శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Editorial - Mar 11, 2020 , 00:16:23

సంక్షేమపథంలో వికాస రథం

సంక్షేమపథంలో వికాస రథం

అసమానతలు ప్రజల అవసరాలు తీర్చటంలో అవరోధంగా ఉంటాయి. ఆర్థికాభివృద్ధి మాత్రమే ప్రజల అవసరాలను తీర్చదు. అభివృద్ధి అనేది సమాజంలోని భిన్నవర్గాలకు అందుబాటులోకి వచ్చి వారి సామాజిక జీవన అవసరాలను తీర్చినప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. సమాజంలోని అభివృద్ధి ఫలాలను అందుకోలేని వారిని ప్రత్యేక ఆర్థిక, సంక్షేమ పథకాలతో ఆదుకోవాలి. అందుకోసం రాజకీయాలకు అతీతంగా కులం, మతం, లింగ భేదం లేకుండా అందరికీ అండగా నిలువాలి. ఈ క్రమంలో తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ పథకాలలో తలమానికం లాంటి ‘ఆసరా’ పథకాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

రాష్ట్ర అవతరణ తర్వాత స్వీయపాలన ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తున్నది. సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతి కి సంక్షేమ, అభివృద్ధి పథకాలతో కృషిచేస్తున్నది. తెలంగాణలోని వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్‌ కులాలు, తరగతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. సమస్త వర్గాల ప్రజా జీవనాన్ని సంతోషమయం చేయటంలో సామాజిక భద్రత కూడా ప్రధానమైనది. అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో నగరీకరణ పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడులతో వచ్చేవారికి రక్షణ, భద్రత విషయంలో భరోసా కల్పించాలి. అందుకోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.75 లక్ష ల సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ప్రతి ఒక్కరికీ భద్రత కల్పిస్తున్నది. శాంతిభద్రతలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నది. సీసీ కెమెరాల వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలువటం గమనార్హం. అలాగే మహిళల రక్షణ కోసం ‘షీ’ టీమ్స్‌ ఏర్పాటుచేసి మహిళలు, బాలికలకు తోడుగా నిలుస్తున్నది.


అసమానతలు ప్రజల అవసరాలు తీర్చటంలో అవరోధంగా ఉంటా యి. ఆర్థికాభివృద్ధి మాత్రమే ప్రజల అవసరాలను తీర్చదు. అభివృద్ధి అనేది సమాజంలోని భిన్నవర్గాలకు అందుబాటులోకి వచ్చి వారి సామాజిక జీవన అవసరాలను తీర్చినప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. సమాజంలోని అభివృద్ధి ఫలాలను అందుకోలేని వారిని ప్రత్యేక ఆర్థిక, సంక్షేమ పథకాలతో ఆదుకోవాలి. అందుకోసం రాజకీయాలకు అతీతం గా కులం, మతం, లింగ భేదం లేకుండా అందరికీ అండగా నిలువాలి. ఈ క్రమంలో తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ పథకాలలో తలమానికం లాంటి  ‘ఆసరా’ పథకాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.


ఆసరా పథకం తెలంగాణలో పేదలు, వృద్ధులకు పెద్ద అండ. ముఖ్యం గా నిరాదరణకు గురవుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కల్లుగీత పనివారలు, బీడీ కార్మికులు తదితర వర్గాలకు ఆసరా పింఛన్లు ఆత్మగౌరవాన్ని పెంచటమే కాదు, వారి జీవనకాలాన్నీ, ప్రమాణాలను పెంచాయి. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నవారు 12, 49,135 ఉండగా, వితంతు పింఛన్లు పొందుతున్న వారు 14,34,556 ఉన్నారు. అలాగే వికలాంగులు, నేత పనివారు, కల్లు గీత పనివారలు, హెచ్‌ఐవీ రోగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు ఇలా అన్నివర్గాల వారు కలిసి 38,63,775 మంది ఉన్నారంటే ప్రజలకు ఏ రీతిన సాయం అందుతున్నదో ఊహించవచ్చు. వికలాంగులకు 1500 రూపాయలు ఉన్న పింఛన్‌ను 3,016కు పెంచటంతో పాటు, మిగతా అందరి కీ పింఛన్‌ సొమ్ము మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి 2016కు పెం చింది. అందుకనే ఇవాళ  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతి కుటుంబం పెద్దకొడుకుగా భావిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వృద్ధాప్య పింఛన్‌ వయో పరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించి తెలంగాణ ప్రభుత్వం పెద్ద మనసు చాటుకున్నది.


2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్టీలు 31.78 లక్షల మంది (9.08 శాతం) ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 12,292 ఆవాస ప్రాంతాల్లో ఉన్న ఎస్టీల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక వినూత్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నది. గిరిజనుల అభ్యున్నతి కోసం వ్యవసాయం, చేపల పెంపకం, పశు గణాభివృద్ధి, స్వయం ఉపాధిరంగాల్లో ప్రత్యేక పథకాలను రూపొందించింది. 2014 నుంచి ఇప్పటిదాకా ఎస్టీలకు సబ్సిడీల రూపంలో 425.58 కోట్లను వెచ్చించింది. 50,205 కుటుంబాలు లబ్ధి పొందాయి. డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ పథకం కింద ఎస్టీ యువతకు వాహనాల కొనుగోలుకు ఆర్థిక సాయం అందించింది. ఇప్పటిదాకా 19.82 కోట్లతో 446 వాహనాలను అందించింది.


