గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 09, 2020 , 23:27:17

నిధుల కోతకు బెదరని రాష్ట్రం

నిధుల కోతకు బెదరని రాష్ట్రం

అటు పెద్దనోట్ల రదు, ఇటు కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో కోతతో గ్రామీణ జీవనం అతలాకుతలమైంది. విద్య, వైద్యం దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఈ ప్రమాదం నుంచి గ్రామాలను గట్టెక్కించి జనజీవనానికి రక్షణ కవచంగా నిలబడింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ర్టానికి ప్రత్యేక కేటాయింపులేమీ లేనప్పటికీ మన కాళ్లమీద మనం నిలబడే విధంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగింది.

దేశ ఆర్థికవ్యవస్థ మందగమనంలోకి జారిపోయింది. పెద్దనో ట్ల రద్దు గ్రామీణ భారతాన్ని, జీఎస్టీ పట్టణ వ్యవస్థను కోలు కోలేని విధంగా దెబ్బతీసింది. ఆర్థిక సంస్కరణలు అంటే ‘క్రోనీ క్యాపిటలిజం’అని, ‘అవినీతి’ కూపమని చెప్పిన మోదీ ప్రభుత్వం, ఫక్తు క్రోనీ క్యాపిటలిజాన్ని, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలను అమలుపరిచి, దేశ ఆర్థికవ్యవస్థ జీవం తీశారు. అసంఘటిత రంగంలో 45కోట్లకు పైగా ప్రజలకు ఉపాధి సంక్షోభం ఎదురైంది. సంఘటిత రం గంలో ఉన్నవారు మూలధనం లేకుండా ఎలా ముందుకువెళ్లాలనే గంద ర గోళంలో పడి అభివృద్ధి కుంటుపడింది. ఈ ప్రక్రియలో రియల్‌ ఎస్టేట్‌ నుంచి అన్ని ఉత్పత్తులూ కర్మాగారాలకే పరిమితమైపోయాయి. ఇటువం టి సంఘర్షణ, ఆటుపోట్ల  నేపథ్యంలో దేశంలో ఆర్థికమాంద్యం నెలకొన్న ది. ఈ విపత్కర పరిస్థితులను అంతంచేసి, సంపదను సృష్టించగల ప్రత్యా మ్నాయ ఆర్థికవిధానాలను రూపొందించి అమలుచేయలేక కేంద్ర ప్రభు త్వం చేతులెత్తేసింది. ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు ఎలాంటి ప్రగతిశీల నిర్ణయాలు ప్రకటించలేకపోయింది. రాష్ర్టాల బడ్జెట్‌లో కేటా యింపులను కుదించింది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృ ద్ధి, తదితర రంగాలకు నిధులను తగ్గించారు. 


సరిగ్గా దీనికి విరుగుడుగా తెలంగాణ బడ్జెట్‌ రూపుదిద్దుకున్నది. వాస్త విక దృక్పథంతో 2020-21 బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. కేంద్రం విస్మ రించిన సంక్షేమం, అభివృద్ధి రంగాలకు ఊపిరి పోస్తూ సామాజిక తెలం గాణ స్వరూపాన్ని పునర్నిర్మాణం చేసుకునే విధంగా రాష్ట్ర బడ్జెట్‌ రూపు దిద్దుకున్నది. కేంద్ర పన్నుల్లో రాష్ర్టాల వాటా రాజ్యాంగపరమైన హక్కు. ఈ మేరకు తెలంగాణ రాష్ర్టానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.19,718 కోట్లు రావాల్సి ఉన్నది. గత ఏడాది బడ్జెట్లో ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ర్టానికి అందిస్తామని కేంద్రం తెలిపింది. కానీ సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.15,987 కోట్లకు కుదించారు. దీనివల్ల ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో రాష్ర్టానికి రావాల్సిన నిధుల్లో రూ.3,731 కోట్లు తగ్గాయి. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ర్టాలకు ఇచ్చే వాటా తగ్గిం చడం కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అసమర్థత మాత్రమే.  2020-21 ఆర్థి క సంవత్సరంలో పన్నులు వసూలు చేసి, రాష్ర్టాలకు నిధులు సమకూర్చా ల్సి ఉన్నది. ప్రతీ సందర్భంలోనూ బడ్జెట్లో ప్రకటించిన అంచనాల ప్రకార మే రాష్ర్టాలకు పన్నుల్లో వాటా చెల్లిస్తారు. ఒకటీ, అరా శాతం అటూఇటు అయిన సందర్భాలున్నాయి. కానీ, 2019-20లో ఏకం గా 18.9 శాతం తగ్గుదల రావడం 1920-21 సంవత్సరానికి ఇంకా తగ్గించటం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహరాల నిర్వహణ లోపానికి నిదర్శనం. 


