సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Mar 06, 2020 , 23:06:18

ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలి

ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలి

ఆర్థికమాంద్యం నేపథ్యంలో దేశం ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. దీన్నుంచి గట్టెక్కించడానికి కేంద్రం తగిన చర్యలు చేపట్టాలి. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే ప్రతిపక్షాలు కూడా ప్రతి అంశాన్నీ రాజకీయం చేయకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ఆర్థికపరిస్థితిని చక్కదిద్దడానికి అధికారపార్టీ అన్నిపార్టీలను కలుపుకొని వెళ్లాలి.

- బి.వేణుగోపాల్‌, వరంగల్‌


చర్యలు తీసుకోవాలి

కరోనా వైరస్‌పై అనవసరమైన భయాలు వద్దని ఇప్పటికే వైద్య నిపుణు లు సూచించారు. ఈ వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కరోనా ప్రభావం మన దేశంలో అంతగా లేదు. అయినా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 24 గంట లు ఈ వైరస్‌ పట్ల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాయి. ప్రజలు కూడా తగు జాగ్రత్తలతో వ్యవహరించాలి. సమూహంగా నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.    

- సీహెచ్‌. సైదులు, హైదరాబాద్‌


ప్రగతిపథంలో తెలంగాణ

రాష్ట్ర అసెంబ్లీ వార్షిక సమావేశాల ప్రారంభో త్సవంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ప్రసం గం రాష్ట్ర ప్రజలను ఆకట్టుకున్నది. తమిళిసై గవర్నర్‌గా తొలిసారిగా ఉభయసభలను ఉద్దే శించి మాట్లాడారు. ఆ ప్రసంగంలో తెలంగా ణ రాష్ట్ర అభివృద్ధి విధానాన్ని ప్రజల ముం దుంచారు. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో ఆత్మ హత్యలు, వలసలు ఎక్కువగా ఉండేవని ఇప్పు డు రాష్ట్రంలో అవి తగ్గాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో విద్యుత్‌, ఎరువుల, నీటి కొరత ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు వాటి కొరత ఎక్కడా కనపడటం లేదంటూ ఆనందం వ్యక్తం చేశారు. పక్కా ప్రణాళికతో, ముందస్తు వ్యూహాలను అనుసరిస్తే తప్ప, ఇంతటి అభివృ ద్ధి సాధ్యం కాదని సీఎం కేసీఆర్‌ను తమిళిసై అభినందించడం హర్షణీ యం. సభలు సజా వుగా, నిర్మాణాత్మకంగా జరిగేందుకు అన్ని పార్టీలు కృషిచేయాలి.   

- మొగుళ్ల సునిల్‌, బేగంపేట, హైదరాబాద్‌


logo