మంగళవారం 31 మార్చి 2020
Editorial - Mar 05, 2020 , 23:15:34

ఈసారైనా ఊరట కలిగేనా?

ఈసారైనా ఊరట కలిగేనా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ లైంగికదాడి, హత్య కేసులో నిందితులకు పాటియాలా హౌస్‌ కోర్టు మరోసారి ఉరిశిక్ష ఖారారు చేసింది. మార్చి 20న దోషులకు ఉరిశిక్ష అమలుకానున్నది. అయితే ఇప్పటికే మూడుసార్లు ఉరిశిక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఈ సారైనా ఉరిశిక్ష అమలుజరిగి తమ కుటుంబానికి న్యాయం జరుగు తుందని ఆశిస్తున్నామని నిర్భయ తల్లి అంటున్నారు. అయితే నిందితు డి క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి తిరస్కరణకు గురికావడంతో ఈసారి నిదింతులకు ఉరిశిక్ష అమలయ్యే అవకాశం ఉన్నది. 

- సంధ్యారాణి విరగదిండ్ల, పరావత్‌పూర్‌, మహబూబ్‌నగర్‌


హోలీ వేడుకలకు దూరంగా ఉండాలి

కరోనా వైరస్‌ కారణంగా హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని రాష్ట్ర పతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకోవటం అభినందనీయం. పెద్దమొత్తంలో స్నేహితులు, బంధువు లు, కుటుంబసభ్యులు కలిసి రంగులు చల్లుకుంటూ చేసుకునే రంగుల పండుగ హోలీ. అయితే దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం తక్కువగానే ఉన్నా ముందస్తు జాగ్రత్తలు పాటించటం అవసరం. ప్రజలందరూ సమూహ వేడుకలకు దూరంగా ఉంటే మంచిది. 

- బత్తిని లక్ష్మయ్య, మిర్యాలగూడ


హర్షణీయం

నలుగురు గుమిగూడితే చాలు కరోనా కబుర్లే.  కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తు న్నది. అయితే హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ వ్యాపించిందంటూ జరుగుతున్న వదంతులను నమ్మవద్దు. అయినప్పటికీ ప్రభుత్వం ముంద స్తు చర్యలు తీసుకుంటుండటం స్వాగతించా ల్సిన విషయం. ముఖ్యమంత్రి కేసీఆర్‌  ర్యంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్‌ ఎప్పటికప్పుడు మీడియాతో ప్రజల కు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్‌ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి పటి ష్ఠమైన చర్యలు తీసుకుంటున్నదో ప్రజలకు తెలియజేస్తుండటం హర్షణీయం. అయితే ఇందులో ప్రజల భాగస్వామ్యం అవసరం. అప్పుడే కరోనా వైరస్‌ను ఎదుర్కోవచ్చు. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదం తులను నమ్మకుండా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 

- మ్యాన శ్రీనివాస్‌, కరీంనగర్‌


logo
>>>>>>