గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 01, 2020 , 22:58:50

సినిమా!

సినిమా!

ఎందుకో నాత్రి

ఎండితెర ఎదురుగా వుంది

దాసిపెట్టుకున్న

కొన్ని పాత రీళ్ళలోంచి

రాజనాల నువ్వుతుంటే

లేసి కూసున్నా..

మాసికల లాగు

గుండీలూడిన అంగి అదృశ్యమై

పట్టుబట్టలతో ప్రత్యక్షమైన రాజు

ప్రేమ్‌టాకీస్‌ నా భువనవిజయం!


బడి ఎగ్గొట్టిన మ్యాట్ని మాటున

తొలి ధిక్కార పతాకం సినిమా 

పేడతట్టలు మోసుకొచ్చినా

పొయిలో కట్టెలు కొట్టుకొచ్చినా

దేవకన్య బి సరోజ

మధురవాణి సావిత్రి నవ్వు కోసమే!

దేవకన్యలతో రాజకుమారిలతో

రాత్రిని రాజ్యం చేసుకొని

తెల్లవార్లు పాలించేది!

నాలో నేను ఇంకొకడిగ ఉన్న రోజులు

వాడు బలవంతుడు, ప్రేమికుడు

వాడి ఆశ సీతాకోక చిలుకల ఆశ

కొన్ని చిత్రాలు

వాడు విహరించే పూల తోటలు..

పెదవుల మీన

తేనేటీగల కల కారుతుంటే

స్వర్గద్వారం తెరుచుకునేది..!

మంత్రాలు మహిమలు

నాకు కొత్తేమి కాదు

కాంతారావు దేహంలోకి

పరకాయ ప్రవేశం చేసేవాడ్ని

అప్పుడు నా అంతరం

అల్లావుద్దీన్‌ అద్భుతదీపం!

గట్క గంజితో పాటు

జానపద కథలు తాగిన

చెరువో ఆకాశమో తెలియదు

నేనెక్కిన తెప్ప పుష్పకవిమానమే..!

రెండవ ఆట వదిలినంక కూడా

గుర్రం మీన్నే నా కోటకు వచ్చేది..!

- మునాసు వెంకట్‌, 998481 58163


logo
>>>>>>