ఆదివారం 29 మార్చి 2020
Editorial - Mar 09, 2020 , 23:32:37

నగరీకరణ వైపు నడక

నగరీకరణ వైపు నడక

రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌ నగరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం సంచలనాత్మకమైంది. ఈ భారీ కేటాయింపు హైదరాబాద్‌ ను విశ్వనగరిగా మార్చడానికి దోహదపడుతుందని మంత్రి కేటీఆర్‌ హర్షం వెలిబుచ్చడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం నగరాభివృద్ధిలో రహదారుల వంటి మౌలికవసతులకు ప్రాధాన్యం ఇస్తున్నది. హైదరాబాద్‌ నగరాభివృద్ధి విషయానికి వస్తే మూసీప్రాజెక్టు చెప్పుకోదగినది. నగర చరిత్రతో ముడిపడిన ప్రఖ్యాత మూసీనది ఇప్పుడు మురికినీటితో నిండిపోయి ఉండటం బాధాకరం. ప్రభుత్వం మూసీనదిని ప్రక్షాళన చేయడ మేకాకుండా నదికి ఇరువైపుల ఉద్యానవనాలతో సుందరమయం చేయాలని తలపెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రహదారుల విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.దీనివల్ల పట్టణాలలో, పల్లెలలో సౌకర్యాలు పెరుగడమే కాకుండా పల్లెలకు, పట్టణాలకు అనుసంధానం పెరుగుతుంది.దీనివల్ల ప్రజలకు సౌకర్యాలు మెరుగవడమే కాకుండా వ్యాపారాభివృద్ధి సాగుతుంది. నగరీకరణ క్రమాన్ని కూడా పెంచుతుంది. రాష్ట్రంలో 23 జాతీయ రహదారులున్నాయి. వీటి మొత్తం పొడుగు 3,824 కిలోమీటర్లు. మరో 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనికితోడు రహదారుల వ్యవస్థను భారీగా మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

దేశ నగరీకరణలో తెలంగాణ 5వ స్థానంలో ఉండటం గర్వదాయకమైన విషయం. దేశవ్యాప్తంగా నగరీకరణ 31 శాతం ఉంటే తెలంగాణలో 42 శాతం ఉన్నది. మరో ఐదేండ్లలో తెలంగాణలో నగరీకరణ యాభై శాతానికి చేరుకుంటుందని అంచనా. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా నగరీకరణ వేగంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లా కేంద్రాలు అధునాతన సొబగులు అద్దుకుంటున్నాయి. 23 కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పెంపు వల్ల ఆయా ప్రాంతాల్లో నగరీకరణ వేగంగా సాగుతున్నది. మానేరు రివర్‌ ఫ్రంట్‌, తీగల వంతెన పూర్తయితే కరీంనగర్‌ స్వరూపమే మారిపోతుందనడంలో సందేహం లేదు. రింగ్‌రోడ్డు మొదలుకొని వరంగల్‌ నగరాభివృద్ధికి సాగుతున్న చర్యలు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టెక్స్‌టైల్‌ పార్కు వరంగల్‌ నగరాభివృద్ధికి ఇతోధికంగా దోహదం చేస్తుంది. పర్యాటక క్షేత్రంగా కూడా వరంగల్‌ ప్రసిద్ధి చెందిన నగరమే.


రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే నివేదిక, బడ్జె ట్‌ కేటాయింపులు గమనిస్తే పట్టణాభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక శ్రద్ధ కనబరుస్తున్నదని అర్థమవుతున్నది. నగరాభివృద్ధిలో ఎదుర య్యే సవాళ్లు భౌతిక, సంస్థాగత, సామాజిక విషయాలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక కార్యాచరణకు పూనుకుంటున్నది. తద్వారా నగర జీవనాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు సకలచర్యలూ చేపడుతున్నది. ఇందులో పట్టణ రవాణా, రోడ్ల నిర్మాణం, అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ నేపథ్యంలో మౌలిక వసతులు కల్పన, ప్రజలందరికీ రక్ష ణ, భద్రత, వ్యవస్థాగతమైన వసతుల కల్పనలకు, పాలనావిధానాల్లో మౌలిక మార్పులకు శ్రీకారం చుడుతున్నది. పట్టణాభివృద్ధిలో మౌలిక మార్పుల కోసం తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీ చట్టం-2019 తీసుకొచ్చింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వ్యవస్థ ల నిర్మాణానికి రూపకల్పన చేసింది. ఇందులో విస్పష్టమైన విధుల విభజన కూడా చేసింది. అన్నిస్థాయిల్లో జవాబుదారీతనాన్ని పెంచేవిధంగా వ్యవస్థలకు నిర్మాణరూపం ఇచ్చింది. పల్లె ప్రగతి పథకం మాదిరిగానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 2020 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా పట్టణాల్లో పారిశుధ్యం, మొక్క ల పెంపకం, విద్యుత్‌ సరఫరా, సమస్యల పరిష్కారం, మార్కెట్‌ వసతు లు మొదలైన అంశాలపై దృష్టి కేంద్రీకరించింది.


రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌ నగరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం సంచలనాత్మకమైంది.  ఈ భారీ కేటాయింపు హైదరాబాద్‌ ను విశ్వనగరిగా మార్చడానికి దోహదపడుతుందని మంత్రి కేటీఆర్‌ హర్షం వెలిబుచ్చడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం నగరాభివృద్ధిలో రహదారుల వంటి మౌలికవసతులకు ప్రాధాన్యం ఇస్తున్నది. హైదరాబాద్‌ నగరాభివృద్ధి విషయానికి వస్తే మూసీ ప్రాజెక్టు చెప్పుకోదగినది. నగర చరిత్రతో ముడిపడిన ప్రఖ్యాత మూసీనది ఇప్పుడు మురికినీటితో నిండిపోయి ఉండటం బాధాకరం. ప్రభుత్వం మూసీనదిని ప్రక్షాళన చేయడ మేకాకుండా నదికి ఇరువైపుల ఉద్యానవనాలతో సుందరమయం చేయాలని తలపెట్టింది. ఇందుకోసం మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌డీసీఎల్‌)ను ఏర్పాటుచేసింది. మూసీ నదిలోని చెత్తాచెదారాన్ని తొలిగించడం వల్ల నీరు నిరాటంకంగా ప్రవహిస్తున్నది. ఇందులో చెత్త పడేయకుండా సైన్‌ బోర్డులు ఏర్పాటుచేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం వంటి పలుచర్యలు తీసుకున్నది. రబ్బర్‌ డ్యాం లు ఏర్పాటుచేస్తున్నది. మూసీ రివర్‌ఫ్రంట్‌ పథకం పూర్తయితే పర్యాట క కేంద్రంగా కూడా మారుతుంది. కులీ కుతుబ్‌షా నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భారీ ఎత్తున దాదాపు 40 కార్యక్రమాలు అమలవుతున్నా యి. హైదరాబాద్‌తో పాటు జిల్లాల అభివృద్ధిపైన, పర్యాటక క్షేత్రాల వృద్ధిపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.


యాదాద్రిని జాతీయ స్థాయి మత, సాంస్కృతిక, పర్యాటక కేంద్రం గా రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పనులు సాగిస్తున్నది. ఇంత పెద్దఎత్తున ఆలయాన్ని అభివృద్ధి చేయడం తెలంగాణ రాకముం దు అనూహ్యం. గుట్టపైన నాలుగు ఎకరాల మేర మాస్టర్‌ ప్లాన్‌ అమలవుతున్నది. యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి సంస్థ పరిధిలోకి 7 గ్రామాలను చేర్చడం వల్ల క్షేత్ర స్వరూపమే మారిపోయింది. క్షేత్రాభివృద్ధికి 1900 ఎకరాల భూ సేకరణ ఇప్పటికే జరిగింది. 800 ఎకరాలలో ఆల య నగరం నిర్మాణం అవుతున్నది. ఈ దేవాలయ నిర్మాణ కార్యక్రమా లు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. యాదాద్రి జాతీయస్థాయిలో పర్యాటక క్షేత్రంగా మారుతుందనడంలో సందేహం లేదు. ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 65 కోట్లు విడుదల చేసింది. దీనివల్ల దేవస్థానంతో పాటు చుట్టూరా ప్రదేశాలు భారీ మార్పునకు లోనవుతాయి. చుట్టూరా ఆరు గ్రామాలు ఈ అభివృద్ధి పరిధిలోకి వస్తున్నాయి.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రహదారుల విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దీనివల్ల పట్టణాలలో, పల్లెలలో సౌకర్యాలు పెరుగడమే కాకుండా పల్లెలకు, పట్టణాలకు అనుసంధానం పెరుగుతుంది. దీనివల్ల ప్రజలకు సౌకర్యాలు మెరుగవడమే కాకుండా వ్యాపారాభివృద్ధి సాగుతుంది. నగరీకరణ క్రమాన్ని కూడా పెంచుతుంది. రాష్ట్రంలో 23 జాతీయ రహదారులున్నాయి. వీటి మొత్తం పొడుగు 3,824 కిలోమీటర్లు. మరో 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనికి తోడు రహదారుల వ్యవస్థను భారీగా మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మం డల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో అనుసంధానించడానికి రూ.2570.50 కోట్లు కేటాయించింది. 89 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి కాగా యాభై పురోగతిలో ఉన్నాయి. ఈ క్రమంలో సింగిల్‌ రోడ్లన్నీ డబుల్‌ రోడ్లుగా మారుతున్నాయి. 


జిల్లా రహదారులను కూడా మెరుగుపర్చడానికి భారీ కేటాయింపులు జరిగాయి. ఇందులో భాగంగా 1354 కిలోమీటర్ల మేర నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇది మొత్తం కార్యక్రమాల్లో దాదాపు సగం.  కృష్ణా, గోదావరి, వాటి ఉపనదులపై వంతెనల నిర్మాణం వల్ల రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. కొన్నిచోట్ల అసలు వంతెనలే లేకపోగా మరికొన్ని చోట్ల పురాతన వంతెనలు శిథిలావస్థలో ఉన్నాయి. దీంతో  రాష్ట్ర ప్రభుత్వం 315 వంతెనల నిర్మాణాన్ని తలపెట్టింది. ఇందులో 234 వంతెనలు ఇప్పటికే పూర్తయ్యాయి. నదులపైనే కాకుండా తెలంగాణ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇతరుల రహదారులపై కూడా వంతెనల అవసరం ఉన్న ది. తెలంగాణ ఏర్పడిన వెంటనే దాదాపు 1,582 వంతెనల నిర్మాణం అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అతివేగమైన కార్యాచరణ మూలంగా 474 వంతెనలు ఇప్పటికే పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వానికి నగరాభివృద్ధి అనేది మొత్తం రాష్ర్టాభివృద్ధిలో భాగం. అందువల్ల రహదారుల నిర్మాణం తదనుగుణంగానే సాగుతున్నది. ఈ రహదారుల నిర్మాణం నగరీకరణ వేగా న్ని పెంచుతున్నది. 

(తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక ఆధారంగా...)


logo