గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 29, 2020 , 23:02:38

వర్గీకరణ జరిగేదే

వర్గీకరణ జరిగేదే

తెలంగాణ ఉద్యమానికి మాదిగల చేయూతను, పాత్రనూ ప్రత్యక్షంగా తిలకించి ఉద్యమ సారథి కేసీఆర్‌, తాను అధికారంలోకి వచ్చినవెంటనే మొదటి శాసనసభా సమావేశాల్లోనే 2014 నవంబర్‌ 10న ఎస్సీ వర్గీకరణ కోసం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. నిజానికి వర్గీకరణ రాష్ట్ర పరిధిలో, కేసీఆర్‌ చేతుల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే జరిగి ఉండేది. తెలంగాణ మాదిగ జాతి భవిష్యత్‌ మరో తీరుగా ఉండేది. కానీ, వర్గీకరణ అంశం కేంద్ర పరిధిలోనిది. కేంద్ర పాలకుల రాజకీయ ప్రాధాన్యాలు, లెక్కలు వేరు. అందుకే కేంద్ర పాలకులైన కమలనాథులు కేసీఆర్‌ ఎంత ఒత్తిడి చేసినా వర్గీకరణ వైపు కన్నెత్తయినా చూడటం లేదు.

నాయకులు లేని ఉద్యమా న్నయినా ఊహించగలమేమోగానీ, త్యాగాల్లేని ఉద్యమాన్ని ఊహించడం సాధ్యం కాదు. నాయకులను నిలబెట్టేది, ప్రజలను ముందుకు నడిపించేదీ అమరులే! అందుకే అమరులు సదా స్మరనీయులు. అందుకే మాదిగ వీరుడు పొన్నాల నరేందర్‌ అమరుడైన మార్చి 1వ తేదీని ‘మాదిగ అమరుల సంస్మరణ దినం’గా జరుపుకుంటున్నాం. 1994 జూలై 7న ప్రకాశం జిల్లాలోని ఈదుమూడి గ్రామంలో పిడికెడుమంది యువకులతో ఊపిరిపోసుకున్న మాదిగ దండోరా ఉద్యమం ఉప్పెనై కదలబారింది. ప్రతి ఊరిని, పల్లెను, ప్రతి ఇంటిని, ప్రతి మనిషినీ కదిలించింది. ఎస్సీ రిజర్వేషన్ల లో ఏ,బీ,సీ,డీ, వర్గీకరణ సాధన లక్ష్యంతో మొదలైన ఉద్యమం అనతికాలంలోనే నలుదిక్కులనూ ఏకం చేసింది. తెలుగు సమాజంలో దండోరా ఉద్యమంతో ప్రభావితం కాని వ్యక్తి, పాలుపంచుకోని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు. కుల, మతాలకు అతీతంగా ప్రతి మనిషినీ తాకి, తట్టి, మేల్కొల్పి, మానవీయ సంబంధాలను బలోపేతం చేసి, సామాజిక న్యాయానికి సారథిగా నిలిచింది దం డోరా. సకల జనుల సామాజిక అంగీకారమే దండోరా ఉద్యమాన్ని ఇప్పటికీ సజీవంగా నిలిపింది, నిలుపుతు న్నది.


అనాదిగా ఈ సమాజానికి పునాది లాంటివాడు మాదిగ. అందుకే ఈ మొత్తం సమాజ భారాన్ని తన భుజాలపై మిగిలిన అందరికన్నా ఎక్కువగా మోశాడు. పునాది ఎప్పుడూ మట్టిలోనే ఉంటుంది. మట్టిని మనుషుల్లో అధికులు చులకనగా చూస్తారు. కాబట్టి మాదిగ జాతి కూడా చులకనకు గురైంది. చీదరింపునకు గురైం ది. భరింపలేని అవమానాలకు గురైంది, అణిచివేతకు బలైంది. కలిసి తినేందుకు లేదు, కలిసి తాగేందుకు లేదు, కలిసి నడిచేందుకు లేదు. కష్టాన్ని సుఖాన్నీ కలిసి పంచుకునేందుకు లేదు. భయంకరమైన ఒంటరితనం. సర్వత్రా వెలివేత. ఈ ఒంటరితనం కన్నా, వెలివేత కన్నా నరకమేముంటుంది? వాటిని అనుభవించిన వారికే అది తెలుస్తుంది. అందుకే, ‘సమస్య మన బతుకుల్లో ఉంటే- పరిష్కారం మన చేతుల్లోనే ఉందని’ గ్రహించిన యువతరం ఉద్యమానికి ఊపిరై నిలిచింది. ఉద్యమానికి తమ ఊపిర్లను ధారబోసింది. 


మాదిగ దండోరా ఉద్యమాన్ని మహోన్నత శిఖరాలపై నిలిపింది. ఈ క్రమంలో నే దండోరా ఉద్యమం 2000 సంవత్సరంలో వర్గీకరణ సాధించి తన కల నెరవేర్చుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నాలుగేండ్ల పాటు వర్గీకరణ అమలైంది. మాది గ, మాదిగ ఉపకులాలకు చెందిన లక్షలాది విద్యార్థులు, వేలాది ఉద్యోగులూ ఎంతో ప్రయోజనం పొందారు. అయితే సామాజిక న్యాయానికి అడ్డుపడే కొన్నిశక్తులు కోర్టుల ద్వారా వర్గీకరణను అడ్డుకున్నాయి. అప్పటినుం చి తిరిగి.. అనేకదారుల్లో, అనేకతీరుల్లో అనంతంగా ఇప్పటికీ సాగుతూనే ఉన్నది. సాటి సమాజం నుంచి సం పూర్ణ మద్దుతు స్వీకరించిన దండోరా ఉద్యమం, సకల సామాజిక ఉద్యమాలకూ అండగా నిలిచింది. ఆ ఉద్యమాల్లో అంతర్భాగమై తనవంతు బాధ్యతను నిర్వర్తించింది. అందులో తెలంగాణ ఉద్యమం అన్నింటిలోకీ ప్రధానమైనది. 


