సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Feb 25, 2020 , 22:36:39

మైత్రి బంధం బలపడాలె

మైత్రి బంధం బలపడాలె

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన ఘనంగా ముగి సింది. మొదటిరోజు పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌ విమానాశ్ర యం నుంచి మోతెరా స్టేడియం వరకు 22 కిలోమీటర్ల దూరం రోడ్‌ షోలో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. భారత సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలతో స్వాగతం పలుక టం ప్రత్యేకతను సంతరించుకున్నది. ఆ తర్వాత మోతెరా స్టేడియంలో ట్రంప్‌, మోదీ ఇద్దరూ ఇరుదేశాల మైత్రిబంధం ప్రాధాన్యాన్ని నొక్కిచె ప్పారు. ప్రపంచ ఆర్థికగమనానికి, శాంతికి ఇరుదేశాల స్నేహసంబంధం ఎంతో మేలు చేస్తుందని ఇరువురూ పేర్కొన్నారు. ఆర్థికవ్యవస్థ, శాస్త్ర సాంకేతికరంగాల్లో అమెరికా అగ్రరాజ్యంగా ఎదురులేని శక్తిగా ఉన్నది. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా శాంతియు త జీవనానికి, సహజీవనానికి ప్రతీకగా భారత్‌ ఉన్నది. ఈ రెండుదేశా లు అర్థవంతమైన స్నేహసంబంధాలతో ప్రపంచానికి శాంతిమార్గం చూపాలి. వాణిజ్య సంబంధాల్లో ఆధిపత్యాలకు చోటులేకుండా పరస్ప ర గౌరవపూర్వక, ప్రయోజనకర ఒప్పందాలతో ఇరు దేశాలూ ముం దుకుపోవాలి. అప్పుడే అమెరికా, భారత్‌ మైత్రి ప్రపంచ గమనానికే మార్గదర్శకంగా ఉంటుంది. ఆ దిశగా ఇరుదేశాల దేశాధినేతలు విధాన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం. 

 ఏడు కొండలు, నల్లగొండ టౌన్‌


అవగాహన కల్పించాలె

ఒకవైపు కరోనా వైరస్‌ భయం ఉండగానే, స్వైన్‌ఫ్లూ ఈ మధ్యకాలంలో విజృంభిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇటీవలనే ఓ మహిళ ఓ బిడ్డ కు జన్మనిచ్చి ఆమె స్వైన్‌ఫ్లూ కారణంగా చని పోవటం పట్ల సర్వత్రా భయందోళనలు వ్యక్త మవుతున్నాయి. గత రెండు మూడు నెలలు గా తెలంగాణ వ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ జ్వరాలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. వాటి నివారణ కోసం వేలకు వేలు వెచ్చించాల్సి వస్తున్నది. స్వైన్‌ఫ్లూ బాధితులను గుర్తిస్తే, అలాంటివారికి ప్రభుత్వ దవాఖానాల్లోనే వైద్యం అందించి రక్షించేందుకు ప్రత్యేక చర్య లు తీసుకోవాలి. జలుబు, జ్వరం వచ్చినా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అలాగే స్వైన్‌ఫ్లూ రోగ లక్షణాలు, దాని నివా రణ వైద్యం గురించి ప్రజల్లో చైతన్యం కలి గించాలి. ప్రభుత్వ దవాఖా నల్లో మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి.  

రాయపురం మనీష, బోయినపల్లి


logo