బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Feb 28, 2020 , 00:03:08

జన సామాన్యంలోకి సైన్స్‌

జన సామాన్యంలోకి సైన్స్‌

శాస్త్రీయ పద్ధతుల్లో సైన్స్‌ బోధించబడి ప్రచారం జరిగితే ప్రయోజనం ఉంటుంది. సైన్స్‌ కేవలం పాఠశాలలకు, కళాశాలలకు పరిమితం కాకుండా జన సామాన్యంలోకి వెళ్లాల్సి ఉన్నది. నిజానికి సైన్స్‌ కాంగ్రెస్‌ వంటి సమ్మేళనాలు శాస్త్రవేత్తల కలయికకు వారు పరస్పరం స్ఫూర్తి పొందడానికి ఉపయోగపడుతాయి.

అది ఫిబ్రవరి 28వ తేదీ. 1928 సంవత్సరం. నలభై ఏళ్ల యువకుడి ఆవిష్కరణ ఒకటి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అది కీలకమైన ఆవిష్కరణ. కాబట్టి ఆ వైజ్ఞానిక ఫలితం వెలుగుచూసిన రెండేళ్లకే నోబెల్‌ బహుమతి వరించింది. బ్రిటిష్‌ దాస్యపాలనలో మగ్గే దేశం నుంచి అకౌంటెంట్‌ జనరల్‌ ఆఫీసులో పనిచేసే యవకుడు, తన ఆఫీసు పని తర్వాత, మహేంద్రలాల్‌ సర్కార్‌ ప్రారంభించిన ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ కల్టీవేషన్‌ ఆఫ్‌ సైన్స్‌ (IACS)లో పరిశోధన చేయడం ఏమిటి? కలకత్తాలో పనిచేసే ఈ తమిళ యువకుడు నోబెల్‌ బహుమతి పొందడం ఏమిటి? ఈ విషయాలు ఆలోచిస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉం టుంది. ఆ యువకుడు సి.వి. రామన్‌. ఆయనను కలువడానికి జవహర్‌లా ల్‌ నెహ్రూ వంటి వారు వేచి ఉండేవారు.


1925-35 మధ్యకాలం భారతదేశ సైన్స్‌ రంగానికి-మరీ ముఖ్యంగా భౌతికశాస్త్ర పరిశోధనలకు స్వర్గయుగం.ఈ దశలోనే సి.వి.రామన్‌, ఎస్‌.ఎన్‌.బోస్‌, మేఘనాథ్‌ సాహా, సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ వంటివారు గొప్ప ఫలితాలను ఆవిష్కరించారు. పిమ్మట మనకు ఎన్నో విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, జాతీయస్థాయి ప్రయోగశాలలు వచ్చాయి. అంతరిక్షం, అణుకేంద్రక విజ్ఞా నం వంటి రంగాల్లో ఎంతో పురోగతి సాధించాం. కానీ మన శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతులు రాలే దు. నోబెల్‌ బహుమతులు పొందిన మన శాస్త్రవేత్త లు మన పౌరులు కారు. ఈ ఆలోచన నాలుగు దశాబ్దాల నుంచి చర్చకు వస్తున్నది.


సి.వి.రామన్‌ శతజయంతి సంవత్సరానికి (1988) సమాయత్తమవుతున్నప్పుడు ‘రామన్‌ ఎఫెక్ట్‌' ఆవిష్కరించిన ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్‌ దినోత్సవంగా జరుపుకోవడం మొదలైంది. 1986 నుంచి ప్రారంభించినా 1988 నుంచి పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. సందర్భానికి తగిన ఇతివృత్తాన్ని తీసుకొని ఈ జాతీయ సైన్స్‌ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఆ రోజున ప్రయోగశాల లు చేతులు చాచి రమ్మంటాయి. తమ పరిశోధనలను పరిశీలించమంటా యి. సైన్స్‌ అనేది పిల్లలకు, పరీక్షలకూ సంబంధించిన విషయం మాత్రమే కాదు. సైన్స్‌, టెక్సాలజీతో మన పంటలు, ఆరోగ్యం, ఆటవిడుపు, ఆయుర్దాయం మెరుగయ్యాయి. అలాగే మూఢనమ్మకాలు తగ్గాలి. కాలుష్యం తగ్గాలి. కానీ ఇవి జరుగకపోవడం విషాదం.


మన విద్యాలయాల్లో సైన్స్‌ బోధన చాలా రకాలుగా మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది. మౌలిక సూత్రాలు పూర్తిగా అర్థం చేసుకోకుండా వాటి  అనువర్తనాలు అందుకోవడం సాధ్యం కాదు. అందుకనే కొన్ని దేశాలు రాణించినంతగా మనం రాణించలేకపోతున్నాం. అదేవిధంగా బట్టీ పట్ట డం ఆధారంగానే చదువులు సాగుతుండటం విషాదం. అలాకాకుండా ఆడుతూ పాడుతూ సైన్స్‌ను నేర్చుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. నిజానికి సైన్స్‌ సెంటర్లలో ఇటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే మన దేశ జనాభాకు తగినరీతిలో ఇవి అందుబాటులో లేకపోవ డం ఒక లోపంగా చెప్పుకోవచ్చు. మరోవైపు కేవలం ఉపాధి దృష్టితో కం ప్యూటర్‌ ఆధారిత ఉద్యోగాల వైపు మొగ్గి గట్టి పరిశోధనలు లేకపోవడం ఇంకా పెద్ద అనర్థదాయకం. ఈ పద్ధతులన్నీ పెద్ద ఎత్తున మారితేనే ఆ స్థాయిలో మన సైన్స్‌ విద్యా ప్రణాళిక, బోధనా పద్ధతులు, ప్రయోగశాలలు మారుతాయి. 


