సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Feb 28, 2020 , 00:02:58

మతం పేరిట వివక్ష తగదు

మతం పేరిట వివక్ష తగదు

2019 డిసెంబర్‌లో పార్లమెంటు ఉభయసభలు జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించాయి. ఈ చట్టం దేశ ప్రజల్లో చాలారకాల భయాలు, ఆందోళనకు కారణమైంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, జైనులు, క్రైస్తవులకు ఈ చట్టం ప్రకారం పౌరసత్వం లభిస్తుంది. ఇలా శరణార్థులుగా వచ్చిన ముస్లింల ప్రస్తావన లేకపోవడంతో ఈ పౌరసత్వ సవరణ చట్టం చాలా వివాదాస్పదంగా మారింది.

పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దుచేయాలని, పుట్టుకతో వచ్చే సహజ పౌరసత్వాల నిరూపణకు కఠిన ప్రక్రియ అవసరం లేదని దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలను శాంతియుత పద్ధతుల్లో వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేకచోట్ల ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి తమ నిరసనలు తెలిపారు. జేఎన్‌యూ,జామియా మిలియా, హెచ్‌సీయూ, మనూ వంటి విశ్వవిద్యాలయాల్లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టారు. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో మైనారిటీ మహిళల ఆధ్వర్యంలో రెండు నెలలకుపైగా నిరసన దీక్షా శిబిరం కొనసాగుతున్నది. దేశంలో కొన్నిచోట్ల నిరసనసభలు, సమావేశాలు, ఊరేగింపులపై దాడులు కూడా జరిగాయి.


విదేశీ చొరబాటుదారులను గుర్తించి, వారిని ఏరివేసేందుకు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చామని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంటున్నది. ఈ విధంగా దేశంలోని ప్రజలందరినీ కొత్తగా పౌరసత్వ నిరూపణ చేసుకోవాలనే ప్రమాదంలోకి నెట్టింది. పైగా పౌరసత్వ నిరూపణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం కఠినంగా మార్చింది. ఆధార్‌కార్డు, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, రేషన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంకు డాక్యుమెంట్లు, పట్టాదార్‌ పాస్‌బుక్‌, భూ యాజమాన్య పత్రాలు, పన్ను రశీదుల వంటి పదిహేను రకాల పత్రాలేవీ పౌరుల పౌరసత్వ నిరూపణకు ఆధారాలు కాబోవని వార్తలు వస్తున్నాయి.


ఆధార్‌కార్డులు పొందిన 127 మంది తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని హైదరాబాద్‌లోని ఆధార్‌ ప్రాధికార సంస్థ అధికారులు ఇటీవల నోటీసులు జారీచేశారు. కాగా పౌరసత్వ నిరూపణకు ఆధార్‌కార్డు కీలక డాక్యుమెంటు కాదని వినవస్తున్నది. ఈ సందర్భంలో ఆధార్‌ ప్రాధికార సంస్థ పౌరుల పౌరసత్వ నిరూపణపై విచారణకు నోటీసులు జారీచేసింది. ఆధార్‌ సంస్థ తనకు లేని అధికారాన్ని చెలాయించడమేనని తీవ్ర విమర్శలు వచ్చాయి.


2019 డిసెంబర్‌లో పార్లమెంటు ఉభయసభలు జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించాయి. ఈ చట్టం దేశ ప్రజల్లో చాలారకాల భయాలు, ఆందోళనకు కారణమైంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీ లు, జైనులు, క్రైస్తవులకు ఈ చట్టం ప్రకారం పౌరసత్వం లభిస్తుంది. ఇలా శరణార్థులుగా వచ్చిన ముస్లింల ప్రస్తావన లేకపోవడంతో ఈ పౌరసత్వ సవరణ చట్టం చాలా వివాదాస్పదంగా మారింది.


పౌరసత్వానికి, మతాన్ని కలిపి చూపడం వల్ల, పౌరసత్వాన్ని మతం ప్రాతిపదికన ఈ చట్టం నిర్ణయించినట్లయింది. దీంతో అనేకమంది విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదని విమర్శించారు. రాజకీయాలను-మతాన్ని వేరువేరుగా చూడాలి. ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలన్నీ మత ప్రసక్తి లేని లౌకికవాద పునాదులపై నిర్మితమైనవే. భారతదేశ రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఇందులో భాగమే. అధికరణం పద్నాలుగు-చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొంటున్నది.


 అధికరణం పదిహేను-కులం, మతం జెండర్‌, ప్రాంతం, భాష, జాతి మొదలగువాటి ప్రాతిపదికపై ఎవరి పట్లా వివక్ష చూపరాదని నిర్దేశిస్తున్నది. 1973లో కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో పౌరసత్వం వేరు, మతం వేరు. ఈ రెండు అంశాలను కలిపిచూడలేం. ప్రస్తుత సీఏఏ చట్టం శరణార్థులుగా వచ్చిన ముస్లింల ప్రస్తావన చేయలేదు. దీంతో పౌరులందరూ తాజాగా ఎవరి పౌరసత్వాన్ని వారే నిరూపించుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడినారు. అం దుకే దేశ ప్రజలందరిలో ముఖ్యంగా దేశంలోని ముస్లిం, దళిత, ఆదివా సీ, బీసీ ప్రజల్లో అభద్రత, ఆందోళనలు నెలకొన్నాయి.


జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో నలభై శాతం మం ది ఎస్సీలకు, నలభై శాతం మంది ముస్లింలకు, నలభై నాలుగు శాతం మంది ఆదివాసులకు పుట్టిన తేదీ పత్రాల్లేవు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ప్రతి పౌరుడూ/పౌరురాలూ ఇక్కడే పుట్టిపెరిగినట్టు వారసత్వవృక్షంతో సహా రుజువులు చూపించాలి. నిరక్షరాస్యత, పేదరికం కారణంగా దళితులు, మైనారిటీలు, ఆదివాసులు, బీసీలు తాజా పౌరసత్వ నిరూపణ ప్రక్రియతో చిక్కుల్లో పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నది.


చాలా సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి జీవోలు, నివేదికలు, నిర్ణయాలు పారదర్శకంగా ప్రజల ముందు ఉంచలేకపోతున్నాయి. రేషన్‌కార్డు, పింఛన్‌ కార్డు, ఉపకారం మొదలగు హక్కు పత్రాల్లో, ఓటర్‌ ఐడీ, ఆధార్‌ మొదలగు గుర్తింపుకార్డుల్లో సామాన్య ప్రజల పేర్ల నమోదులో ఎన్నో తప్పుల తడకలు మనం చూస్తున్నవే. చదువులేని, సాధారణ ప్రజలకు తమ గుర్తింపుకార్డుల్లో, హక్కు పత్రాల్లో అచ్చుతప్పులు పడిన తమ పేర్లను సవరించుకునే మార్గాలు, అవకాశాలు కూడా తెలియవు. అవకాశాల్లేని పరిస్థితుల్లో ఉంటారు. అచ్చుతప్పుల పర్యావసానంగా వారికి జరిగే నష్టాలకు, శిక్షలకు ఎవరిది బాధ్యత? ప్రజల కోసం ప్రభుత్వమా? ప్రభుత్వం కోసం ప్రజలా? ప్రజల కోసం చట్టాలా? చట్టా ల కోసం ప్రజలా?


పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, పుట్టుకతో వచ్చే సహజ పౌరసత్వాల నిరూపణకు కఠిన ప్రక్రియ అవసరం లేదని దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలను శాంతియుత పద్ధతుల్లో వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేకచోట్ల ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి తమ నిరసనలు తెలిపారు. జేఎన్‌యూ, జామియా మిలియా, హెచ్‌సీయూ, మనూ వంటి విశ్వవిద్యాలయాల్లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టారు. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో మైనారిటీ మహిళల ఆధ్వర్యంలో రెండు నెలలకు పైగా నిరసన దీక్షా శిబిరం కొనసాగుతున్న ది. దేశంలో కొన్నిచోట్ల నిరసనసభలు, సమావేశాలు, ఊరేగింపులపై దాడులు కూడా జరిగాయి.


పౌరసత్వ సవరణ చట్టం రద్దు కోసం జరిగిన ఉద్యమాలలో దేశంలో ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు. అండగా నిలిచారు. ఇప్పటికే కేర ళ, పంజాబ్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు పౌరసత్వ చట్టాన్ని తమ రాష్ర్టాల్లో అమలుచేయబోమన్నాయి. కేంద్రం ఈ చట్టాన్ని వెంటనే రద్దుచేయాలని తీర్మానాలు చేశాయి. పుదుచ్చేరి అసెంబ్లీ, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ చట్టాన్ని రద్దుచేయాలని తీర్మానించాయి. అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌ పురపాలిక కూడా తీర్మానం చేసింది. దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక స్వపరిపాలనాసంస్థలు కూడా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమ ని, ఈ చట్టాన్ని రద్దుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తూ ఒక్కొక్కటిగా నిరసన బాటలో ముందుకొస్తున్నాయి.


నల్లధనాన్ని వెలికితీస్తానన్న కేంద్ర ప్రభుత్వం వెలికి తీయలేకపోయిం ది. జాతీయ బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్న కంపెనీలు, వ్యక్తుల నుంచి తిరిగి వెనక్కి రాబట్టలేకపోయింది. దళితులు, దళిత క్రైస్తవులు, ముస్లిం మైనారిటీలు, మహిళలపై లైంగికదాడు లను నిలువరించలేకపోయింది. పెరుగుతున్న నిరుద్యోగం, ధరలను నియంత్రించలేకపోయింది. లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన కేం ద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ  శాఖను తెరిచింది. ప్రభుత్వ రంగ సంస్థలను, పరిశ్రమలను ఒక్కొక్కటిగా ప్రైవేట్‌పరం చేయడానికి పూనుకుంటున్నది. విదేశీ పెట్టుబడులను నేరుగా అనుమతించింది. ఈ విధంగా ఆర్థిక, పాలనాసంక్షోభంలో ఎన్డీయే ప్రభుత్వం చిక్కుకుపోయిం ది. 


ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దేశ సరిహద్దు సమస్యలను, మతపరమైన ఉద్రిక్తలను రెచ్చగొట్టే కార్యక్రమాలను ముందుకు తెచ్చిం ది. ఇప్పుడు జాతీయ పౌరపట్టిక  పేరుతో ప్రజలనెత్తిన జాతీయ పౌరస త్వ సవరణ చట్టం పిడుగును వేశారు. దేశప్రజల్లో పెల్లుబుకుతున్న అశాం తి, ఆందోళనలు, ఆగ్రహజ్వాలలు చల్లారంటే పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దుచేయాలి. లేదా నిబంధనలు సులభతరం చేయడం ఒక్కటే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందున్న మార్గం.

(వ్యాసకర్త: సామాజిక కార్యకర్త)


logo