బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Mar 07, 2020 , 23:54:31

రాష్ర్టాలకు శూన్యహస్తం

రాష్ర్టాలకు శూన్యహస్తం

దేశంలోని ఏ రాష్ట్రమైనా భారీ ప్రాజెక్టులు, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు కేంద్రం తన వంతుగా సహాయం అందించాలి. కానీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులకు, రైతుబంధు లాంటి పథకాలకు ఎలాంటి సహాయం అందించడం లేదు. కేంద్రం తెలంగాణపై చూపెడుతున్నవివక్షకు ఇదే నిదర్శనం.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుం చి కేంద్రం చేతిలో ఎక్కువ ఆదా యం, అధికారాలు ఉండేలా చేసిం ది. మొదట ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసింది. నీతిఆయోగ్‌ బలహీన సంస్థ.  ప్రణాళికా సంఘం రాష్ర్టాల లో జరిగే అభివృద్ధి పనులకు ఆర్థిక చేయూత నిచ్చేది. దీని రద్దు కారణంగా వనరుల పంపిణీ ఇప్పుడు కేంద్ర ఆర్థికశాఖకు సంక్రమించింది. దీంతో మరింత కేంద్రీకరణకు, రాజకీయ పక్షపాతానికి తావిస్తున్నది. రెండవది-  వస్తు సేవాపన్ను (జీఎస్టీ) విధానం. దీనివల్ల రాష్ర్టాలకు అత్యధిక ఆదాయం సమకూర్చే అమ్మకం పన్ను జీఎస్టీ పరిధిలోకి పోయింది. దీనివల్ల రాష్ర్టాల ఆదాయం తగ్గింది. 


చట్టబద్ధంగా జీఎస్టీ వల్ల రాష్ర్టాలకు జరిగే నష్టాన్ని కేంద్రమే తిరిగి ఇవ్వాలి. కానీ అది జరు గడం లేదు. దీంతో చాలా రాష్ర్టాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం 1971 జనాభా లెక్కల ప్రకారం కాకుండా, 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు పంపిణీ చేయడాన్ని చాలారాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయి. జనాభా నియంత్రణను బాధ్యతగా తీసుకున్న రాష్ర్టాల జనాభా తగ్గిపోయింది.తెలంగాణకు కేంద్రం నుంచి ఆశించినస్థాయిలో బడ్జె ట్‌ సాయం అందడంలేదు. ఆరేండ్లుగా కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ మినహా ప్రత్యేకంగా నిధులేవీ రావడం లేదు. విభజన హామీలను అమలు చేయ డం లేదు. కొత్త డిమాండ్లను పట్టించుకోవడం లేదు. 


14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం పన్నుల్లో రాష్ర్టాల వాటా 42 శాతం. 2014-15 నుంచి 2017-18 మధ్య వరకు ఈ వాటా పెరిగింది. తర్వాత క్రమంగా తగ్గింది. దీనికి ఆర్థిక మాంద్యం కారణమని కేంద్రం చెపుతున్నది. 2018-19లో రాష్ర్టానికి అందిన నిధుల వాటా కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.2 శాతం అధికంగా పెరుగుతుందని కేంద్రం ప్రకటించింది. 2019-20, 2020-21 బడ్జెట్లలో ఆ స్థాయిలో పెరగలేదు. పైగా 2.19 శాతం మేర తగ్గింది.  


ఎంతోకాలంగా వివిధ అంశాలపై పలుసార్లు విజ్ఞప్తు లు చేసినా కేంద్ర పట్టించుకోలేదు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి. కాజీపేటలో వ్యాగన్‌ మరమ్మతు కేంద్రం నిర్మించాలి. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు నిధులివ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిం ది. అయినా పట్టించుకోలేదు. రాష్ట్రంలో పూర్వపు తొమ్మి ది జిల్లాలకు ఒక్కోదానికి 50 కోట్ల చొప్పున వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నిధులు అందజేస్తున్నది. జిల్లాల పునర్విభజన జరిగింది. జిల్లాల సంఖ్య పెరిగింది. కాబట్టి కొత్త జిల్లాల ప్రాతిపదికగా నిధులు కేటాయించాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు.


