శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Mar 08, 2020 , 22:50:37

సాహితీ విందు

సాహితీ విందు

ఈ కథలను ఒకేసారి కాకుండా ఒక్కో కథ చదువుతూ పోతే పాఠకుడు నిజంగా ఆస్వాదించగలుగుతాడు. జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, కష్టాలు, నష్టాలు ఎలా ఎదుర్కొవాలి, మారుతున్న సమాజానికి అనుగుణంగా ఎలా మార్చుకోవాలో ఈ కథల్లో ఉన్నది. బాల్యం అప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది వంటి అంశాలన్నీ సమూలంగా విశ్లేషించి కథలో కూర్చారు ప్రభాకర్‌ జైని.

కథలన్నీ కంచికి చేరవు మన చుట్టూ ఉన్న జీవితాలే కథలుగా 

తిరుగుతూ ఉంటాయి. కథలాంటి జీవితం, జీవితం లాంటి కథ 

కళ్ళ ముందు  జరిగిపోతూ ఉంటాయి. నిన్నటి సంఘటన నేడు 

జ్ఞాపకమై పుస్తకంలో అక్షరమైపోతుంది. సాహిత్యంలో కథకు 

ప్రత్యేకత ఉంది. అందులో జీవితంలో జరిగినవాటికి

ఇంకా ప్రాముఖ్యం ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.


ఇదంతా ఎందుకంటే.. మనిషి జీవితమే కథగా మలిచిన సందర్భాలని ఒక చోట చేర్చి ‘మృష్టాన్న భోజనం’గా పాఠకులకు అందించే ప్రయత్నంలో వచ్చిన పుస్తకమే ‘మీల్స్‌ టికెట్‌'.  సాహితి ఆకలి గల పాఠకుల ఆకలి అంత త్వరగా తీరదు. అందునా కథల్ని ఇష్టపడే పాఠకులకైతే ఈ ‘మీల్స్‌ టికెట్‌' దాన్నుంచి మినహాయించవచ్చు. ప్రముఖ నవలా రచయత, కవి, కథకుడు అయిన ప్రభాకర్‌ జైని  రచించిన ఈ ‘మీల్స్‌ టికెట్‌' పాఠకుడికి నిజంగా ఫుల్‌ మీల్స్‌ అనొచ్చు.  పద్దెనిమిది టికెట్‌లుగా విభజించబడిన ఈ పుస్తకంలో ప్రతి కథ  మీ జీవితాల్లో జరిగేదే అంటాడు  భార్య భర్తల అనురాగం వందేళ్ల దాకా కొనసాగేది. ఒకరికొకరు విడదీయలేంతగా పెనవేసుకున్న బంధం మృత్యువులో కూడా తోడై ఉంటే నిజమైన సోల్మేట్‌ అవుతారు.  భర్తకు గుండెపోటు వచ్చిందని తెలిసిన మరుక్షణం సీతకు కూడా గుండెపోటు వచ్చి హాస్పిటల్‌లో పక్క పక్క బెడ్‌లో ఇద్దరు ఉం టే, భర్తకు స్పృహ వచ్చి భార్యను దీనస్థితిలో చూశా క మనసు నుంచి వచ్చిన మాటలు రికార్డు చేసి సీత చెవిలో వినిపించాక లేచి కన్నీళ్లు కార్చి చనిపోతుం ది.  ఒకే సమయంలో ఇద్దరు మృత్యువులో కూడా తోడై వెళ్ళిపోతే నిజమైన ప్రేమకు అనుబంధానికి చిహ్నమని చక్కగా మలిచారు ‘సోల్‌మేట్‌' కథలో.


జీవితం చాలా చిన్నది. మనం ఈ లోకంలో ఉన్నంతవరకే అనుభవించాలి పరిపూర్ణంగా అని శాంతకు అన్నీ తెలియజేసి చివరి మజిలీకి రెడీగా ఉండిపోవడం మాటలు చెప్పినంత తేలిక కాదు. అందుకే శాంతతో తన అకౌంట్‌ వివరాలతో పాటు తన జీవితంలో జరిగిన క్షణాల్ని తలచుకొని వైరాగ్యంలో పడిపోతాడు. అయినా కూడా ‘డోంట్‌ వర్రీ బీ హ్యాపీ’గా ఉండమంటాడు. ఆకాష్‌  గొప్ప ఇంటి బిడ్డ, కోట్ల ఆస్తికి వారసుడు. అందమైన భార్య. అయితే ఉన్నట్టుండి ఒక విషయంలో తండ్రితో తగాదా పడాల్సి వస్తుంది. దాంతో తండ్రి భార్య సమక్షంలో తిట్టాడని అవమానంతో వెళ్ళిపోతే, అది సహించలేని ఆకాష్‌భార్య మంజరి ఆత్మహత్య చేసుకుంటుంది. దాన్ని మరిచిపోవడానికి యాత్ర లు చేస్తున్న సమయంలో రైలులో ఎదురైన అనుభ వం అతని దృక్పథాన్ని మారుస్తుంది. యాదృచ్ఛి కంగా ఒకరి ప్రేమ నుంచి మరొక ప్రేమలో మునిగి పోకముందే కళ్ళు తెరుస్తాడు. అదే ‘అమృతపాదా లు’ కథ. బ్యాంకు వేలంపాటలో తనవంతు వాటా వస్తే చాలు అనుకున్నవాడు, తన బంధువు నెల నెల తెచ్చే వేలంపాటలో వాటా కోసం ఎదురు చూసినవాడు, తన బంధువు కక్కుర్తి కలవాడని నిర్ణయించుకున్న వాడు ఒక ఆడ కూతురు జీవితా న్ని కాపాడటానికి ఏమి చేశాడు అనేదిమనసు ‘వేలం బంగారం’లో కథను అద్భుతంగా మలిచా రు.  వ్యాపార దృక్పథమే కాదు మానవత్వం కూడా ఉందని నిరూపించారు.  


