శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Feb 29, 2020 , 23:03:41

ప్రతి వ్యక్తిలో కేసీఆర్‌

ప్రతి వ్యక్తిలో కేసీఆర్‌

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనేకానేక పరిణామాలు మన గ్రామాలు, పట్టణాలపైన పడుతున్నయి. కీలకంగా చూస్తే మన గ్రామాలు, పట్టణాలను మారుతున్న మార్పులకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవటం కోసం కేసీఆర్‌ దార్శనిక ఆలోచనలతో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలను చేపట్టడం ముదావహం.ఇప్పుడు పల్లెలు, పట్టణాలను తీర్చిదిద్దుకునే పనిలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని తమ పరిసరాలను తీర్చిదిద్దుకునేందుకు ముందుకువచ్చి పాలుపంచుకోవటం సంతోషదాయకం. ఇది పల్లెల, పట్టణాల ప్రగతికి గుణాత్మకమైన మార్పుగా చూడాలి.

మీఊళ్లో మీరే కేసీఆర్‌..! ఇది కేటీఆర్‌ ఇటీవల తమ పార్టీ నాయకులకు బోధించిన తారక మంత్రం. తారకమంత్రం భవబంధాల నుం చి విముక్తి కలిగిస్తే, ఈ తారక మంత్రం భౌతికాభివృద్ధికి దారులు వేస్తుంది.ఇక్కడ మీరే కేసీఆర్‌ అనడంలో కేటీఆర్‌ ఉద్దేశం వేరు. ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్‌ ఒక వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఒక సామూహిక శక్తి. ఒక దీర్ఘదృష్టి. మూడుతరాల ముందు ఆలోచించే ఒక దూర దృష్టి. ఆరంభించిన ప్రతి పనినీ సుసాధ్యం చేసే, కలగన్న ప్రతి కలనీ సాకారం చేసే పట్టువదలని విక్రమార్కుడు.సామాన్య జనం దృష్టిలో కేసీఆర్‌ అంటే ఆప్యాయత లు నిండిన అధికారం. నిజానికి అధికారం అంటే అజమాయిషీ చెలాయిం చటం కాదు. ప్రతి వాగ్దానాన్నీ నెరవేర్చే బాధ్యత. ప్రతి కన్నీటి బొట్టును తుడి చే ప్రేమ. ద్వేషాన్ని కూడా అనురాగంగా మలుచుకోవలసిన ఒక అవసరం. మీ ఊళ్లో మీరే కేసీఆర్‌.. అంటే అధికారం చెలాయించమని అర్థం కాదు, కేసీఆర్‌లా పని రాక్షసులు కండని ఉద్బోధ.


వార్డు, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం అభివృద్ధి పరుగుపెట్టవలసిన ప్రగతి పథం. అభివృద్ధి ప్రణాళికలు సూక్ష్మస్థాయి నుంచి స్థూలస్థాయికి వెళ్లా లి. అభివృద్ధి ఫలం ప్రతి ఒక్కరికీ అందాలి అంటే.. అవి సూక్ష్మస్థాయిలో ఉం డాలి. అది సాధించడానికి కేసీఆర్‌ స్థాయి నాయకుడు కావాలి. కేటీఆర్‌  మాటల వెనుక ఉన్న లోతైన తాత్త్వికత ఇది.నేను నా ఇంటి పరిసరాలకు నాకు నేనుగా మాకు మేముగా శుభ్రం చేసుకుంటాం. మా బజార్లను శుభ్రపరుచుకుంటాం. రెండువైపులా ఫలాలనిచ్చే చక్కటి నీడనిచ్చే చెట్లను నాటుకుంటూ వాటిని జాగ్రత్తగా మా పిల్లలను పెం చుకున్నట్లు పెంచుకుంటాం. మేం నివసించే ప్రదేశం సుందరంగా, శుభ్రంగా, అందంగా, ఆహ్లాదాలను పంచేదిగా తీర్చిదిద్దుకొని పరవశం చెందుతామనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాకపోతే మన ఇంటి పరిసరాలను, మనఊరును, మన బజార్లను తీర్చిదిద్దుకునేందుకు స్వచ్ఛందంగా మనకు మనం తయారయ్యే అపురూప సందర్భాలను ఆవిష్కరిస్తున్నవే పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు. అందుకే పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ సీఎం కేసీఆర్‌ సందేశం ఇస్తూ మీ ఊరికి మీరే కథానాయకులన్నా రు. ప్రతిఒక్కరిలో ప్రేరణ కలిగిస్తూ మీ ఊరుకు మీ బజారుకు మీరే కేసీఆర్‌ అని పిలుపునిచ్చారు కేటీఆర్‌. పల్లెలు, పట్టణాలను ప్రగతిపథంలోకి నడిపి స్తూ తెలంగాణను పునర్నిర్మించుకునే పనిలో ఎవరికి వాళ్లుగా ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలి.


