గురువారం 09 ఏప్రిల్ 2020
Editorial - Feb 28, 2020 , 22:30:59

రైతు బంధువుకు పట్టం

రైతు బంధువుకు పట్టం

కేసీఆర్‌ చేపట్టిన అబివృద్ధి, సంక్షేమ పథకాలను కేంద్రంతో పాటు, చాలా రాష్ర్టాలు ఆదర్శమైనవిగా గుర్తించినప్పటికీ వాటిని అమలుచేయలేకపోతున్నాయి. కేసీఆర్‌ అనుసరిస్తున్న విధానాలతో వ్యవసాయ సహకార సంఘాలు మరింతగా బలోపేతమయ్యాయి. నీటిపారుదల ప్రాజెక్టులు, నాణ్యమైన కరెంటు, రైతు సమన్వయ సమితులు ఇవన్నీ కూడా సమ్మిళిత అభివృద్ధికి ఉపయుక్తంగా మారాయి. తెలంగాణ సమాజంలో పేరుకుపో యిన అనేక సమస్యలు, రుగ్మతలను సామాజిక వైద్యుడిలా నిర్మూలించడానికి కేసీఆర్‌ చేసిన చేస్తున్న కృషి అద్వితీయం.

రాష్ట్రంలో సహకార సంఘాల ఎన్నికలు ముగిశాయి. రైతు సం క్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు ప్రభుత్వంగా మన్ననలు పొం దుతున్న టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను రైతాంగం గెలి పించింది. దీంతో మరోసారి తాము టీఆర్‌ఎస్‌ వైపు ఉన్నామని చాటిచె ప్పారు. రైతు సమస్యలను ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్‌, బీజేపీలకు గుణపాఠం చెపుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో టీఆర్‌ఎ స్‌ అభ్యర్థులకు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. పలుచోట్ల పోటీకి అభ్య ర్థు లే దొరుకని పరిస్థితుల్లో ప్రతిపక్షాల ఉనికే మసకబారే పరిస్థితులు ఏర్ప డ్డాయి. రాష్ట్రంలో ఉన్న 904 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా లకు గాను 136 సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. 


ప్రజలు తెలంగాణ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ఈ ఎన్నికల ద్వారా ప్రకటించారు. మొత్తంగా 904కు గాను 91 శాతం 824 టీఆర్‌ఎస్‌ గెలుచుకోవటం గమనార్హం. ప్రతిపక్ష కాంగ్రెస్‌ 6 శాతం (52), కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక శాతం (7) స్థానాలను మాత్రమే  గెలుచుకోగలిగాయి. టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరిగే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీ బీ), జిల్లా సహ కార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) డైరెక్టర్ల పదవు ల్లోనూ పోటీలేకుండా 180కి 146 గెలుచుకున్నది. ఇక ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ ఎన్నిక లాంఛనమే. వీటితోపాటు మార్చి 5న జరిగే తెలంగాణ రాష్ట్ర సహ కార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కబ్‌) ఛైర్మన్‌ను సైతం టీఆర్‌ఎస్‌ గెలుచుకోవడం తథ్యం.


టీఆర్‌ఎస్‌కు ఈ అద్భుత విజయం సునాయాసంగా దక్కలేదు. దీని వెనుక ప్రభుత్వ కఠిన శ్రమ, నిబద్ధత ఉన్నాయి. వ్యవసాయరంగం పట్ల, జలవనరులు, భూగర్భ జలవనరుల పట్ల, రైతులకు కావాల్సిన మౌలిక వసతుల పట్ల చూపిన శ్రద్ధ రైతాంగం ఇచ్చిన తీర్పులో కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్‌ ఎన్నికల్లో 4 సీట్లు గెలువగానే బీజే పీ, మూడు సీట్లు గెలువగానే కాంగ్రెస్‌ వాపును చూసి బలుపనుకు న్నా యి. ఈ క్రమంలో వారు చేసే తప్పుడు, మోసపూరిత ప్రచారాలను ప్రజ లు తిప్పికొట్టారు. దీనికి నిదర్శనంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా లోని 106లో 105 సహకార సంఘాల్లో అద్వితీయమైన విజయాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీకి కట్టబెట్టారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 113కు 105 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టారు. అదేవిధంగా ఆదిలాబాద్‌ జిల్లా లోని 55 స్థానాలకు గాను 52 గెలిపించారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా లో 96కు 83 స్థానాల్లో గెలిపించారు.


గ్రామ సీమలు సుభిక్షంగా,  స్వయం పోషకంగా ఉండాలంటే వ్యవసా య రంగం, పశుపోషణ, దానికి అనుబంధమైన వివిధ వృత్తులు సమాం తరంగా అభివృద్ధి చెందాలి. ఈ సత్యాన్ని ఆకళింపు చేసుకున్న సీఎం కేసీఆ ర్‌ తనదైన శైలిలో వినూత్న పథకాలకు రూపకల్పన చేశారు. దుక్కి దున్నిం ది మొదలు పంట అమ్మే దాకా రైతాంగానికి తామున్నామనే భరోసా ఇచ్చే లా ప్రభుత్వం వ్యవహరించింది. రైతులకు పెట్టుబడిగా, ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. దీంతో రైతులకు పెట్టు బడి బాధలు తప్పాయి. 


