గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 28, 2020 , 22:30:08

వదంతులను నమ్మవద్దు

వదంతులను నమ్మవద్దు

చికెన్‌ తింటే కరోనా వైరస్‌ సోకుతుందనే వదంతులతో చికెన్‌ అమ్మకా లు పడిపోయాయి. దీంతో పోల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితు లు ఏర్పడ్డాయి. ఇలాంటి వదంతులను నమ్మవద్దని ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్యశాఖ శాఖ ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాపించకుండా కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకున్నాయి. ప్రజలు ఎలాం టి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దు.

- పాశం రమేశ్‌, రంగారెడ్డి జిల్లా


నీటిని పొదుపు చేద్దాం

నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ గురించి ప్రభుత్వాలే కాదు ప్రజలుగా మన బాధ్యతను సరిగా నిర్వర్తించాలి. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకోవాలి. నీటి వృథాను అరికట్టాలి. పచ్చని చెట్లతోనే మనకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. వీటివల్ల మానవాళికి అనేక ప్రయోజనా లున్నాయి. ఇవి ఎవరో చెప్పాల్సిన పని లేదు. నీటి పొదుపు, చెట్ల పరిరక్షణ అనేది అందరి జీవితంలో భాగం కావాలి. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సఫలమౌతాయి.   

- పడాల సతీశ్‌, సిరిసిల్ల


ప్రతిపక్ష నేతల తీరు హాస్యాస్పదం

పంటలకు మద్దతు ధర విషయం కేంద్ర ప్రభు త్వ పరిధిలో ఉంటుంది. ఇది ప్రతిపక్ష నేతలకు తెలియంది కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయాలనే ఉద్దేశంతోనే కంది రైతుల గురించి ప్రతిపక్ష నేతలు మాట్లాడటం హాస్యాస్పదం. కేంద్ర ప్రభుత్వం కందులకు ప్రకటించి న మద్దతు ధరకు, వాస్తవంగా మార్కెట్లో అమ్ముడుపోతున్న ధరకు పొంతన కుదరడం లేదు. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి ఇప్పటికే వివరించారు. ప్రతిపక్షనేతలు సమస్య కు కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు. అలాగే కంది రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ప్రతిపక్ష నేతలు కూడా రాజకీయాలకు అతీతంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అప్పుడే కంది రైతులకు న్యాయం జరుగుతుందనడం లో సందేహం లేదు.

- మాటూరి శ్రీనివాస్‌, మహబూబ్‌నగర్‌


logo