చాలాకాలంగా కొన్ని ప్రశ్నలు వేధిస్తూ ఉన్నాయి. దానికి పరిష్కారం మనదగ్గర మన చేతుల్లోనే ఉన్నా చేయలేకపోవటం విచారకరం. స్వర్గధామాలుగా ఇళ్లు కట్టుకున్నవాళ్ల ఇండ్లముందట చూస్తే ఆ ఇంట్లోని మురికి జలాలన్నీ రోడ్లమీదకు వస్తాయి. ఆ మురుగునీటిలో దోమలు కమ్మేసి ఉంటాయి. మురుగు నీటిని మళ్లించటానికి కాలువ తమ పనికాదనుకుంటారు. మున్సిపాలిటీ వాళ్ల పనో, లేదా గ్రామ పంచాయతీ వాళ్ల పనో అంటుంటారు. ఇలాంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకునేవారంతా ఎవరికి వారుగా స్వతంత్రంగా ముందుకువచ్చి తమ ఊళ్లను తాము తీర్చిదిద్దుకునే పని ఇప్పుడన్నా చేయాలి. ఇది తెలంగాణను పునర్నిర్మించుకునే సమయం ఇది. మన ఊరును, మన పట్టణాన్ని పునర్నిర్మించుకుంటూ మొత్తం తెలంగాణను తీర్చిదిద్దుకునే సందర్భం.  ఇందులో మనందరం భాగస్వాములు కావాలి. ఇది మనందరి భవిత కోసం అందరం కలిసి పల్లె, పట్టణ ప్రగతి వైపునకు నడవాలి.


ఇవి నినాదప్రాయాలు కావు. మన కళ్లముందు జరుగుతున్న ఆచరణ సాధ్యాలు. పండుటాకులుగా, రాలిపోయిన చెట్లుగా మిగిలిన పల్లెలు తిరిగి పచ్చగా పసిడిపచ్చగా మురిసిపోవాలి. ఊళ్లు చితికిపోయినాకనే కదా వలసలు పెరిగి యువతరమంతా గ్రామాన్ని వదిలింది. పల్లె తల్లి పొత్తిళ్లలో పెరిగిన బాల్యం ఎప్పటికీ మర్చిపోలేని గుర్తు. బాల్యాన్ని మరిచిపోయినవాళ్లకు జీవి తం గురించే తెలియదు. పారిశ్రామిక విప్లవాల తాకిడి అంతగాలేని పల్లెల పైకి సాంకేతిక డిజిటల్‌ విప్లవాలు వచ్చి మీదపడటంతో పల్లెలు అతలాకుత లమవుతున్న స్థితి. ఒక ఐడియా జీవితాలను ఎంతవరకు మార్చుతుందో తెలియదు కానీ, మార్కెట్‌ వ్యవస్థ దెబ్బకు గ్రామం తల్లడిల్లి సొమ్మసిల్లింది నిజం. ఇందులో కూడా తెలంగాణ పల్లెల పరిస్థితి ప్రత్యేకమైంది. కులీ కుతుబ్‌ షా కాలం నుంచి నిజాం పాలన పూర్తయ్యాక, హైదరాబాద్‌ రాష్ట్రం అవతరించా క, మళ్లీ అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌ అవతరణ, 2014 జూన్‌ 2న తెలంగాణ అవతరించేదాకా పల్లె పరిణామ క్రమాలను అవగతం చేసుకోవాలి.


తెలంగాణ గ్రామం ఉద్యమానికి ఊపిరిని చేసుకొని ఉద్యమతిత్తులను ఊదారు కేసీఆర్‌.  రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ గ్రామాలను, పట్టణాలను తిరిగి పునర్నిర్మించుకునే ప్రయత్నాలను కేసీఆర్‌ ముమ్మరంగా మొదలుపెట్టారు. ఇవి బాగుపడాలంటే మొదట ఊళ్లకు నీళ్లు కావాలి. కరువు నేల గొంతు తడువాలి. చెరువులు నిండా లి. అందుకు నదుల నీళ్లను మళ్లించాలని జల నిపుణుడిగా మారిన కేసీఆర్‌ నీళ్ల మళ్లింపునకు ప్రాధాన్యం ఇచ్చారు. కాళేశ్వరం పనులు పూర్తికావటమే కాకుండా నీటి ప్రవాహాల మళ్లింపులు జరుగుతున్నాయి. గ్రామం తిరిగి తన నుతాను నిర్మించుకునే స్థితి రావాలంటే తిరిగి సంపూర్ణంగా గ్రామ పునర్నిర్మాణం జరుగాలి. ఇప్పుడు ఆ పనిని కేసీఆర్‌ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇందులో ప్రతి పౌరుడు, ప్రతి పౌరురాలు పాల్గొనాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ‘పల్లె ప్రగతి’ పనులతో గ్రామం విలసిల్లాలి, కళకళలాడాలి. సకల సంపదలతో తులతూగాలి. ఈ పల్లె ప్రగతికి అన్నివర్గాల నుంచి మంచి స్పందన రావటమే గాక అందరూ ఈ పనిలో పాల్గొంటున్నారు.