సైన్స్‌ సూత్రాలు, నియమాలు పూర్తిగా ఆకళింపు కావాలంటే అవి ఆవిష్కరించబడిన తీరు, ఆవిష్కరించిన వ్యక్తి జీవి త నేపథ్యం బోధపడాలి. ఓడమీద ప్రయాణం చేస్తూ ఆకాశంలోని నీలపు రంగును, సముద్రంలోని నీలపు రంగును విశ్లేషించినవారు సీవీ రామన్‌. సీవీ రామన్‌ పలు అంశాలను లోతుగా పరిశీలించేవారు, అధ్యయనం చేసేవారు. ఆయన వైజ్ఞానిక పరిశోధనలకు మాత్రమే పరిమితం కాలేదు. సంగీతంలో మంచి పరిచయం ఉంది. ఇంకా మంచి చిత్రకారుడు కూడా! కొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ప్రవేశం పొందడమే లక్ష్యంగా కష్టపడేవారు, మార్కుల కోసం బట్టీలు పట్టేవారు వ్యక్తిత్వ సమ గ్ర వికాసం ముఖ్యమని గ్రహించాలి. 


శాస్త్రీయ పద్ధతుల్లో సైన్స్‌ బోధించబడి ప్రచారం జరిగితే ప్రయోజనం ఉంటుంది. సైన్స్‌ కేవలం పాఠశాలలకు, కళాశాలలకు పరిమితం కాకుండా జన సామాన్యంలోకి వెళ్లాల్సి ఉన్నది. నిజానికి సైన్స్‌ కాంగ్రెస్‌ వంటి సమ్మేళనాలు శాస్త్రవేత్తల కలయికకు వారు పరస్పరం స్ఫూర్తి పొందడానికి ఉపయోగపడుతాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఏటా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ జరిగిన పద్ధతిలో సైన్స్‌ ఎగ్జిబిషన్‌ కూడా పెద్ద ఎత్తు న జరిగితే దానికి ప్రజలు విరివిగా వస్తే ఎంతో బాగుంటుంది. మనకున్న వనరులను మనం పరిశీలిం చుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలి. 


దేశంలో ఏ నగరంలో లేనివిధంగా హైదరాబాద్‌లో మంచి ప్రయోగశాలలు చాలా ఉన్నాయి. నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ లాబోరేటరీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ వంటి గొప్ప ప్రయోగశాలలు ఉన్న తార్నాక ఏరియాలోవిజ్ఞాన ఉత్సవం ఏటా జరిగితే ఎంతో బాగుంటుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సైన్స్‌ అకాడమీ, పౌరు లు, శాస్త్రవేత్తలు నడుం కట్టాలి. ఒకవారం పాటు శాస్త్ర, సాంకేతికరంగాల గురించి ముమ్మర ప్రచారం సాగించాలి. ఈ వారోత్సవం ఫిబ్రవరి 28న ముగిసేవిధంగా ఉండాలి.


2020 జాతీయ సైన్స్‌ దినోత్సవం ఇతివృత్తం ‘వైజ్ఞానిక రంగంలో మహిళలు’. అన్నిరంగాల మాదిరిగానే సైన్స్‌లో కూడా మహిళల పట్ల వివ క్ష ఉన్నది. పరిశోధనరంగంలో ఎక్కువ గంటలు తదేకదీక్షతో శ్రమించాల్సి ఉంటుంది. మహిళలకు పెళ్లి, పిల్లలు సంభవించే వయసులో పరిశోధన మందకొడి అయితే గొప్ప ఫలితాలు వచ్చే అవకాశం లేదు. ఇదే సమస్య. అయినా మనకు అన్నమణి, జానకీ అమ్మాళ్‌, అసిమా ఛటర్జీ, శకుంతలాదేవి వంటివారు ఆదర్శంగా నిలుస్తారు. గతంలోనే కాదు, ఇటీవల కాలం లో టెస్సీ థామస్‌ వంటి శాస్త్రవేత్తలు మనకు వెలుగు తారకల్లా కనబడుతారు. 


వైజ్ఞానిక రంగానికి సంబంధించి లోతుగా చర్చించే సందర్భం జాతీయ సైన్స్‌ దినోత్సవం. ఈ సందర్భంగా మన వైజ్ఞానిక రంగంలో పురోభివృద్ధి, సమాజంపై ఆ ప్రభావంపై చర్చించుకోవాలి. పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఈ సైన్స్‌ దినోత్సవం ఒక సందర్భం. 

(నేడు జాతీయ సైన్స్‌ దినోత్సవం)


logo