తెలంగాణ సంక్షేమ పథకాలలో కళ్యాణలక్ష్మి పథకం ప్రత్యేకమైనది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని 18 ఏండ్లు నిండిన యువతుల వివాహం కోసం లక్షా 116 రూపాయలను అందజేస్తున్నది. 2019-20 సంవత్సరంలోనే ఎస్సీలలో 21,603 మంది, ఎస్టీలలో 10,917 మంది కళ్యాణలక్ష్మి సాయం అందుకున్నా రు. ఇందుకోసం ఎస్సీలకు 213.03 కోట్లు, ఎస్టీల కోసం 105.83 కోట్లు వెచ్చించింది. ఇదేకాలంలో బీసీలు 63,281 మంది, ఈబీసీలు 7,881 మంది లబ్ధి పొందారు. దీనికోసం ప్రభుత్వం 615.54 కోట్లు, 75.56 కోట్లు అందించింది. అలాగే మైనారిటీ వర్గాల కోసం షాదీ ముబారక్‌ పథకంలో భాగంగా 26,914 మందికి 263.07 కోట్లు వెచ్చించింది.


సమాజంలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలను చేపట్టింది. ఈ వర్గానికి చెందిన పేదలు ఉపాధి పొందడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. ఈ ఆర్థిక మద్దతు పథకాల ద్వారా 201 8-19 సంవత్సరంలో 14,067 మందికి లబ్ధి చేకూరింది. ఆధునిక లాండ్రీ యూనిట్ల ఏర్పాటు కు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించింది. అధునాతన హెయిర్‌ ైస్టెల్స్‌, బ్యూటీషియన్‌ కోర్సులలో శిక్షణ ఇప్పించింది. మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం వివిధ పథకాలను అమలుపరుస్తున్నది. ఇందుకోసం 2019-20 లో 1,072 మంది లబ్ధిదారుల కోసం 8.33 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం కింద వాహనాల కొనుగోలుకు భారీ ఆర్థిక సహాయాన్ని అందించింది. మారుతీ మోటార్స్‌, ఉబర్‌ సంస్థల భాగస్వామ్యంతో యువతకు ఉపాధి కల్పన జరుగుతున్నది.  వాహన కొనుగోళ్లలో 60 శాతం ఆర్థిక సహాయం లేదా 5 లక్షల సబ్సిడీని మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అందిస్తున్నది. యాభై వేలు లబ్ధిదారుడు చెల్లించుకోవాల్సి ఉంటుంది. మిగతా మొత్తానికి బ్యాంకు రుణం ఉంటుంది.  2018-19లో 409 వాహనాల పంపిణీ జరిగింది. ఇం దుకు సబ్సిడీగా 18.17 కోట్ల కేటాయింపు జరిగింది. 


తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్‌ కులాలను ప్రత్యేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్నది. తెలంగాణ జనాభాలో 15.4 శాతంగా ఉన్న ఎస్సీల సంక్షేమం కోసం షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఎస్‌సీడీడీ)ను ఏర్పాటు చేసి వారి అభ్యున్నతి కోసం కృషిచేస్తున్నది. తెలంగాణ అవతరణ తర్వాత భూమి లేని నిరుపేదలైన ఎస్సీల కోసం 678.11 కోట్లు వెచ్చించి 15,448 ఎకరాల భూమిని 6,104 కుటుంబాలకు పంచిపెట్టింది. అలాగే 2014 నుంచి సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ స్కీం కింద 1,20,383 మందికి , స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కింద 5,040 మందికి ఆర్థిక సహకారాన్ని అందించింది. మొత్తంగా ఇప్పటిదాకా 1362.47 కోట్ల రూపాయలను ఎస్సీ వర్గాల అభ్యున్నతికి వెచ్చించింది.


2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్టీలు 31.78 లక్షల మంది (9.08 శాతం) ఉన్నారు. తెలంగాణవ్యాప్తంగా 12,292 ఆవాస ప్రాంతాల్లో ఉన్న ఎస్టీల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక వినూత్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నది. గిరిజనుల అభ్యున్నతి కోసం వ్యవసాయం, చేపల పెంపకం, పశు గణాభివృద్ధి, స్వయం ఉపాధి రంగాల్లో ప్రత్యేక పథకాల ను రూపొందించింది. 2014 నుంచి ఇప్పటిదాకా ఎస్టీలకు సబ్సిడీల రూపంలో 425.58 కోట్లను వెచ్చించింది. 50,205 కుటుంబాలు లబ్ధి పొందాయి. డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ పథకం కింద ఎస్టీ యువతకు వాహనాల కొనుగోలు కు ఆర్థిక సాయం అందించింది. ఇప్పటిదాకా 19.82 కోట్లతో 446 వాహనాలను అందించింది.ఒక్కోసారి పేదల అవసరాలు కొన్ని ఏ పథకం కిందికి రావు. ఇటువంటి అవసరాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిధులను ఏర్పాటు చేసింది. విద్యా,క్రీడలు మొదలైన రంగాలలో అత్యవసరంగా తోడ్పాటు అందించడానికి ఈ నిధులను అందిస్తున్నది.

(తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక ఆధారంగా...)


logo