మంగళవారం 31 మార్చి 2020
Editorial - Mar 09, 2020 , 23:24:44

అనవసర భయాలొద్దు

అనవసర భయాలొద్దు

మార్చిలో సాధారణంగా ఎండల తీవ్రత ఉంటుంది, పొడిగాలులు వీస్తాయి. కానీ కొన్నిరోజులుగా ఆకాశం మేఘావృతమై ఉం డటం, చలి గాలులు వీస్తుండటంతో ప్రజల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాతా వరణంలో వచ్చిన మార్పుల కారణంగా విషజ్వరాలు, జలుబు, దగ్గు వంటి వ్యాధు లు ఎక్కువయ్యాయి. కరోనా వైరస్‌ భయా లు ఇప్పటికే ప్రజలను భయాందోళ నలకు గురిచేస్తున్న సమయంలో ఇలాంటి వాతావ రణ పరిస్థితులు జనాలను మరింతగా భయ పెడుతున్నాయి. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజలు అనవసర భయాలకు లోనుకావద్దు. ఆరోగ్యశాఖ వారు దీని గురిం చి ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాలి. కరనా వైరస్‌ను రాష్ర్టానికి రానీయకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నది. 

- సంధ్య విరగదిండ్ల, పార్వతీపురం, వనపర్తి జిల్లా


కలలో కూడా ఊహించనిది

ఈ మధ్య మిత్రుని పెండ్లి శుభకార్యానికి హాజరయ్యేందుకు మహబూ బ్‌నగర్‌ జిల్లాకు పోవాల్సి వచ్చింది. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ చూసి నా కనుచూపుమేర పచ్చటి వరి పొలాలు కనిపించాయి. దాంతో నేను పొరపాటున ఆంధ్రా ప్రాంతానికి పోయే బస్సు ఎక్కినానేమోనని అను మానం వచ్చింది. బస్సులో పక్కసీటులో ఉన్న ప్రయా ణికున్ని ఇది పాలమూరు జిల్లానే కదా అని అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు అడిగాను. అనుమానం ఎందుకు పాలమూరే అన్నా డు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నాలుగైదేండ్ల కిందట ఆ మిత్రుని ఇంటికి పోయిన ప్పుడు ఈ ప్రాంతమంతా ఎడారిలా కనిపించింది. ఎక్కడా పచ్చని చెట్టు కనిపించని స్థితి. అలాంటి కరువు ప్రాంతంలో ఇప్పుడు సాగు నీరంది ఆ ప్రాంతమంతా పైరుపచ్చలతో నిండిపోయింది. ఇలాంటి ఓ పరిస్థితి వస్తుందని మా లాంటివాళ్లం ఎన్నడూ ఊహించలేదు. తెలంగా ణ ఆవిర్భావం తర్వాత సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రాధాన్యం కారణంగా కరువు నేల పాలమూరు లో చెరువులు నిండి ఉన్నాయి. ఎక్కడ చూసినా వరిపొలాలు దర్శన మిస్తున్నాయి. తెలం గాణ వస్తే ఏం మారుతుందన్న వారిని ఎవరినై నా ఒకసారి మహబూబ్‌ నగర్‌ తీసుకుపోయి చూపించాలి. రాష్ట్ర సాధన సాఫల్యం ఎంత మధురంగా, అందంగా ఉన్నదో తెలుస్తుంది. 

- పి.కృష్ణ, నల్లగొండ


logo
>>>>>>