శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Editorial - Mar 01, 2020 , 22:57:32

‘వరదగూడు’ ఆవిష్కరణ సభ

‘వరదగూడు’ ఆవిష్కరణ సభ

దక్కన్‌ సాహిత్య సభ, ఏవీ కళాశాల తెలుగుశాఖ సంయుక్త ఆధ్వర్యంలో వై. సత్యనారాయణ రచించిన ‘వరదగూడు’ కవితా సంపుటి ఆవిష్కరణ 2020 మార్చి 5న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని ఏవీ కళాశాలలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎన్‌.గోపి, ఆచార్య కె.రామచంద్రారెడ్డి, డాక్టర్‌ పత్తిపాక మోహన్‌, డాక్టర్‌ కాంచనపల్లి, కె.రఘువీర్‌రెడ్డి, డాక్టర్‌ కె. గౌతమి, డాక్టర్‌ సీహెచ్‌ రాజలింగం, డాక్టర్‌ ఎస్‌.గోపీకృష్ణ, డాక్టర్‌ కె. లక్ష్మీవిజయ తదితరులు పాల్గొంటారు. 

 -దక్కన్‌ సాహిత్య సభ


మధునాపంతుల శతజయంతి సదస్సు

కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి శత జయంతి సదస్సు ఆయన స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లాలోని యానాం దగ్గరలోని పల్లిపాలెంలో 2020 మార్చి 5న జరుగుతుంది. ఈ సదస్సులో కె.శివారెడ్డి, మండలి బుద్ధప్రసాద్‌, రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, శిఖామణి, అప్పాజోస్యుల, రెంటాల, దేవదానం రాజు, సుధామ, రాపాక, లక్ష్మణ చక్రవర్తి తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా నూరుశరత్తుల మధునాపంతుల శతజయంతి రోజున ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తారు. 

-ఎంవీ చలపతి, మధునాపంతుల ఫౌండేషన్‌, పల్లిపాలెం 


‘మాలపల్లె కథలు’ఆవిష్కరణ సభ

కవి, రచయిత భూతం ముత్యాలు రచించిన ‘మాలపల్లె కథలు’ఆవిష్కరణ సభ 2020 మార్చి 7న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌, ఓయూ లోని ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ గెస్ట్‌హౌజ్‌లో జరుగుతుంది. డాక్టర్‌ జి.వి. రత్నాకర్‌ అధ్యక్షతన జరుగు సభలో అతిథులుగా జూపూడి ప్రభాకర్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌, డాక్టర్‌ ఎండీ జునైద్‌ జాకీర్‌, అక్బర్‌, డాక్టర్‌ వెంకట్‌రావు, డాక్టర్‌ సవిన్‌ సౌడ, డాక్టర్‌ నిమ్మ బాబురావు, అంగరి ప్రదీప్‌ హాజరవుతారు. పుస్తకాన్ని డాక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి ఆవిష్కరిస్తారు. సమన్వయకర్త-మంచాల లింగస్వామి. 

-ఆల్‌ మాల స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఎంఎస్‌ఏ), హైదరాబాద్‌


దరఖాస్తులకు ఆహ్వానం

‘అర్పిత’ సాహిత్య, సాంస్కృతిక సేవా సంస్థ ఏటా ప్రదానంచేసే జాతీయస్థాయి పురస్కారాలకు ఇరురాష్ర్టాల ప్రతిభావంతుల నుంచి దరఖాస్తులను కోరుతున్నది. సమాజసేవ, పర్యావరణ పరిరక్షణ, విధినిర్వహణ, విద్య, వైద్యం, కళ, క్రీడ, సాహిత్యం, పరిశ్రమలు, వ్యవసాయం, సంగీతం వంటి పలురంగాల నుంచి ప్రతిభగల వారు దరఖాస్తులు 2020 మార్చి 5లోపు పంపించాలి. పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో, ఆధారాలకు సంబంధించిన జిరాక్స్‌ కాపీలు ఉండాలి. 

చిరునామా: అమృతకోర్ట్‌ అపార్ట్‌మెంట్‌, సీహెచ్‌-2, డోర్‌ నెం: 30-8-29/25, భాను స్ట్రీట్‌, డాబా గార్డెన్స్‌, విశాఖపట్నం-20. వివరాలకు:9391379903  

-జి.భవాని, అర్పిత, కార్యనిర్వాహక కార్యదర్శి


రచనలకు ఆహ్వానం

డాక్టర్‌ సురభి లక్ష్మీశారద గారు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన కళాకారిణి. నాట్యకళాకారిణిగా ఆమె కృషి, ప్రతిభకు గౌరవ సూచకంగా తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఒక అభినందన సంచికను ప్రచరించాలని భావిస్తున్నది. కాబట్టి సన్నిహితులు, విద్యార్థులు, ఆమె కళాసృజన, ప్రతిభను ఎరిగిన వారి నుంచి, సంస్థల నుంచి వ్యాసాలను ఆహ్వానిస్తున్నది. రచనలను 2020 మార్చి నెలాఖరులోగా పంపించాలి.

చిరునామా: డాక్టర్‌ సురభి లక్ష్మీశారద, ఇంటి నెం:1-4-2/3/2, వీధినెం:4, నాగేశ్వరనగర్‌ కాలనీ, కొత్తపేట, హైదరాబాద్‌-35. సెల్‌: 9441618937

-కర్నాటి గోవర్ధన్‌


మఖ్దూమ్‌ అవార్డు ప్రదానోత్సవ సభ

కవి,షాయరే తెలంగాణ మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ పేరిట సిటీ కాలేజీ నెలకొల్పిన నేషనల్‌ అవార్డు ప్రదానోత్సవ సభ 2020 మార్చి 4న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ సిటీకాలేజీలోని గ్రేట్‌హాల్‌లో జరుగుతుంది. డాక్టర్‌ వి.విజయలక్ష్మి అధ్యక్షతన జరుగు సభలో గౌరవఅతిథులుగా డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు, డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అవార్డు గ్రహీత సుద్దాల అశోక్‌తేజ పాల్గొంటారు.

నిర్వహణ-డాక్టర్‌ విప్లవ్‌దత్‌ శుక్లా, డాక్టర్‌ యాకూబ్‌


logo