శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Feb 29, 2020 , 23:06:01

లిబ్రాతో కరెన్సీలకు ముప్పు

లిబ్రాతో కరెన్సీలకు ముప్పు

సీబీడీసీ దేశ ద్రవ్య విధానాలపైన, ఆర్థికవ్యవస్థపైన విశేష ప్రభావం చూపుతుంది. రిజర్వు బ్యాంక్‌ పాత్ర కూడా మారిపోతుంది. వడ్డీ రాబడి ఉండి, అందరికి అందుబాటులో ఉంటే ప్రజలు తమ డిజిటల్‌ మనీని రిజర్వుబ్యాంక్‌ దగ్గరే పెడుతారు తప్ప వాణిజ్య బ్యాంకులను ఆశ్రయించరు. ప్రజల పొదుపు సొమ్ము బ్యాంక్‌ డిపాజిట్ల రూపంలో కాకుండా సీబీడీసీగా మారుతుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చుకోవడానికి నగదు కావలి వస్తే రిజర్వుబ్యాంకుపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడున్న ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుంది.

2019 మధ్యలో ఫేస్‌బుక్‌ ప్రపంచ డిజిటల్‌ కరెన్సీగా లిబ్రాను రిజిస్టర్‌ చేసింది. సులభమైన ప్రపంచ డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టడం, కోట్లాదిమందికి సాధికారతనిచ్చే ఆర్థిక మౌలిక సదుపాయాన్ని కల్పించడం లిబ్రా రూపకల్పన లక్ష్యమని ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం, నియంత్రణాసంస్థ లు ఈ లిబ్రా ప్రాజెక్టును ఆమోదించలేదు. అమెరికా డాలర్‌తో పాటు వివిధదేశాల కరెన్సీకి ఈ లిబ్రా ముప్పుగా పరిణమిస్తుందనే భయాలున్నాయి. లిబ్రా ప్రాజెక్టులో భాగస్వామ్యం పొందుతామని ప్రకటించిన వీసా, మాస్టర్‌, పే పాల్‌, తదితర సంస్థలు కూడా జారుకున్నాయి. అయినా ఫేస్‌బుక్‌ లిబ్రా ప్రాజెక్టు విషయంలో వెనుకకుపోవడం లేదు. వివిధ దేశాల కేంద్రీ య బ్యాంకులు ఫేస్‌బుక్‌ ప్రకటన వల్ల అప్రమత్తం కావాలి.


క్రిప్టో కరెన్సీలకు అనేక పరిమితులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, నియంత్రణా సంస్థలు ప్రైవేటు క్రిప్టో కరెన్సీలను చిన్నచూపు చూస్తున్నాయి. వీటి ద్వారా మనీ లాండరింగ్‌, మాదకద్రవ్య రవాణా, ఉగ్రవాదానికి నిధులు, పన్ను ఎగవేత, అవినీతి వంటి ఎన్నో అక్రమాలు సాగే అవకాశం ఉన్నది. వివిధ దేశాల అధికారిక కరెన్సీకి ఉండే మూడు ప్రధాన లక్షణాలు ఈ క్రిప్టో కరెన్సీలకు లేవు. మొదటిది-యూనిట్‌ ఆఫ్‌ అకౌంట్‌. ఏ వస్తువును, సేవనైనా నగదుతో పోల్చి లెక్కిస్తారు. రెండవది- మీడియం ఆఫ్‌ ఎక్సేంజీ. అమ్మకం, కొనుగోళ్ల వంటి అనేక లావాదేవీలకు మాధ్యమంగా పనిచేస్తుంది. మూడు-స్టోర్‌ వాల్యూ. క్షీణత లేకుండా దాచుకోగలిగిన ఆస్తి. క్రిప్టో కరెన్సీకి ఈ మూడు లక్షణాలు లేకపోగా, వాటికి నగదు చెల్లింపులు జరిపే చట్టబద్ధత, ఆమోదనీయత లేదు. 