రాష్ర్టాలకు వచ్చే పన్నుల వాటా నిధుల్లో ఒక శాతం కోత పడింది. దీనితో 2020-21 సంవత్సరానికి రాష్ర్టాలకు వచ్చే కేంద్ర నిధులను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించాలని ఎస్‌.కె.సింగ్‌ నేతృత్వంలోని 15వ ఆర్థి క సంఘం సిఫారసు చేసింది. ఐజీఎస్టీ నిధులను, పరిహార సుంకాన్ని  కేంద్రం చట్ట విరుద్ధంగా సంచిత నిధిలో జమ చేసి వాడుకుంటున్నది. 2017-18 కాగ్‌ నివేదిక ప్రకారం, రాష్ర్టాల రెవెన్యూలో 2015-16లో 35 వేల కోట్లను రాష్ర్టాలకు 2017లో పంచగా కేంద్రం వద్ద 1,76,688 కోట్లు మిగిలాయి. అనంతరం ఆర్థిక సంఘం సిఫారసులు పాటించకుండానే 67,998 కోట్లు విడుదల చేసింది దీంతో కొన్ని రాష్ర్టాలకు తక్కువ నిధులు వచ్చా యి. రాష్ర్టాల బలోపేతం, సమ్యాఖ్య స్ఫూర్తితో టీవ్‌ు ఇండియా నిర్మాణమే లక్ష్యంగా నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసి నా ఆ దిశగా కేంద్రం చర్యలేవీ లేవు. 


కేంద్ర ప్రాయోజిత పథకాలను హేతుబద్ధీకరించాలని, కొన్ని పథకాలను రద్దు చేయాలని 2016లో ఏర్పాటైన ముఖ్యమంత్రుల ఉప సంఘం చేసిన సిఫారసులను పట్టించుకోలేదు. రాష్ర్టాలే పథకాలను ఎంచుకొనే వీలుగా ఏక మొత్తంలో నిధులివ్వాలన్న సూచననూ అమలు చేయలేదు. రాష్ర్టాల జాబితాలోని అంశాలపై నిధుల ఖర్చును 14 నుంచి 20 శాతం వరకు, ఉమ్మడి జాబితాలోని అంశాలపై 13 నుం చి 17 శాతం వరకు కేంద్రం పెంచిందని, వాటిలో కోత విధించి రాష్ర్టాలకు నిధులను బదిలీ చేయాలని ముఖ్య మంత్రుల ఉప సంఘం తీర్మానించింది.  


తెలంగాణలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను ఆదాయ వనరులుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల నుంచి ఏటా సుమారు 5 నుంచి 6 కోట్ల ఆదాయం రాబట్టాలని అంచనా వేస్తున్నది. వాటి పరిధిలో పరిశ్రమలు, మత్స్య, పర్యాటకం వంటి విభాగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి, వాటి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టులను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత కూడా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెటులో కేటాయించాల్సి ఉంటుంది. 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు హద్దులు దాటిపోతున్నాయని, ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) రివ్యూ కమిటీ నివేదికలో పేర్కొన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పు జీడీపీలో 60 శాతానికి లోపే ఉండాలి. ఈ లక్ష్యాన్ని 2023 ఆర్థిక సంవత్సరంలోపే చేరుకోవాలి. ఇందులో జీడీపీలో కేంద్ర ప్రభుత్వ అప్పు లు 40 శాతం, రాష్ట్రప్రభుత్వాల అప్పులు 20 శాతం వరకే ఉండాలి. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అప్పు లు 48 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాం తాల అప్పులు 24.9 శాతానికి చేరాయి. రెండూ కలిపితే అప్పుల వాటా జీడిపీలో 72.9 శాతానికి చేరాయి. ఇది ఎఫ్‌ఆర్‌బీఎం విధించిన పరిమితి కంటే 12 శాతం అధి కం. 


ఈ అప్పులపై పార్లమెంటులో జరిగిన చర్చకు సమాధానంగా తెలంగాణ పరిమితికి లోబడి అప్పులు తీసుకున్నదని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నది.దేశంలోని ఏ రాష్ట్రమైనా భారీ ప్రాజెక్టులు, పెద్ద ఎత్తు న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు కేంద్రం తన వంతుగా సహాయం అందించాలి. కానీ బీజేపీ ప్రభు త్వం తెలంగాణలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులకు, రైతు బంధు లాంటి  పథకాలకు ఎలాంటి సహాయం అందిం చడం లేదు. కేంద్రం తెలంగాణపై చూపెడుతున్న వివక్షకు ఇదే నిదర్శనం.logo