దీనిప్రభావం తెలంగాణ రాష్ట్రంపై దారుణంగా పడింది. 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ప్రతిపాదనల్లో కూడా తెలంగాణ రాష్ర్టానికి వచ్చే నిధుల్లో రెండు రకాల నష్టం వాటిల్లింది. 1. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ర్టాలకు చెల్లించే వాటాను 42శాతం నుంచి 41శాతానికి తగ్గిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసి న సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. 2. తెలంగాణ రాష్ర్టానికి గతంలో 2.437 శాతం వాటాను ఇవ్వగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వాటాను 2.133 శాతానికి తగ్గించారు. దీనివల్ల తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర పన్ను ల్లో వాటాగా రావాల్సిన నిధుల్లో రూ.2,381 కోట్లు తగ్గనున్నాయి. ఇంత భారీగా తెలంగాణకు నిధులు తగ్గించడం వివక్షాపూరితమే. ఈ తగ్గుదల ప్రభావం రాష్ట్ర ప్రగతి ప్రణాళికలపై పడుతుంది. 2019-20 ఆర్థిక సంవ త్సరంలోనే కేంద్ర పన్నుల్లో తెలంగాణకు ఇస్తామని పార్లమెంట్‌లో ప్రకటిం చిన వాటాలో 3,731 కోట్లు తగ్గించిన కేంద్రం, 2020-21లో రూ.16,726 కోట్లు ఇస్తామని ప్రతిపాదిస్తున్నది. ఈసారి కూడా అంచనాలు సవరించే నాటి కి చెప్పినదాంట్లో ఎంత తగ్గిస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది. కేంద్ర పన్ను ల్లో వాటా విషయంలో కేంద్రం చెప్పిన మాటకు, ఇచ్చే నిధులకు సంబంధం లేకుండా పోతున్నది. జీఎస్టీ విషయంలో కూడా కేంద్రం పెద్ద మోసం చేస్తు న్నది. 14 శాతం లోపు ఆదాయవృద్ధి రేటు కలిగిన రాష్ర్టాలకు ఏర్పడే లోటు ను ఐదేండ్ల పాటు భర్తీ చేస్తా మని 2017లో తెచ్చిన జీఎస్టీ చట్టంలో చెప్పారు. దీనిప్రకారం తెలంగాణ రాష్ర్టానికి జీఎస్టీ పరిహారంగా ఇంకా 1,137 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉన్నది. ఈ నిధులను విడుదల చేసే విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు.


కేంద్ర బడ్జెట్‌లో పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో భారీ కోత పెట్టారు. దీనివల్ల వేగంగా పట్టణీకరణ జరుగుతున్న తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతున్నది. తెలంగాణలోని పట్టణాల అభివృద్ధికి 2019-20 బడ్జెట్లో 1,037 కోట్లు కేటాయించారు. 2020-21 బడ్జెట్‌ వచ్చే సరికి గతేడాదికన్నా 148 కోట్లు తగ్గించి, కేవలం 889కోట్లు మాత్రమే కేటా యించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి గత బడ్జెట్‌తో పోలిస్తే, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 0.26 శాతం, వైద్య ఆరోగ్య రం గానికి 0.11 శాతం, విద్యారంగానికి 0.15 శాతం, గ్రామీణాభి వృద్ధికి 0.43 శాతం తగ్గిస్తూ నిధులు కేటాయించారు. ఈ కేటాయింపుల సవరణతో గ్రామీణ పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లయ్యిం ది. అటు పెద్దనోట్ల రద్దు ఇటు కేం ద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో కోతతో గ్రామీణ జీవనం అతలాకుతల మైంది.విద్య వైద్యం దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఈ ప్రమాదం నుంచి గ్రామా లను గట్టెక్కించి జనజీవనానికి రక్షణ కవచంగా నిలబడింది. 


కేంద్ర బడ్జెట్‌ లో రాష్ర్టానికి ప్రత్యేక కేటాయింపు లేమీ లేనప్పటికీ మన కాళ్ల మీద మనం నిలబడేవిధంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. ప్రపంచానికి తలమానిక మైన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసుకొని వ్యవసాయం, పరిశ్రమలు, మత్స్యసంపద, పర్యాటకం వంటి రంగాల్లో అభివృద్ధి సాధించి ఆదాయా న్ని రాబట్టేందుకు బడ్జెట్‌ను ఆర్థికమంత్రి రూపొందించారు. విద్య, వైద్యం వ్యవసాయం, సంక్షేమరంగాలకు కొత్త జవసత్వాలను ఇస్తూ ముఖ్యమం త్రి కేసీఆర్‌ శ్రద్ధాసక్తులు, సూక్ష్మ దృష్టి దార్శనికతను ప్రతిబింబిస్తున్నది. ఈ ఏడాదికిగాను రూ.1,82,914.42 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టగా రూ. 25 వేల రుణం రైతులకు ఏకకాలంలో మాఫీ, రూ.25 వేల నుంచి లక్షలో పు ఉన్న రుణాలు 4 విడుతలుగా పంపిణీ, రైతుబంధు పథకానికి రూ.14 వేల కోట్లు, మూసీరివర్‌ ఫ్రంట్‌ కోసం 10 వేల కోట్లు, మున్సిపల్‌ శాఖకు 14,809 కోట్లు, హైదరాబాద్‌ అభివృద్ధి కోసం వచ్చే ఐదేండ్లలో 50 వేల కోట్లు కేటాయిస్తున్నది. పాఠశాల విద్య కోసం 10,421 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 1,723 కోట్లు, వైద్యరంగా నికి 6,156 కోట్లు, పంచాయతీ రాజ్‌శాఖకు 23,005 కోట్లు కేటాయింపులు జరిగాయి. కల్యాణలక్ష్మీ కోసం 1,350 కోట్లు, మహిళా స్వయం సహకా రా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద 1,200 కోట్లు కేటాయించడం ముదావహం. ఈ బడ్జెట్‌ తెలంగాణ రాష్ర్టాన్ని ప్రగతి పథాన నిలబెడుతుం దనటంలో సందేహం లేదు.

(వ్యాసకర్త: దుబ్బాక శాసనసభ్యులు)


logo