మంగళవారం 31 మార్చి 2020
Editorial - Feb 26, 2020 , 22:46:38

అల్లర్లను అదుపు చేయాలి

అల్లర్లను అదుపు చేయాలి

గత మూడు రోజులుగా సీఏఏ వ్యతిరేక, అనుకూల నినాదాలతో దేశ రాజధాని ఢిల్లీ నగరం అట్టుడికిపోతున్నది. అల్లరి మూకలు చేస్తున్న దాడుల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతూనే ఉన్నది. ఢిల్లీ బీజేపీ నేతలు చేసిన విద్వేష ప్రకటనలే అలర్లకు కారణమని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ఏదేమైనా ఇలా దేశ రాజధానిలో ఘర్షణలు జరుగ డం మంచిది కాదు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కలి సి ఈ అల్లర్లను అదుపు చేయాలి. 

- పంబ శివశంకర్‌, బల్మూర్‌ కొండారెడ్డిపల్లి, నాగర్‌కర్నూల్‌


ప్రజల భాగస్వామ్యం ఉండాలి

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు స్వచ్ఛంగా ఉండాలంటే ప్రభుత్వం చేప ట్టే కార్యక్రమాలే కాదు ప్రజల భాగస్వామ్యం కూడా కావాలి. ప్రభు త్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా చాలా గ్రామాల్లో మార్పు వచ్చింది. అట్లనే ప్రస్తుతం పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్నది. ప్రజలు తమ మున్సిపాలిటీలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. అప్పుడే పట్టణాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విజయవంతమవుతాయి.  

-  బేగరి ప్రవీణ్‌కుమార్‌, చేవెళ్ల, అంతారం, రంగారెడ్డి జిల్లా 


ఒత్తిడిని జయించాలి

పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. పరీక్షలకు విద్యార్థులు ఎలా సన్నద్ధమవ్వాలో మెళకువలు పాటిస్తూ జాగ్ర త్తలు తీసుకుంటున్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, ఆందోళన చెందకుండా పరీక్షల ను విజయవంతంగా ఎదుర్కొనేలా తల్లిదండ్రు లు, పాఠశాల ఉపాధ్యాయులు సలహా సూచ నలు ఇవ్వాలి. కొందరు విద్యార్థులు మామూ లు పరీక్షల్లో ఉత్తీర్ణత చెంది, తీరా వార్షిక పరీక్ష లు వచ్చేసరికి భయపడుతుంటారు. సరిగ్గా భోజనం చేయకుండా, నిద్రపోకుండా ఎప్పు డూ పరీక్షల గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి విద్యార్థులు ఫైనల్‌ పరీక్షల్లో తక్కువ మార్కులు పొందడమో, లేదా ఫెయిలవుతుం టారు. ఇలాంటి విద్యార్థుల పట్ల తల్లిదండ్రు లు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధకనబర్చాలి. ఒత్తిడిని జయించేలా మార్గనిర్దేశనం 

చేయాలి.       

- మొగుళ్ల సునీల్‌, బేగంపేట్‌, హైదరాబాద్‌


logo
>>>>>>