‘పాల ఐస్క్రీవ్‌ు కథ’ లో నాటి జనరేషన్‌కు, నేటి జనరేషన్‌కు ఉన్న  తేడాను చక్కగా వ్యక్తీకరించారు.  మనమరాలు పదో తరగతి పాస్‌ అయితే ఎలా ప్రత్యేకంగా జరుపుకున్నారు,అదే పదోతరగతి పాస్‌ అయినప్పుడు ఆ తాత బాల్యపు జ్ఞాపకం ఇప్పుడు ఎంత ఖరీదో ‘పాల ఐస్క్రీవ్‌ు’లో చెప్పిన తీరు బాగుంది. ఒక డాక్టర్‌ అయి ఉండీ తనకు ఉన్న జబ్బు నలుగురికి తెలిస్తే ఎక్కడ తన ప్రాక్టీస్‌, పేరు చెడిపోతుందేమోనని దిగులుతో ఉబ్బసం రోగాన్ని ముదరపెట్టుకొని ఒక కాలరాత్రిని ఎలా అధిగమించగలిగాడో చెప్పేదే ‘కాలరాత్రి’ కథ.


మనిషి నిజాయితీతో ముందుకు సాగితే ఏ రం గాన్నైనా ఏలవచ్చు. వ్యాపారికి ఉండాల్సిన ముఖ్య లక్షణం నిబద్ధత, నిజాయితీ, నాణ్యత. ఒక రైతు తన పొలంలో పండించిన పంటను తరలించే క్రమంలో అవినీతి అధికారికి ఎలా సమాధానమిచ్చాడు? ఆ క్రమంలో అతనిలో వ్యాపారి ఎలా అభివృద్ధి చెందాడు. నలుగురికి దారి చూపి వ్యాపా రి నిజాయితీగా వ్యాపారంచేస్తే ఆకాశాన్ని అందుకోవచ్చు అని చెప్పేదానికి ఉదాహరణ లంచంలేని వ్యాపారం. అర్హత కలవాడికి రావలసిన రాయితీలు ఎలా పక్కదారి పడుతున్నాయి, స్వాతంత్య్రం కోసం పోరాడిన వారికి కలిపించే రాయితీలను ఒక బద్ధకస్తుడు ఎలా దుర్వినియోగం చేసి, అత్యాశకు పోయి ఎలా దొరికిపోయాడో చక్కగా వివరించారు. నిజమైన స్వాతంత్య్ర సమరయోధులు  ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు చివరికి ఎలా అధిగమించగలిగారన్నది తెలిపే కథనే ‘ఫ్రీడవ్‌ు ఫైటర్‌'.


ఇవి కొన్ని కథలు మాత్రమే. ఇంకా ఇందులో ‘అలసితిని’, ‘నాయనా రావే’, ‘ప్రాప్తకాలజ్ఞాను డు’, ‘శాంతి పావురం’, ‘సర్దుకున్నారా’  లాంటి మంచి కథలున్నాయి. ఈ కథలను ఒకేసారి కాకుం డా ఒక్కో కథ చదువుతూ పోతే పాఠకుడు నిజంగా ఆస్వాదించగలుగుతాడు. జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, కష్టాలు, నష్టాలు ఎలా ఎదుర్కొవా లి, మారుతున్న సమాజానికి అనుగుణంగా ఎలా మార్చుకోవాలో ఈ కథల్లో ఉన్నది. బాల్యం అప్పు డు, ఇప్పుడు ఎలా ఉంది వంటి అంశాలన్నీ సమూలంగా విశ్లేషించి కథలో కూర్చారు. ప్రభాకర్‌ జైని కవి, నవలాకారుడే గాక మంచి కథ కుడని ఈ సంపుటి ద్వారా రుజువు చేసుకున్నాడు. తన చుట్టూ జరిగే వాటిని కథలుగా, కవిత్వంగా మలు స్తూ సృజనకారులు చైతన్యంతో ముందుకు సాగాలని తన అనుభవాలను అక్షరరూపంలో వెలువరించారు. తన సాహ్యిత్య సృజన ద్వారా, కథల ద్వారా సమాజంలో ఆవిరి అవుతున్న మానవీయ తను ఎత్తిచూపుతూ మనుషులు తమ గుండెల్లో తడి ఆరనీయరాదని చెప్పారు. 

పలు వార్తాపత్రికల్లో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ‘మీల్స్‌ టికెట్‌' పాఠకుల సాహితీ ఆకలిని తీరుస్తుందని ఆశిస్తున్నాను. ప్రభాకర్‌ జైని మరిన్ని మంచి కథల సంకలనాలు తీసుకురావాలని కోరుకుందాం.

- పుష్యమీ సాగర్‌,9010350317 


logo