గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 12, 2020 , T00:45

హర్షణీయం

హర్షణీయం

ఆర్టీసీ సంఘాలు ఉద్యోగులను తప్పుబాట పట్టించడం మూలంగా ఆర్టీసీ ఉద్యోగులు 60 రోజుల పాటు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఆఖరికి సంఘాలు చేతులెత్తేసి ఎంతోమంది ఉద్యోగుల మర ణాలకు కార ణమయ్యాయి. ఉద్యోగుల పట్ల, వారి కుటుంబాల పట్ల సానుభూతి చూపించిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వాళ్లను ఉద్యోగంలోకి తీసుకున్నది. అయితే ప్రభుత్వం సమ్మె కాలానికి వేతనం చెల్లిస్తుందా లేదా అన్న అనుమానం ఉద్యోగుల్లో ఉండింది. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్‌ సమ్మెకాలం జీతం మీ బ్యాంకుల్లో ఉన్నట్లేనని ఓ సమావేశంలో ప్రకటించారు. అన్నట్లుగా ఇప్పుడు రూ.235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం. 

-  కొట్టె సాయిదీప్‌రావు, మానకొండూర్‌


భారత్‌ బోణీ కొట్టేనా?

న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా ఒక్క టీ-20 మినహా ఏ ఫార్మా ట్‌లోనూ అభిమానులను అలరించలేకపోయింది. ఎన్నో ఆశలతో న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన భారత జట్టు నిరాశతో స్వదేశంలో కాలు పెట్టడాన్ని క్రికెట్‌ క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇదిలా ఉం టే స్వదేశంలో ధర్మశాల వేదికగా నేటినుంచి దక్షిణాఫ్రికాతో మూడు వన్డే ల సిరీస్‌ ఆరంభం కానున్నది. భారత్‌ తిరిగి పుంజుకోవడానికి ఈ సిరీస్‌ సువర్ణావకాశం. అయితే మంగళవారం నుంచి ధర్మశాలను వరుణుడు కప్పుకొని ఉన్నాడు. వరుణుడు కరుణిస్తే కానీ భారత్‌ బోణీ కొట్టే అవకాశం లేదు. 

- కొత్వాల్‌ ప్రవీణ్‌కుమార్‌, బేగంపేట, హైదరాబాద్‌


శోచనీయం

యావత్‌ ప్రపంచాన్ని కరోనా కంగారు పెడుతూనే ఉన్నది. రోజురోజుకు ఇటలీ, ఇరాన్‌, బ్రిటన్‌లాంటి పలు దేశాల్లో మృతుల సంఖ్య పెరుగుతుం డటం బాధాకరం. ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు, అత్యాధునికమైన టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కరోనా లాంటి వైరస్‌కు అడ్డు కట్ట వేయలే కపోవడం శోచనీయం.  

- తలారి సతీష్‌, చిట్టిగడ్డ, వికారాబాద్‌ జిల్లా


logo