తెలంగాణ ఉద్యమంలో దండోరా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎందరో మాదిగ బిడ్డలు ఆ ఉద్యమంలో అరెస్టులయ్యారు. లాఠీదెబ్బలు తిని జైళ్లపాలయ్యారు. చివరికి ప్రాణత్యాగాలూ చేశారు. ఉద్యమ సమయంలో మాది గ బిడ్డలు ఎక్కడా వెనుకడుగేయలే దు. ముందుకే మా పయనమంటూ మొక్కవోని దీక్షతో తెలంగాణ  రాష్ట్ర సాధనలో మాదిగ ప్రజలు మరుపురాని పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమానికి మాదిగల చేయూతను, పాత్రనూ ప్రత్యక్షంగా తిలకించి ఉద్య మ సారథి కేసీఆర్‌, తాను అధికారంలోకి వచ్చినవెంటనే మొదటి శాసనసభా సమావేశాల్లోనే 2014 నవంబర్‌ 10న ఎస్సీ వర్గీకరణ కోసం ఏకగ్రీవ తీర్మానం చేసి కేం ద్రానికి పంపారు. 


నిజానికి వర్గీకరణ రాష్ట్ర పరిధిలో, కేసీఆర్‌ చేతుల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ మొద టి అసెంబ్లీ సమావేశాల్లోనే జరిగి ఉండేది. తెలంగాణ మాదిగ జాతి భవిష్యత్‌ మరో తీరుగా ఉండేది. కానీ, వర్గీకరణ అంశం కేంద్ర పరిధిలోనిది. కేంద్ర పాలకుల రాజకీయ ప్రాధాన్యాలు, లెక్కలు వేరు. అందుకే కేంద్ర పాలకులైన కమలనాథులు కేసీఆర్‌ ఎంత ఒత్తిడి చేసినా వర్గీకరణ వైపు కన్నెత్తయినా చూడటం లేదు. మరో మాట లో చెప్పుకోవాలంటే, కుల ఉద్యమాల విజయాలన్నీ పాలకుల నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి. పాలకు ల నిర్ణయాలను కుల ఉద్యమాలు ప్రభావితం చేస్తాయి. అయితే, పాలకులు వారి భావజాలపరంగానే కుల ఉద్యమాల లక్ష్యాలకు వ్యతిరేకులైనప్పుడు మనం ఎంత ఉధృ తంగా ఉద్యమం సాగించినా పాలకుల నిర్ణయాలను ప్రభావితం చేయలేం. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. 


నేటి కేంద్ర పాలకులు భావజాలపరంగానే మన లక్ష్యాని కి బద్ధ వ్యతిరేకులు. వారి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వర్గీకరణను ఆశించలేం. వర్గీకరణకు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. ఒక్క వర్గీకరణకు మాత్ర మే కాదు, పాలన వికేంద్రీకరణకు, ప్రాంతీయ ఆకాంక్షలకు, రాష్ర్టాల హక్కులు, అధికారాలను మన్నించేందు కూ వారు అంగీకరించరు. సరికదా, ఏ మాత్రం వీలు చిక్కినా పేదలు, దళితులు, మైనారిటీలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేందుకు వారు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఏఏ విషయంలో కేం ద్రంపై తీవ్రస్థాయిలో స్పందించాల్సి వచ్చింది. తానే సారథిగా నిలిచి ప్రాతీయ పార్టీలను, కలిసివచ్చే ఇతర జాతీయపార్టీలను కూడగట్టి బీజేపీపై రాజకీయ సమరానికి సిద్ధపడాల్సి వచ్చింది. వడ్డించేవాడు మన వాడు కానప్పుడు మన ముందు ఖాలీ కంచమే మిగులుతుంది. 


ఇప్పుడు అదే జరుగుతున్నది. ఈ దుస్థితి మారాలి. వడ్డిం చేవాడు మనవాడు కావాలి. ఇప్పుడు దేశంలో మనకు వడ్డించాలన్న వాత్సల్యం ఉన్నవాడు ఒకేఒక్క డు. అతడే కేసీఆర్‌. మాదిగల జీవిత కల అయిన వర్గీకరణ అనే భోజనాన్ని వడ్డించే అవకాశాన్ని, అధికారాన్ని కేంద్ర స్థాయిలో కేసీఆర్‌కు కట్టబెట్టేందుకు సిద్ధపడుదాం. మన అమరుల ఆశ, ఆకాంక్ష, అంతిమ లక్ష్యమైన వర్గీకరణ సాధనకు మార్గాన్ని సుగమం చేసుకుందాం. మన జాతి కలలను సాకారం చేసుకుందాం. మన బిడ్డల బం గారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం.

(వ్యాసకర్త: తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు)

(నేడు మాదిగ అమరుల సంస్మరణ దినం)


logo
>>>>>>