సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Mar 11, 2020 , 00:12:55

వదంతులకు అడ్డుకట్ట వేయాలె

వదంతులకు అడ్డుకట్ట వేయాలె

కరోనా వైరస్‌ ప్రభావం రాష్ట్ర పౌల్ట్రీ పరిశ్ర మపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. కరోనా కారణంగా చికెన్‌ , కోడిగుడ్ల ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. తద్వారా రాష్ట్ర పౌల్ట్రీ పరిశ్రమ ఆదాయం పడిపోయింది. నిజానికి చెప్పాలంటే యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మన రాష్ర్టానికి సోకలేదు. కరోనా లక్షణాలున్న ఒక వ్యక్తి మాత్రమే రాష్ట్రంలో అడుగుపెట్టాడని, అత ను కూడా చికిత్స తర్వాత కోలుకున్నాడని రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్‌తో పాటు ప్రభుత్వ వైద్యులు ప్రకటించారు. అయినా కరోనా వదంతులు రాష్ర్టాన్ని వీడ టం లేదు. ఈ వదంతుల కారణంగానే జనా లు జంకుతున్నారు. కాబట్టి ఈ వదంతులకు అడ్డుకట్ట వేయాలి. అప్పుడే పౌల్ట్రీ పరిశ్రమ కు ఆదాయం పెరుగుతుంది. 

- కమలాకర్‌ నందగిరి, బీబీనగర్‌, యాదాద్రి జిల్లా


రైతు పక్షపాతి ప్రభుత్వం 

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌లో రైతు రుణమాఫీ కోసం సుమారు రూ.25,936 కోట్లు కేటాయించింది. అయితే రూ.25 వేల లోపు ఉన్న రుణగ్రస్థులకు ఒకేసా రి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించటం పట్ల రాష్ట్ర రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. మొత్తంగా 2018 డిసెంబ ర్‌ 11వ తేదీనాటికి బ్యాంకులకు బాకీ ఉన్న సుమారు 40 లక్షల 66 వేల మంది రైతులు ఈ రుణమాఫీతో లబ్ధి పొందనున్నారు. ఈ కేటా యింపులతో తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని ముఖ్య మంత్రి కేసీఆర్‌ మరోసారి నిరూపించారు. 

- మాసాని సురేష్‌, సైదుపల్లి, వికారాబాద్‌  జిల్లా 


జాగ్రత్తలు పాటించకపోవడమే కారణం

 రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకునే హోలీ వేడుకల్లో ఏటా విషాద చాయలు చోటుచేసుకోవడం బాధాకరం. ఏటా పదుల సంఖ్య లో యువకులు మరణిస్తుండటం చూస్తుంటే గుండె తరుక్కుపోతున్న ది. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఈతరాని వారు నీటిలో దిగడమే ఈ విషాదాలకు కారణం.   

- నర్మాల కృష్ణతేజ, లక్ష్మీనగర్‌, కరీంనగర్‌


logo