గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 25, 2020 , 22:52:53

పట్టణాభిషేకం

పట్టణాభిషేకం

రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన పట్టణాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందితేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయి. ఈ విషయానికి గల ప్రాధాన్యాన్ని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల విస్తృత భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. వాస్తవానికి, మన దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికీ ఇంత దూరదృష్టి లేదనే విషయాన్ని ఘంటాపథంగా చెప్పవచ్చు. ప్రతి పట్టణం ఎలా అభివృద్ధి చేయాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉన్నది.పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డును యూనిట్‌గా తీసుకొని ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించారు. వార్డులవారీగా చేయాల్సిన పనులతో పాటు మొత్తం పట్టణంలో చేయాల్సిన పనులను గుర్తించి వాటిని అభివృద్ధి చేస్తారు. ప్రతి పట్టణంలో కేవలం అక్షరాస్యులనే కాకుండా నిరక్షారాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తారు.

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలవాలి. పల్లెలు, పట్టణ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడాలి. ప్రజలు ప్రశాంతంగా, ఆనందంగా జీవనాన్ని కొనసాగించాలి. భవిష్యత్తులో తెలంగాణ పట్టణాలన్నీ వెలుగుజిలుగులతో నిండిపోవాలి. ఇలాంటి ఉన్నతలక్ష్యాలను చేరుకోవడానికి కేవలం ఆలోచనలుంటే సరిపోదు. అందుకు తగిన కార్యచరణను సిద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో పట్టణ తెలంగాణను అద్భుతంగా ఆవిష్కరించాలన్న ఉన్నతమైన లక్ష్యా న్ని నిర్దేశించుకున్న ముఖ్యమంత్రి  కేసీఆర్‌ పట్టణప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అభివృద్ధికి నోచుకోక మురికి కూపాలుగా మారిన పట్టణాలకు శస్త్రచికిత్స చేయడానికి సం కల్పించారు. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో పల్లెలను మెరుగుపర్చినట్లే, పట్టణాలను సమీకృతంగా అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారు. ప్రస్తుతం పట్టణాల్లో నెలకొన్న వాస్తవిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, దేశంలోనే ఆధునిక పట్టణాలున్న ప్రాంతంగా తెలంగాణను ఆవిష్కరించాలన్న బృహత్‌ లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నారు.


పట్టణ ప్రజల జీవితాలు కాంతులీనాలంటే ఏం చేయాలి? ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే పట్టణ ప్రజలు ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తా రు? ఇప్పటివరకూ ఏయే అంశాలు వీరికి అందుబాటులో లేకుండాపోయాయి? స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి పట్టణాల్లో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులేమిటి? వాటిని ఎలా పరిష్కరించాలి? అనే అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేశాకే.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో తెలంగాణ పట్టణాలకు పలు విశిష్ఠమైన లక్షణాలుండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించినట్లు అర్థమవుతున్నది. ప్రతి పట్టణంలో పచ్చటి చెట్లు, పరిసరాలతో ఆహ్లాదకర వాతావరణం, తాగడానికి స్వచ్ఛమైన నీరు, మెరిసే రహదారులు, పటిష్ఠమైన డ్రైనేజీ వ్యవస్థ, నాణ్యమైన విద్యుత్తు సరఫరా విధానం, ప్రణాళికాబద్ధమైన పార్కింగ్‌ సదుపాయం.


ఇలాంటివన్నీ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. ఈ క్రమం లో పట్టణాలు ప్రగతిపథం వైపు అడుగులు వేసేందుకు అవసరమయ్యే ప్రతి పనికి ఇందులో ప్రాధాన్యం ఇస్తారు. ఉదాహరణకు, ప్రస్తుతం మన పట్టణాలను గమనిస్తే.. వేలాడే విద్యుత్తు వైర్లు కనిపిస్తుంటాయి. వీటివల్ల ప్రజ లు దుర్మరణం చెందుతున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వీటికి పట్టణ ప్రగ తి కార్యక్రమం ద్వారా అడ్డుకట్ట వేసేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటారు. వంగిన స్తంభాలు, తుప్పుపట్టిన స్తంభాలు, రోడ్డు మధ్యలోని స్తంభా లు వంటివి మచ్చుకైనా కనిపించకుండా చేస్తారు. ఫుట్‌పాత్‌లపైన ప్రమాదకరంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్లను మార్చివేస్తారు. మొత్తానికి, ప్రమాదరహిత విద్యుత్తు వ్యవస్థ అతిత్వరలో మన పట్టణాల్లో దర్శనమివ్వడం ఖాయమనిస్తున్నది. పట్టణాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఆధునిక పద్ధతులను అవలంబించబోతు న్నారు.


రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన పట్టణాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందితేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ విషయానికి గల ప్రాధాన్యాన్ని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి  పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల విస్తృ త భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. వాస్తవానికి, మన దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత దూరదృష్టి లేదనే విషయాన్ని ఘంటాపథంగా చెప్పవచ్చు. తెలంగాణలో భవిష్యత్‌ తరా లు  స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి  అవరోధాల్లేకుండా నివసించాలనీ, వారి జీవితాలు బంగారుమయం కావాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం. ఇందుకోసం పలు ముఖ్యమైన అంశాలపై దృష్టిసారించాలని దిశానిర్దేశం చేశారు. ఈ బృహ త్‌ కార్యక్రమంలో మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లంతా క్షేత్రస్థాయిలో అడుగుపెట్టి ప్రజలందరినీ భాగస్వాములను చేస్తున్నారు. ఈ క్రమంలో అధి కారులు, ప్రజాప్రతినిధులు గజ్వేల్‌ పట్టణంలో పర్యటించి, అక్కడ జరిగిన క్రమబద్ధమైన అభివృద్ధిని కళ్లారా చూసి ఆశ్చర్యపోయారు.