తెలంగాణ పునర్నిర్మాణ ప్రణాళికల అమలు గ్రామాల మట్టిపాదాల నుంచి ప్రారంభిస్తున్నారు. గ్రామ ప్రణాళిక, పట్టణ ప్రణాళికల నుంచి మొదలైన అభివృద్ధి ప్రణాళికలే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికగా కేసీఆర్‌ రూపకల్పన చేశారు. అభివృద్ధి అట్టడుగు నుంచి మొదలుకావాలి. తెలంగాణ అభివృద్ధి గ్రామంనుంచి పట్టణానికి, పట్టణం నుంచి రాష్ట్రానికి వస్తున్నది. ఇదే విషయాన్ని పట్టణప్రగతి కార్యక్రమంలో కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలోని 12,751 గ్రామా లు, 141 పట్టణాల ప్రగతే తెలంగాణ సమగ్ర ప్రగతి అని వక్కాణించటం గమనార్హం. గ్రామ స్వరాజ్యాలు పల్లెప్రగతిలో పొదుగుతున్నాయి. పట్టణ ప్రగతితో తెలంగాణ పునర్నిర్మాణం పటిష్టమవుతున్నది. రాష్ట్ర సచివాలయం లో అన్నిశాఖల అభివృద్ధి రూపురేఖల నమూనాలను గ్రామ పట్టణ సచివాలయాల ద్వారా స్పష్టమైన ఆచరణ రూపం తీసుకొని ప్రతిబింబించాలన్నది కేసీఆర్‌ దార్శనికత. అధికార వికేంద్రీకరణ అన్నది జిల్లా, మండల స్థాయిల్లో గడ్డకట్టిపోకుండా దాన్ని గ్రామస్థాయికి, పట్టణ పాలనారంగం దశకు అధికారాన్ని వికేంద్రీకరించటం మొదలైంది. కేసీఆర్‌ ఆలోచనలతో విలేజ్‌ స్ట్రక్చర్‌ అన్నది స్టేట్‌ స్ట్రక్చర్‌గా మారుతున్నది.


సమాజ జీవనశైలి మారింది. వేగవంతంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా సామాజిక ఆలోచనల్లో మార్చు వచ్చింది. వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ పెరిగింది. యువత జీవనభృతి కోసం పట్టణాలకు వలసపోతున్నరు. గ్రామాల్లో ప్రజలు విత్తనాలు, ఎరువులు, పంటలు, బ్యాంకుల రుణాలు, ప్రభుత్వ పథకాలను పొందేందుకు సమాచారాన్ని పత్రికలు, టీవీల వంటి మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నరు. స్త్రీ పురుషుల మధ్య సంబంధాల్లో కూడా చాలా మార్పులు వస్తున్నై. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనేకానేక పరిణామాలు మన గ్రామాలు, పట్టణాలపైన పడుతున్నయి. 


కీలకంగా చూస్తే మన గ్రామాలు, పట్టణాలను మారుతున్న మార్పులకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవటం కోసం కేసీఆర్‌ దార్శనిక ఆలోచనలతో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలను చేపట్టడం ముదావహం. ఇప్పుడు పల్లెలు, పట్టణాలను తీర్చిదిద్దుకునే పనిలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని తమ పరిసరాలను తీర్చిదిద్దుకునేందుకు ముందుకువచ్చి పాలుపంచుకోవటం సంతో షదాయకం. ఇది పల్లెల, పట్టణాల ప్రగతికి గుణాత్మకమైన మార్పుగా చూడా లి. అన్ని మారినా మారంది మన ఊరు, మన పట్టణం. దాన్ని మార్చుకుం దాం, తీర్చిదిద్దుకుందామన్న దీక్ష సస్యశ్యామల తెలంగాణ నిర్మాణానికి భూమిక అవుతుంది. ఇది మన నేలను మనకు మనంగా తీర్చిదిద్దుకునే సామూహిక పని. ఈ సామూహిక పనిలో పాల్గొంటున్నారు మన ప్రజా కథానాయకులు. ఊరు, పట్టణ పునర్నిర్మాణ చరిత్రకారులు మీరే.మన ఊర్లను మనం తీర్చిదిద్దుకోవటమే అసలు స్వయంపరిపాలన. గ్రామ పట్టణ పునర్నిర్మాణాలే నూతన తెలంగాణ పునాదులన్నది కేసీఆర్‌ సం కల్పం. ఇప్పుడు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఆ దిశగా అడుగులు వేస్తున్న తీరు శుభపరిణామం.


logo