2009లో బిట్‌కాయిన్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి దశాబ్దకాలంగా ప్రైవేటు క్రిప్టో కరెన్సీలు చెలామణిలో ఉన్నాయి. ఎంత హంగామా చేసినా ఇవి చట్టబద్ధ కరెన్సీల కు సాటిరాలేకపోయాయి. బిట్‌కాయిన్‌ తయారీ 21 మిలియన్‌ యూనిట్లకే పరిమి తం కాగా, అందులో 81 శాతం మాత్రమే వినియోగమయ్యాయి. బిట్‌కాయిన్‌ ద్వారా సెకనుకు ఏడు లావాదేవీలు మాత్రమే సాధ్యం. కానీ కార్డ్‌ కంపెనీలు సెకనుకు 24 వేల లావాదేవీలు సాగించగలవు. మోతాదులో, వేగంలో క్రిప్టోకరెన్సీలు ప్రభుత్వ నగదుకు సరితూగలేకపోతున్నాయి. క్రిప్టో కరెన్సీలు జూదానికి లాటరీకి వాడే టికెట్‌ మాదిరిగా మారాయి తప్ప నగదుకు ప్రత్యామ్నాయం కాలేకపోయా యి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధికారిక కరెన్సీలు 185 ఉంటే, క్రిప్టో కరెన్సీలు మూడు వేలున్నాయి. మరో మూడు వేలు అంతరించాయి. చాలా దేశాలు వీటిని నిషేధించాయి. కొన్నిదేశాలు మాత్రం నియంత్రణ విధానం ప్రవేశపెట్టి వీటి తో లావాదేవీలు ప్రారంభించాయి.


క్రిప్టో కరెన్సీల ప్రయోగం విఫలమైంది కానీ, లిబ్రా ప్రయోగం ఇందుకు భిన్నమైంది. లిబ్రా అధికారిక కరెన్సీకి ఉండే అన్ని లక్షణాలను సంతరించుకుంటున్నది. ఫేస్‌బుక్‌కు 2.5 బిలియన్‌ వినియోగదారులున్నారు. ఈ వేదికపై లావాదేవీల మాధ్యమంగా లిబ్రా అవతరించవచ్చు. దీనివల్ల వివిధ దేశాల బ్యాంకింగ్‌ వ్యవస్థలపై, ఆర్థిక విధానాలపై ప్రభావం పడవచ్చు. అందువల్ల ప్రభుత్వాలలో, నియంత్రణా సంస్థలలో కలవరం మొదలైంది. లిబ్రా మూలంగా తమ ఆర్థిక వ్యవస్థలకు ఏర్పడే ముప్పును తట్టుకోవడానికి పలు ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. నిప్పును నిప్పుతోనే ఎదుర్కోవాలని ఐఎంఎఫ్‌ మాజీ చీఫ్‌ క్రిస్టీనా లాగార్డ్‌ పిలుపునిచ్చారు. అంటే అన్నిదేశాలు కూడా సొంత డిజిటల్‌ కరెన్సీని రూపొందించుకోవాలని అర్థం. ఇందుకు సంబంధించి ఐఎంఎఫ్‌ ఎన్నో అధ్యయనాలు సాగించింది. యూకే, ఈయూ, కెనెడా, జపాన్‌, స్వీడెన్‌, స్విట్జర్లాండ్‌ సంయుక్తంగా డిజిటల్‌ కరెన్సీ విషయమై పరిశోధనలు సాగిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక కూడా సూచనలు చేస్తున్నది.


ఈక్వెడార్‌, టునీషియా తదితర చిన్నదేశాలు ప్రయోగాత్మకంగా డిజిటల్‌ కరెన్సీ ని ప్రవేశపెట్టాయి. అన్నిటి కన్నా చైనా ఎంతో ముందున్నది. అధికారికంగా యువా న్‌ డిజిటల్‌ కరెన్సీని ప్రవేశ పెడుతున్నది. వివిధ దేశాల కరెన్సీల మధ్య సెటిల్‌మెంట్‌ కరెన్సీగా దీన్ని ప్రవేశపెట్టవచ్చు. చైనాలోని 140 కోట్ల మంది జనాభాకు ఇది అందుబాటులో ఉంటుంది. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఇదొక భారీ డిజిటల్‌ చెల్లింపు ఉపకరణంగా మారుతుంది. దీనివల్ల దేశీయ, అంతర్జాతీయ మార్కె ట్లు భారీ మార్పునకు లోనవుతాయి. నాణేలను మొదటగా ప్రవేశపెట్టింది చైనాయే.  కాగితపు కరెన్సీని కూడా మొదటగా ఏడవ శతాబ్దంలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు డిజిటల్‌ కరెన్సీలోనూ ముందున్నది. చైనా డిజిటల్‌ కరెన్సీతో పాటు, లిబ్రా ప్రభా వం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. 


