శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Editorial - Mar 05, 2020 , 23:19:32

‘లెక్క’ తప్పని బడ్జెట్‌!

‘లెక్క’ తప్పని బడ్జెట్‌!

దేశ ఆర్థికాభివృద్ధిలో, జీఎస్టీ రాబడిలో తెలంగాణ కీలక భూమికను నిర్వర్తిస్తున్నది. ఇది కాదనలేని వాస్తవమని ఇటీవల హైదరాబాద్‌ పర్యటనలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బహిరంగంగా అంగీకరించక తప్పలేదు. తెలంగాణ ఆర్థికపరిస్థితి మెరుగ్గా ఉందని, క్రమశిక్షణ ఎప్పుడూ తప్పలేదని కేంద్రం పార్లమెంట్‌ సాక్షిగా పలుసార్లు ప్రకటించింది.

నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్య మ నినాదం. అదే నినాదంతో ఉద్యమాన్ని రాష్ట్ర సాధన గమ్యానికి చేర్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ కొత్త రాష్ట్రం పాలనా పగ్గాలు చేపట్టింది. ఉద్యమపార్టీ తన నిర్దిష్టమైన వ్యూహం తో కొనసాగిస్తున్న పరిపాలన వల్ల మూడు నిర్దేశిత లక్ష్యాల స్వప్నం సాకారమవుతున్నది. నిధులు పెరుగుతున్నాయి. సముద్రంలో వృథాగా కలిసే నీళ్లు పంట పొలాలకు మళ్లుతున్నాయి. చకాచకా నియామకాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే సీఎం కేసీఆర్‌ చేపట్టిన పరిపాలనా సంస్కరణలు, సమగ్ర ప్రణాళికతో కూడిన విధానాలు రాష్ట్ర ఆర్థిక రథచక్రాలను పరుగులు పెట్టించాయి. తెలంగాణ రాష్ట్ర సంపద అంతకంతకు పెరుగుతున్నది. 


దేశంలోని పెద్ద రాష్ర్టాలను తలదన్నేలా సంపదను పెంచుకుంటూ సంపన్న రాష్ట్రంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నది. తెలంగాణ ఆవిర్భవించిన ఐదేండ్లలో రాష్ట్రం మొత్తం గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌ సంపద (జీఎస్‌డీపీ) 4 లక్షల కోట్ల రూపాయల నుంచి రూ.8.8 లక్షల కోట్లను దాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అది కాస్త 9.5 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉన్నది. తలసరి ఆదాయ వృద్ధిలోనూ అగ్రభాగాన నిలిచింది. రాష్ట్ర సంపదను పెంచడమే కాకుండా రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనలో దేశంలోనే ప్రత్యేకతను చాటుకుంటున్నది. రెవెన్యూ మిగులును సాధిస్తూ, ద్రవ్యలోటును నియంత్రణలో ఉంచు తూ, సంపద ఎక్కువ ఉన్నా అప్పులు తీసుకుంటూ ఆర్థిక క్రమశిక్షణ చాటుతూ దేశ బడ్జెట్‌కే దిక్సూచిగా నిలుస్తున్నది. దేశంలో బలమైన ఆర్థిక శక్తిగా నిలుస్తున్న  రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ల రూపకల్పనలో ఆచితూచి వ్యవహరిస్తున్నది.


