సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Mar 03, 2020 , 23:06:54

మన చేతుల్లోనే పరిశుభ్రత

మన చేతుల్లోనే పరిశుభ్రత

గ్రామ పంచాయతీల్లో, పట్టణాల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పారిశుధ్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యల కంటే ప్రజల చైతన్యంతోనే గ్రామా లు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంటాయి. మన ఇంటితో పాటు మన పరిసర ప్రాంతాల పరిశుభ్రత మన చేతుల్లోనే ఉంటుందనే వాస్తవాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే స్వచ్ఛందం గా ముందుకు వచ్చి తమ చుట్టుపక్కల ఉన్న చెత్తాచెదారాన్ని శుభ్రం చేసుకుంటున్నారు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు.గతంలో పోలిస్తే చాలా గ్రామాల్లో, పట్టణాలలో మార్పు కనిపిస్తున్నది. ఇదే స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలి. పరిశుభ్రతతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యమివ్వాలి.

- జి. అనిల్‌కుమార్‌, భద్రాచలం


తగిన తోడ్పాటు అందించాలి

ఆర్థిక సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి లోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ప్రభు త్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల కోసం ఏటా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నది. అందుకే ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్టు వివిధ పథకాలు, ప్రాజెక్టుల కోసం తగిన నిధులు కేటాయించి రాష్ర్టాభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందించాలి. 

- పి. లక్ష్మణ్‌, సిరిసిల్ల


అప్రమత్తంగా ఉండాలి

కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తగిన సూచనలు, సలహాలు ఇచ్చాయి. వైరస్‌ను ఎదుర్కొవడానికి అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నామని  ప్రకటించాయి. వైరస్‌  బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలంతా తప్పకుండా పాటించాలి. 

- జనగాని సత్యం, హైదరాబాద్‌


logo