ప్రతి పట్టణం ఎలా అభివృద్ధి చేయాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉన్నది. 


పట్టణప్రగతి కార్యక్రమంలో భాగం గా ప్రతి వార్డును యూనిట్‌గా తీసుకొని ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించారు. వార్డులవారీగా చేయాల్సిన పనులతో పాటు మొత్తం పట్టణంలో చేయాల్సిన  పనులను గుర్తించి వాటిని అభివృద్ధి చేస్తారు. ప్రతి పట్టణంలో కేవలం అక్షరాస్యులనే కాకుండా నిరక్షారాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో వార్డులవారీగా నాలుగు చొప్పున ప్రజాసంఘాలను ఏర్పాటుచేస్తారు. ఇవన్నీ ఏర్పాటు చేయడంతోనే ఆగిపోకుండా అందులో అభివృద్ధి జరుగాలంటే నిధులు అవసరమని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీహెచ్‌ఎంసీకి నెలకు రూ.78 కోట్లు, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రూ.79 కోట్ల చొప్పున నిధులను విడుదల చేయడానికి ఆదేశించారు. 


ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన నిధులను ఆయా పట్టణాలకు అందజేయాలని ఆదేశించడం గమనా ర్హం. అంటే, రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు నెలకు రూ.148 కోట్ల చొప్పున నిధులు సమకూరుతాయన్నమాట. ఫలితంగా, పట్టణ ప్రగతి లో భాగంగా చేపట్టే పనులకు నిధుల కొరత ఉండనే ఉండదు. ఇదొక్క టే కాకుండా, పధ్నాలుగో ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన రూ.811 కోట్ల రూపాయల్లో 500 కోట్లను కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీకి 311కోట్లను కేటాయిస్తారు. వీటితో పట్టణాల్లో పచ్చదనం, పారిశుద్ధ్య పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. పట్టణప్రగతిలో భాగంగా ఇంకా ఏమేం చేస్తారంటే.. డ్రైనేజీలు శుభ్రం చేస్తారు. మురికిగుంతలను పూడ్చేస్తారు. విరివిగా మొక్కలను నాటడానికి హరిత ప్రణాళికను రూపొందిస్తారు. వార్డుల్లో నర్సరీలను ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాలను ఎంపిక చేస్తారు. ఒకవేళ నగరాలు, పట్టణాల్లో భూములు అందుబాటులో లేకపోతే సమీప గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటుచేస్తారు. అక్కడా స్థలం లేకపోతే, చేరువలో ఉన్న గ్రామాల్లోనైనా ఏర్పాటుచేస్తారు.


కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనుల కోసం సుమారు 3,100 వాహనాలను సమకూర్చాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న  ది. వీటిలో  ఇప్పటికే ఆరు వందల వాహనాలు పట్టణాల్లో రాగా,  మిగతా 2500 వాహనాలను అతిత్వరలో పట్టణాలకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి కాకుండా, పట్టణాలకు ఎన్ని వాహనాలు అవసరమో గుర్తించి, వాటిని అంచనా వేసి సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మిషన్‌ భగీరథను చేపట్టింది.అధిక శాతం పట్టణాలకు స్వచ్ఛమైన తాగునీరు లభిస్తున్నది. ఇంకా, పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అందాల్సి ఉండగా   అక్కడి మంచినీటి సరఫరా వ్యవస్థను మరింత పటిష్ఠపరుస్తారు.


పట్టణాల్లో ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల పరిస్థితిని మెరుగుపరుస్తారు. గుంతలను పూర్తిగా పూడ్చేస్తారు. పట్టణాల్లో దహన వాటికలు, ఖనన వాటికల ఏర్పాటుకు అవసరమయ్యే ఖాళీ స్థలాల్ని పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తిస్తారు. పొదలు, మురికి తుమ్మలుంటే శుభ్రపరు స్తారు. పట్టణ ప్రజలకు ఉపయోకరంగా ఉండేలా వెజ్‌/నాన్‌వెజ్‌ మార్కెట్లను నిర్మిస్తారు. క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటుచేస్తారు. డంప్‌యార్డుల కోసం స్థలాలను గుర్తించడంతో పాటు పబ్లిక్‌ టాయిలెట్లు, మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్లను నిర్మిస్తారు. ఇందుకోసం తగిన స్థలాలను గుర్తిస్తారు. 


అవసరమైతే ప్రభుత్వ స్థలాల్లోనే నిర్మిస్తారు. పట్టణాల్లో సర్వసాధారణమైన వీధి వ్యాపారులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలను తీసుకుంటారు. వీరికి ప్రత్యామ్నాయ స్థలం చూపించేవరకూ ఇబ్బంది పెట్టకూడదనే నిర్ణయం తీసుకోవటం గమనించదగినది. వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలపకుండా, ఒక క్రమపద్ధతిలో  నిలిపి ఉంచటం కోసం  ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాలను గుర్తిస్తారు. అవసరమైతే ఖాళీగా ఉన్న  ప్రభుత్వ స్థలాలను పార్కింగ్‌ కోసం కేటాయిస్తారు. ఈ విధంగా పట్టణాల్లో అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన పరిసరాలు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది. ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వా ములు కావాలి. 


 కింగ్‌ జాన్సన్‌ కొయ్యడ


logo
>>>>>>