బ్యాంకుల ద్వారా వ్యవసాయానికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు. రైతులు తమ రుణాలు తిరిగి చెల్లించలేని స్థితిలో గరిష్ఠంగా లక్ష వరకు రుణమాఫీ చేశారు. సకాలంలో రైతులకు మార్క్‌ఫెడ్‌ ద్వారా 40 శాతం సబ్సిడీతో ఎరువులు అందేలా చర్యలు చేప ట్టారు. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తూ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్నారు. ఈ విధంగా కేసీఆర్‌ నాయకత్వంలో సాగునీటి కష్టాలు తీరాయి. మిషన్‌కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువుల పునరు ద్ధరణ జరిగింది. పూడికతీత కారణంగా చెరువులు నిండుకుండలను తల పిస్తున్నాయి. భూగర్భజలాలు సైతం పెరిగి బావులు, బోర్లలో నీరు పుష్క లంగా లభిస్తున్నది. దీంతో రైతన్న కష్టాలు సగం తీరాయి. తెలంగాణ వర ప్రదాయినిగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. వృథాగా సముద్రంలో కలిసే నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా రాష్ట్రం మొత్తం గోదావరి నీళ్లు అందిస్తున్నారు.


పంట పండటం ఒక ఎత్తయితే దానిని గిట్టుబాటు ధరకు అమ్ముకోవ టం మరో ఎత్తు. పండిన పంటకు మద్దతు ధర వచ్చినప్పుడే రైతు లాభపడేది. రాష్ట్రంలో ఆహారపంటలతో పాటు, వాణిజ్య పంటలైన పత్తి, పసుపు ఉత్పత్తి కూడా ఎక్కువ. వీటి ధరలను కేంద్రం నిర్ణయిస్తుంది. ఈ  విధంగా నిర్ణయిం చబడిన ధర అయినా రైతులకు లభిస్తున్నదా అంటే అదీ లేదు.  దళారుల దోపిడీకి రైతు బలవుతున్నాడు. మద్దతు ధర అనేది ఒక మిథ్యగా మారింది. గతంలో దళారులు రైతుల దగ్గరపంటలు కొని  వాటి ని అధిక ధరకు మార్కె ట్లో అమ్ముకునేవారు. అలా జరుగకుండా ప్రాథ మిక వ్యవసాయ సంఘాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేసి విత్తనం నాటిన నుంచి విక్రయం దాకా రైతాంగా నికి అండగా ఉండేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్చిదిద్దారు. ముఖ్యంగా రైతులకు పంటల్లో సహా యార్థం వ్యవసాయ విస్తరణాధికారులను నియమించారు. పంట మార్పిడి,  ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కలిగింది. తద్వారా వ్యవసాయం లాభసాటిగా మారుతున్నది. వ్యవసాయ అనుబంధ వృత్తుల ను కూడా ప్రోత్సహిసూ ్తపశువుల పంపిణీ, చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ వంటివి చేయడం, సబ్సిడీపై వారికి రుణాలివ్వడం వంటి చర్యలు ఫలితా న్నివ్వడం చూస్తున్నాం.


కేసీఆర్‌ చేపట్టిన అబివృద్ధి, సంక్షేమ  పథకాలను కేంద్రంతో పాటు, చాలా రాష్ర్టాలు ఆదర్శమైనవిగా గుర్తించినప్పటికీ వాటిని అమలుచేయలే కపోతున్నాయి. కేసీఆర్‌ అనుసరిస్తున్న విధానాలతో వ్యవసాయ సహకార సంఘాలు మరింతగా బలోపేతమయ్యాయి. నీటిపారుదల ప్రాజెక్టులు, నాణ్యమైన కరెంటు, రైతు సమన్వయ సమితులు ఇవన్నీ కూడా సమ్మిళిత అభివృద్ధికి ఉపయుక్తంగా మారాయి. తెలంగాణ సమాజంలో పేరుకుపో యిన అనేక సమస్యలు, రుగ్మతలను సామాజిక వైద్యుడిలా నిర్మూలించ డానికి కేసీఆర్‌ చేసిన చేస్తున్న కృషి అద్వితీయం. తెలంగాణ రాష్ర్టాభివృద్ధి  కోసం ఒక సోషల్‌ ఇంజినీర్‌గా కృషిచేస్తున్నారు. తెలంగాణలో ఎన్నిక ఏదై నా ప్రజలు కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అందుకే ఆయనను రైతుబంధువుగా, రైతుసారథిగా అక్కున చేర్చుకుంటున్నది మన తెలం గాణ సమాజం.

(వ్యాసకర్త: డీన్‌, ఫ్యాకల్టీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, కేయూ)


logo