వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా నమోదవుతుంది. అటెండెన్స్‌ పడినవారు బయటకు పోతున్నప్పుడు కూడా ఔట్‌మస్టర్‌ పడాలి. గుర్తిం పు యూనియన్‌ నాయకులు కొందరికి కంపెనీతో జరిపే సమావేశాల సమయాల్ల్లో ఆన్‌డ్యూటీగా మినహాయింపు ఉంటుంది. రోజుకు 300 మస్టర్లు బోగస్‌గా పడుతున్నాయనేది అవాస్తవం. తమను పనిదొంగలు గా చిత్రీకరించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సింగరేణిలో పదుల సంఖ్యలో రిటైరైన ఉద్యోగులను తిరిగి నియమించారనీ, వీరు నెలకు పది లక్షల కన్న ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారని ఒక కల్పిత కథనాన్ని ప్రచారం చేస్తున్నారు. రిటైరైన ఏ అధికారి మళ్లీ సింగరేణిలో పనిచేయడం లేదు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పర్యవేక్ష ణ కోసం అత్యంత అనుభవం కలిగిన ఇద్దరు రిటైర్డ్‌ ఉద్యోగులను కంపెనీ ప్రయోజనాల కోసమే కన్సాలిడేటెడ్‌ వేతనంతో నియమించింది. వీరి అనుభవం థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర నిర్మాణంలోనూ, ప్రస్తుత ఉత్పత్తి ప్రక్రియలోనూ ఎంతగానో ఉపయోగపడుతున్నది. అలాగే కొత్త గనుల కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖతోనూ, పర్యావరణ అటవీ విభాగంతోనూ సంప్రదింపులు జరుపడానికి మరో ఇద్దరు సీనియర్‌ అధికారులలను కంపెనీ వినియోగించుకుంటున్నది. వీరిద్దరు కూడా సింగరేణి మాజీ అధికారులు కాదు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖలో పనిచేసి రిటైరైన ఒక ఉన్నతస్థాయి అధికారిని, అటవీశాఖలో రిటైరైన మరో ఉన్నతాధికారిని కన్సాలిడేటెడ్‌ పేమెంట్‌తో నియమించుకున్నది. వేల కోట్ల రూపాయల విలువైన కొత్త కోల్‌బ్లాకులను సాధించడంలో, అనుమతు లు పొందడంలో ఈ అధికారుల అనుభవం, పరిచయాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీరి సేవలతో పోలిస్తే చెల్లించే జీతం నామ మాత్రమే. అనుభవజ్ఞులైన రిటైర్డ్‌ అధికారులను వినియోగించుకోవడం ప్రభుత్వాలకు, ప్రభుత్వసంస్థలకు కొత్తేమీ కాదు. సింగరేణిలో పనిచేసి రిటైరైన డైరెక్టర్‌ ఒకరు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ సలహాదారునిగా, మరొక ఐటీ ఉన్నతాధికారి కోలిండియాకు సలహాదారునిగా పనిచేస్తున్నారు.సింగరేణి సీ అండ్‌ ఎండీ శ్రీధర్‌ నాలుగేండ్లు దాటినా ఇంకా ఇక్కడే కొనసాగుతున్నారనీ, గతంలో ఎవరూ ఇన్నేండ్లుగా పనిచేయలేదని, రెండేండ్లకోసారి బదిలీ కావాల్సిన అధికారి ఇంకా ఉంటున్నారని వాస్తవ దూరమైన కథనాన్ని సాగించారు. అంకితభావంతో సింగరేణిని ప్రగతి బాటలో నడిపించిన పలువురు ఐఏఎస్‌ అధికారులను ఐదారేండ్ల వరకూ సీ అండ్‌ ఎండీలుగా గత ప్రభుత్వాలు కొనసాగించాయి. ఎన్‌.శ్రీధర్‌ సింగరేణిని దేశంలోనే నెంబర్‌-1 కంపెనీగా నిలిపారు. 2014తో పోలిస్తే 2019 నాటికి కంపెనీ వివిధ విభాగాల్లో సాధించిన ప్రగతి దీనికి ఉదాహరణ. సింగరేణిని నవరత్న కంపెనీలకు దీటుగా నిలబడేలా చేశారు. థర్మల్‌, సోలార్‌ విద్యుత్తు ఉత్పాద న రంగంలోకి దిగిన తొలి బొగ్గు కంపెనీగా సింగరేణి రికార్డుకెక్కడానికి ఎన్‌.శ్రీధర్‌ కృషినే ప్రధాన కారణం. సంక్షేమంలో కూడా సింగరేణి అగ్రభాగాన ఉంటున్నది. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నది. 2014లో 40 వేల రూపాయల బోనస్‌లుగా అందుకున్న కార్మికులు ఇప్పుడు సగటున లక్ష 40 వేలు అందుకోగలిగారు. సింగరేణి అభివృద్ధిలోను, సంక్షేమంలోనూ అగ్రస్థానంలో ఉందని కేంద్రబొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి అనిల్‌ కుమార్‌జైన్‌ ఇటీవల ప్రశంసించారు. గుజరాత్‌లో ఇటీవల జరిగిన కోలిండియా మేధోమథనంలో సింగరేణిని అదర్శంగా తీసుకొని థర్మల్‌, సోలా ర్‌ విద్యుత్‌ కేంద్రాలను కోలిండియా కూడా ఏర్పాటుచేయాలని కేంద్రం సూచించింది.సింగరేణి గత ఐదేండ్లలో సాధించిన ప్రగతికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. అద్భుతమైనరీతిలో ప్రగతి పథం లో దూసుకుపోతున్న సింగరేణిని, దీన్ని సమర్థంగా నడిపిస్తున్న ఎన్‌.శ్రీధర్‌ ను నిరాధారమైన ఆరోపణలతో కించపరచడం శోచనీయం. ఇలాంటి వార్తలు, కథనాలు సింగరేణి కార్మికుల, అధికారుల ఆత్మ నిబ్బరాన్ని ఏ మాత్రం సడలించలేవు.


logo