అధికారిక డిజిటల్‌ కరెన్సీలు కాగితపు కరెన్సీలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. సెం ట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)కి సంబంధించి- అందుబాటు, గుర్తింపు, వడ్డీ అనే మూడు లక్షణాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ‘అందుబా టు’-సీబీడీసీ సార్వత్రికంగా అందుబాటులోకి రావచ్చు. లేదా వాణిజ్య బ్యాంకులు, ఆర్థికసంస్థలకు మాత్రమే పరిమితం కావచ్చు. రెండు లక్షణాలతో కూడా ఉండవ చ్చు. ప్రజలు కేంద్రీయ బ్యాంకులో నేరుగా ఖాతా తెరువవచ్చు లేదా వాణిజ్య బ్యాంకులతోనే లావాదేవీలు జరుపవచ్చు. బ్యాంకుల ద్వారా భద్రత ఉండదని భావిస్తే, ప్రజలు నేరుగా కేంద్రీయ బ్యాంకులలోనే డిజిటల్‌ నగదు జమ చేస్తారు. ఇక ‘గుర్తింపు’ విషయానికి వస్తే- డిజిటల్‌ నగదు పేపర్‌ కరెన్సీ మాదిరిగా ఎవరి దగ్గర ఉన్నదో గుర్తించలేని పరిస్థితి ఉండవచ్చు. లేదా బ్యాంకు డిపాజిట్ల మాదిరిగా కచ్చితమైన గుర్తింపు ఉండవచ్చు. గుర్తించే విధానం ఉంటే అక్రమ లావాదేవీలకు తావుండదు, వివాదాల పరిష్కారం సులభమవుతుంది. అందువల్ల ప్రభుత్వాలు డిజిటల్‌ కరెన్సీని గుర్తించే వీలుండాలని భావిస్తాయి. ఇక ‘వడీ’్డ విషయానికి వస్తే - సీబీడీసీ ఉన్నంత మాత్రాన వడ్డీ దానికదే లభించకపోవచ్చు. లేదా బ్యాంక్‌ డిపాజిట్‌ మాదిరిగా వడ్డీ ఉండవచ్చు.


సీబీడీసీ దేశ ద్రవ్య విధానాలపైన, ఆర్థికవ్యవస్థపైన విశేష ప్రభావం చూపుతుం ది. రిజర్వు బ్యాంక్‌ పాత్ర కూడా మారిపోతుంది. వడ్డీ రాబడి ఉండి, అందరికి అం దుబాటులో ఉంటే ప్రజలు తమ డిజిటల్‌ మనీని రిజర్వుబ్యాంక్‌ దగ్గరే పెడుతారు తప్ప వాణిజ్య బ్యాంకులను ఆశ్రయించరు. ప్రజల పొదుపు సొమ్ము బ్యాంక్‌ డిపాజిట్ల రూపంలో కాకుండా సీబీడీసీగా మారుతుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చుకోవడానికి నగదు కావలి వస్తే రిజర్వుబ్యాంకుపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ విధం గా ఇప్పుడున్న ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుంది. కేంద్రీయ బ్యాంకు పాత్రను పునర్నిర్వచించక తప్పదు. నగదును బ్యాంకుల్లో వడ్డీ కోసం పెట్టుకోవడం కన్నా ఉపయోగంలోకి తేవడం వల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. సీబీడీసీ వడ్డీ విధానం అంత ప్రోత్సాహకరంగా ఉండకపోతే, ప్రజలు వ్యయంపై మక్కువ చూపవచ్చు.