దేశ ఆర్థికాభివృద్ధిలో, జీఎస్టీ రాబడిలో తెలంగాణ కీలక భూమికను నిర్వర్తిస్తున్నది. ఇది కాదనలేని వాస్తవమని ఇటీవల హైదరాబాద్‌ పర్యటనలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బహిరంగంగా అంగీకరించక తప్పలేదు. తెలంగాణ ఆర్థికపరిస్థితి మెరుగ్గా ఉందని, క్రమశిక్షణ ఎప్పుడూ తప్పలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా పలుసార్లు ప్రకటించింది.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 7వ వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 8న చట్టసభల్లో ప్రవేశపెట్టబోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21 వార్షిక బడ్జెట్‌ను పక్కా లెక్కలతో రూపొందించడానికి భారీగా కసరత్తు జరిగింది. ప్రతి పైసకు లెక్కతో బడ్జెట్‌కు రూపకల్పన జరిగింది. బడ్జెట్‌ అంటే ఆదాయవ్యయాల పట్టిక. ఏడాది కాలంలో వచ్చే రాబడి ఎంత, వ్యయం ఎంత అనే లెక్కలతో ప్రధానంగా బడ్జెట్‌ను రూపొందిస్తారు. ప్రస్తుత ఆర్థికపరిస్థితిని పరిగణనలోకి తీసుకొని వచ్చే 12 నెలలకు ముందుగానే అంచనా వేయాల్సి ఉంటుంది. ఉమ్మడి ఏపీలో ఆ అంచనాలు గంపగుత్తగా ఉండేవి. కానీ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బడ్జెట్‌ అంటే పక్కా లెక్కలతో పకడ్భందీ అంచనాలు అనే విధానానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. గంపగుత్త లెక్కలకు స్వస్తి పలికారు. అంచనాలు, వాస్తవానికి అతిదగ్గరలో ఉండేలా వార్షిక బడ్జెట్‌లకు రూపకల్పన చేశారు. 


వాస్తవానికి రాష్ట్రం ఆవిర్భవించి న తర్వాత రాష్ట్రంలో సొంత రాబడులు భారీగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో రూ.37 వేల కోట్లుగా రాష్ట్ర ప్రభు త్వం తీసుకున్న పలు అభివృద్ధి, సంక్షేమ, శాంతిభద్రత చర్యల వల్ల పెట్టుబడులు, రాబడులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం సొంత రాబడుల మొత్తం 70 వేల కోట్లకు చేరింది. రెవె న్యూ, క్యాపిటల్‌, ఇతర రాబడులను మొత్తం కలిపితే లక్షా 50 వేల కోట్ల వరకు పెరిగింది. సొంత రాబడులు ఏటా 17-21 శాతానికి పెరిగాయి. దానికి తగ్గట్టుగానే బడ్జెట్‌ సైజు పెరుగుతూ వచ్చింది. కానీ గతేడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థికపరమైన ఒడిదుడుకులు, దేశంలో నెలకొన్న ఆర్థికమాం ద్యం నీడలు మన రాష్ట్ర వృద్ధిరేటుపై కూడా ప్రతికూల ప్రభావం చూపా యి. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకొన్న పరిస్థితులను మొదటినుంచి నిశితంగా పరిశీలిస్తున్న ప్రభుత్వం ఆచితూచి  అడుగులు ముందుకువే స్తున్నది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో ముఖ్యమంత్రి బడ్జెట్‌ అంచనాలను భారీగా తగ్గిం చి ఆశ్చర్యపరిచారు. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో 1,82,059.06కోట్లుగా ఉన్న వార్షిక బడ్జెట్‌ను సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో లక్షా 48 వేల కోట్లకు కుదించి ఆర్థిక నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేశారు. వాస్తవ బడ్జెట్‌ అంటే ఏమిటో కేసీఆర్‌ చేతల్లో చూపారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి రాబడులు బాగా పెరిగా యి. అదేస్థాయిలో బడ్జెట్‌ పెరిగింది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థికమాంద్యం వల్ల మన రాబడుల వృద్ధిరేటు బాగా తగ్గుతున్నది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. 


రాబడుల వృద్ధిరేటు తగ్గుతున్నది. ఆ మేరకు బడ్జెట్‌ను తగ్గించామని, ఇందు లో డాంబికాలకు ఆస్కారం లేదని సీఎం స్పష్టం చేయడం వాస్తవ బడ్జెట్‌కు అద్దం పడుతున్నది. ఏటా కనీసం 17 శాతం వరకు ఉన్న రాబడు ల వృద్ధిరేటు ఈసారి 5-6 శాతానికే పరిమితమవుతున్నదని అంచనా వేశారు. వాస్తవానికి మన రాష్ట్రం ఏర్పడినప్పుడు లక్ష కోట్ల లోపే ఉన్న, బడ్జెట్‌ రాబడులు బాగా పెరుగడంతో 1,61,856 కోట్లకు చేరింది. కానీ రాబడుల్లో వృద్ధిరేటులో తేడా వచ్చే అవకాశం ఉందని తెలిసి సీఎం స్వయంగా బడ్జెట్‌ అంచనాలను తగ్గించి 1.46 లక్షల కోట్లకు కుదించా రు. కేంద్ర బడ్జెట్‌లో ప్రతికూల నిర్ణయాలు కూడా బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.


రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో అనేక అనుమానాలు, సందేహాలను పటాపంచలు చేస్తూ సుస్థిరపాలన, శాంతిభద్రతల పరిరక్షణ, పారదర్శక విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రం నిపుణుల అంచనాలకు అందని రీతిలో ఆర్థిక ప్రగతి సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఫలితంగా రాష్ట్ర సంపద పెరిగింది. గొలుసుకట్టుగా రాష్ట్ర సొంత రాబడులు పెరిగాయి. అభివృద్ధి, సంక్షేమానికి కేటాయించే నిధులు పెరిగాయి. సొంత రాబడుల వృద్ధిరేటులో, జీఎస్టీ వసూళ్లలో, ఆర్థికక్రమశిక్షణలో అగ్రస్థానంలో నిలిచి ‘విస్‌డమ్‌ ఆఫ్‌ ఎకానమీ’ని ప్రదర్శించిన రాష్ట్రంగా దేశాని కే దిక్సూచిగా మారింది. మొదటినుంచి పటిష్టమైన వ్యూహంతో జీఎస్టీ వసూళ్లను పెంచుకొని కేంద్రం నుంచి అతి తక్కువ నష్టపరిహారం తీసుకున్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలను అందుకుంటున్నది.


దేశ ఆర్థికాభివృద్ధిలో, జీఎస్టీ రాబడిలో  తెలంగాణ  కీలక భూమికను నిర్వర్తిస్తున్నది. ఇది కాదనలేని వాస్తవమని ఇటీవల హైదరాబాద్‌ పర్యటనలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బహిరంగంగా అంగీకరించక తప్పలేదు. తెలంగాణ ఆర్థికపరిస్థితి మెరుగ్గా ఉందని, క్రమశిక్షణ ఎప్పు డూ తప్పలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా పలుసార్లు ప్రకటించింది.  ఆర్థిక పరిపాలన, క్రమశిక్షణలో తెలంగాణ ముందుస్థానంలో ఉన్నదని కేంద్ర ప్రభుత్వ అధీనంలోని నీతి ఆయోగ్‌ తాజాగా  నిర్వహించిన ‘సస్టేనెబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌' ఇండెక్స్‌ సర్వేలో తేలింది. 


ఇక రాష్ట్రం మొత్తం సంపద జీఎస్‌డీపీ 8.66 లక్షల కోట్లకు పెరిగింది. తెలంగాణ ఆవిర్భవించిన 2013-14 ఆర్థిక సంవత్సరానికి 3.59లక్షల కోట్ల వరకు ఉన్న సంపద తెలంగాణ ప్రభుత్వ విధానాల వల్ల దాదాపు 3 రెట్ల వరకు పెరిగింది. దేశంలో అతివేగంగా సంపద పెరిగిన రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. 2013-14లో స్థిరధరల వద్ద 5.4 శాతంగా ఉన్న జీఎస్‌డిపీ 2018-19నాటికి 10.5 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో 5.5 శాతంగా ఉన్న  కేంద్ర జీడీపీ 6 శాతానికే పరిమితమైంది. ఈ సారి మరీ దారుణంగా 4.5శా తానికి పరిమితం కావడం ఆందోళన కలిగిస్తున్నది.


 రాష్ట్రం ఏర్పడిన ఐదేండ్లలో స్థిరధరలు, ప్రస్తుత ధరలు రెండు కలిపి 13.90 శాతం వృద్ధిరేటును సాధించి ర్యాపిడ్‌ గ్రోత్‌ లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. మన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక నిలిచాయి. సంపద పెరగడంతో ప్రజల జీవన ప్రమాణం పెరిగింది. తలసరి ఆదాయం రూ.95 వేల నుంచి గతేడాది వరకు రూ.2.06 లక్షల కు పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అతి తక్కువకాలంలో ఎక్కువ సంపదను, తలసరి ఆదాయాన్ని సాధించిన రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలువడం విశేషం.


logo