శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Mar 08, 2020 , 22:42:27

కొత్త పుస్తకాలు

కొత్త పుస్తకాలు

కిషన్‌చందర్‌ కథలు

భారతీయ సృజనాత్మక సాహితీక్షేత్రంలో ప్రఖ్యాతుడు కిషన్‌ చందర్‌. ఆయన రచనలు భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌, రష్యన్‌, డేనిష్‌, పోలిష్‌, జర్మన్‌, హంగేరియన్‌, చైనా భాషలలోకి అనువదింపబడ్డాయి. ఆయన రచనలు సమాజ స్వరూపానికి అద్దం పడుతాయి. మహోదాత్త శ్రమకూ, ప్రేమకూ నీరాజనమిస్తాయి. 

రచన: కిషన్‌చందర్‌, అనువాదం:జ్ఞానవేంద్ర, వెల: రూ. 120

ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, గిరిప్రసాద్‌ భవన్‌, బండ్ల గూడ (నాగోల్‌), జీఎస్‌ఐ పోస్ట్‌, హైదరాబాద్‌-68. 


పాలపిట్ట వినూత్న కవితసంఘజీవిగా ఉన్న మనిషి సామాజిక సంఘటనలకు, సంక్షోభాలకు స్పందించక తప్పని స్థితిలోంచి వచ్చిన కవితల సమాహారమే ఇది. ఇవ్వాళ  విభిన్న పాయలుగా అనేకమంది కవిత్వం రాస్తున్నారు. తమ అంతర్లోకాల అలజడిని కవిత్వం చేస్తున్నారు. అలా చేసిన వందమంది కవుల స్పందనలే ఈ ‘వినూత్న కవిత’.

సంకలనం: పాలపిట్ట, వెల:100, 

ప్రతులకు: పాలపిట్ట బుక్స్‌, ఫోన్‌: 9848787284


కొండపొలం


పల్లెపరిసరాలలో బతుకు వనరులు లభ్యం కానప్పుడు దగ్గర్లోని కొండల మీద ఆధారపడటం సహజం. ఉదయం వెళ్లి సాయంత్రం లోపల అటవీ ఉత్పత్తులను సేకరించుకొని వచ్చేవాళ్లు కొందరైతే,  వారం పదిరోజుల పాటు అక్కడే కొండపొలం చేసి బతుకు దెరువు సాధించుకునే వాళ్లు మరి కొందరు. వారి జీవన సమరమే ఈ ‘కొండపొలం’ నవల.

రచన: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, 

వెల: రూ. 200

ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ బుక్‌ హౌస్‌,  అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు.నిసర్గ (సాహిత్య వ్యాసాలు)


ఈ సాహిత్య వ్యాసాలు వివిధ సందర్భాల్లో రాసినవి. దాటిపోయిన గొప్ప కవుల కృషిని విలువకట్టే ప్రయత్నం ఇది. విభిన్న దృక్పథాలు గల ఆధునిక కవుల పరామర్శలే ఇవన్నీ. వారంతా  కవిత్వమే జీవితంగా జీవించిన వాళ్లు.  ఎంతో కోల్పోతూ సమాజానికి వివేకం నేర్పిన వాళ్లు. ఆయా కవుల సృజన స్వరూప స్వభావాల్ని విడమర్చి చెప్పిన ప్రయత్నమే ఈ వ్యాస సంపుటం. 

రచన: డాక్టర్‌ పాపినేని శివశంకర్‌, వెల: రూ. 110

ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, గిరిప్రసాద్‌ భవన్‌, బండ్లగూడ (నాగోల్‌), జీఎస్‌ఐ పోస్ట్‌, హైదరాబాద్‌-68. 


logo