డిజిటల్‌ కరెన్సీ రూపకల్పనలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సౌకర్యం, తక్కువ వ్యయం, భద్రత, అన్నివేళలా అందుబాటు, విశ్వసనీయత కలిగి ఉండాలి. సైబర్‌ దాడుల నుంచి భద్రత ఉండాలి. మనదేశంలో ఫేస్‌బుక్‌కు 260 మిలియన్‌, వాట్సాప్‌కు 400 మిలియన్‌ చురుకైన వినియోగదారులున్నారు. కానీ యూపీఐ వినియోగదారులు వంద మిలియన్‌ మాత్రమే. యూపీఐ మీదుగా చెల్లింపులకు అనుమతి పొందాలని ఈ సంస్థలు భావిస్తున్నాయి. దీనికి ఈ కామర్స్‌, రుణాలు, బీమా వం టి ఆర్థికసేవలు జోడింపు అయితే మొత్తం బ్యాంకింగ్‌/ఫైనాన్షియల్‌ వ్యవస్థనే ప్రమాదంలో పడుతుంది.


గూగుల్‌, అమెజాన్‌, యాపిల్‌ తదితరమైన సంస్థలు ఏమాత్రం వెనుకబడి లేవు. అమెరికా నియంత్రణ సంస్థలు ఆమోదం తెలిపితే చాలు, భారత చెల్లింపుల వ్యవస్థలోకే కాదు, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లోకి ప్రవేశిస్తాయి. మన ఆర్థిక సుస్థిరతకే ముప్పు తెస్తాయి. ఈ నేపథ్యంలో మన దేశమే స్వయంగా డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెడితే మంచిది. ఆర్‌బీఐ నోట్లు ముద్రించడానికి, సరఫరా చేయడానికి కోట్లాది రూపాయల ఖర్చవుతుంది. అవినీతి, పన్ను ఎగవేత, ఎన్నికల్లో ధన ప్రభావం, వాణిజ్య బ్యాంకులు నిలువ చేయడం మొదలైన ఇబ్బందులన్నీ డిజిటల్‌ కరెన్సీ వల్ల తీరుతాయి. సీబీడీసీ అమలులోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్దనోట్లను రద్దు చేయవచ్చు. కానీ మన విధానకర్తలు మాత్రం డిజిటల్‌ కరెన్సీ విషయంలో నత్తనడక నడుస్తున్నారు. ప్రభుత్వం 2017 లో నియమించిన సీబీడీసీ కమిటీ 2019లో నివేదికను సమర్పించింది. ఈ అంశం పై సంకోచాలకు అతీతంగా వ్యవహరించాలని మరో కమిటీని నియమించాలని సూచించింది. మన దేశంలో యూపీఐ, ఆధార్‌ డేటాబేస్‌ (వంద కోట్ల మేర ఉన్న ది), జేఏఎం (జనధన్‌- ఆధార్‌, మొబైల్‌) త్రయం విజయవంతమైంది. ఈ వినూ త్న ఆవిష్కరణలన్నీ మన దేశానివే.


ఆర్‌బీఐ నియమించినన నందన్‌ నీలేకని కమిటీ డిజిటల్‌ చెల్లింపులపైనే దృష్టి సారించింది. ఇది మంచి పరిణామమే కానీ నేటి పరిస్థితికి సరిపోయే ప్రయత్నం కాదు. డిజిటల్‌ కరెన్సీని- అధికార కరెన్సీగా లేదా ఇప్పుడున్న కరెన్సీకి అనుబంధమైనదిగా మార్చడానికి ఇంకా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగాలి. డిజిటల్‌ రూపంలో కరెన్సీని ప్రవేశపెట్టకపోతే మనకే నష్టం. కాగితపు కరెన్సీ ఆధునిక ప్రపంచానికి పదిహేను శతాబ్దాల పాటు సేవలు అందించింది. ఇక  ముగింపునకు వచ్చింది. సీబీడీసీ వాస్తవ రూపం దాల్చడానికి కొన్నేండ్లు పడుతుంది. కానీ అసాధ్యమైనది కాదు. చైనా సీబీడీసీ సర్వామోదమైన అంతర్జాతీయ సెటిల్‌మెంట్‌ కరెన్సీని ప్రవేశపెడితే అది భౌగోళిక రాజకీయాలనే మార్చివేస్తుంది.  సీబీడీసీ పరుగు పందెంలో చైనా ముందున్నది. మరోవైపు లిబ్రా తలుపు తడుతున్నది. మనం తలుపులు మూసుకొని ఉండకుండా పరిశోధన సాగించాలి. 

(వ్యాసరచయిత: పీఎస్‌యూ బ్యాంక్‌, ఎన్‌పీసీఐ మాజీ చైర్మన్‌)


logo