శనివారం 28 మార్చి 2020
Editorial - Feb 25, 2020 , T00:15

కాళేశ్వరం తొలి ఫలితం

కాళేశ్వరం తొలి ఫలితం

కాళేశ్వరం రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో తొలి ఫలితం ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణకే అన్న విషయం పైన ఇచ్చిన వివరణ ద్వారా తెలుస్తున్నది. పైన పేర్కొన్న అన్ని జిల్లాలకు ఒకేసారి నీరు సరఫరా అవుతుంది కను క కాళేశ్వరం తొలి ఫలితం ఆయా జిల్లాలకు దక్కుతుందన్న మంత్రి హరీశ్‌ రావు ప్రకటన ఇవ్వాళ అక్షరాల నిజమైంది. ఈ విషయాన్ని మం త్రి అత్యంత స్పష్టతతో, సోయితో ఆయా జిల్లాలకు వెళ్లినప్పుడు ప్రకటించారు. కోడుగుడ్డు మీద ఈకలు పీకే మేధావులు మాత్రం అందులో తప్పును వెతికి విమర్శించే సాహాసం చేశారు.

ఏడాదిన్నర కింద బహుశా 2018 జూలైలో అనుకుంటా... అప్పటి సాగునీటి శాఖా మంత్రి హరీశ్‌రావు సూర్యాపేట పర్యటనకు వెళ్లినప్పుడు కాళేశ్వరం తొలిఫలితం సూర్యాపేటకే అని ప్రకటించారు. ఈ విధమైన ప్రకటనలు ఒక్క సూర్యాపేటలోనే కాదు కాకతీయ కాలువ పరిధిలో ఉన్న జిల్లాల్లో మూడు నాలుగు చోట్ల ఈ మాట న్నారు. ఈ ప్రకటనలపై నాడు ప్రాజెక్టు వ్యతిరేకులు కొంతమంది సోషల్‌ మీడియాలో మంత్రి హరీశ్‌రావు వీడియోలు, పత్రికల్లో వచ్చిన వార్తల కటింగ్స్‌ పెట్టి.. సూర్యాపేటకు వెళ్లి కాళేశ్వరం తొలి ఫలితం సూర్యాపేట కే, వరంగల్‌ వెళ్లి కాళేశ్వరం తొలి ఫలితం వరంగల్‌కే, కరీంనగర్‌ వెళ్లి కాళేశ్వరం తొలి ఫలితం కరీంనగర్‌కే అని అంటున్నాడు. అసలు కాళేశ్వ రం తొలి ఫలితం ఎవరిది? హరీశ్‌రావు ఎవరిని మోసం చేస్తున్నాడు? అని ప్రశ్నించినవారి సందేహాలకు నాడు సోషల్‌మీడియాలోనే  వివరణ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు కాళేశ్వరం నీరు కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్‌, వరంగల్‌, సూర్యాపేట జిల్లాల్లో నిండుగా, బిందాస్‌గా ప్రవహిస్తుంటే కాళేశ్వరం విమర్శకుల కండ్లు ఇప్పటికైనా తెరుచుకున్నాయా? అని ప్రశ్నించాలనిపిస్తున్నది.నాడు మంత్రి పూర్తి అవగాహనతో, పూర్తి సోయితోనే ఆయా జిల్లాల్లో ఆ ప్రసంగాలు చేశారు. ఆ పోస్టులు పెట్టినవారికి, వాటిని షేర్‌చేసి ప్రచా రం చేసినవారికి, వాటికి లైకులు ఇచ్చినవారికి మాత్రం అవగాహన లేద ని రుజువైంది. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిలో బీజేపీ కూడా ఉండటం విశేషం. మంత్రి ప్రసంగించిన ఆ జిల్లాలన్నీ కూడా శ్రీరాంసాగర్‌ ఆయ కట్టు పరిధిలో ఉన్న జిల్లాలు. పెద్దపల్లి, కరీంనగర్‌, వరంగల్‌ శ్రీరాంసాగర్‌ మొదటి దశ, సూర్యాపేట జిల్లా రెండవ దశ ఆయకట్టు పరిధిలో ఉన్నవి. కాళేశ్వరం ప్రాజెక్టులో 18.25 లక్షల కొత్త ఆయకట్టుతో పాటు, శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, సింగూర్‌, వరద కాలువ ప్రాజెక్టుల కింద ఉన్న 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా ఉన్నదన్న సం గతి సోషల్‌ మీడియాలో ఆ పోస్టులు పెట్టినవారికి ఎరుక ఉన్నదో లేదో తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని తరలించే ఎత్తిపోతల ప్రక్రియ ను గతంలో వివరంగా చర్చించాను. మరొక్కసారి సంక్షిప్తంగా.. మూడు మార్గాల ద్వారా తరలించడం జరుగుతుంది. శ్రీరాంసాగర్‌కు ప్రతీ మూడేండ్లకో సారి అన్నా వరద వస్తుందని 40 ఏండ్ల వరద చరిత్ర తెలుపుతున్నది. ఎస్సారెస్పీ నిండితే వరద కాలువ ద్వారా మిడ్‌ మానేరుకు, కాకతీయ కాలువ ద్వారా దిగువ మానేరుకు, నదీమార్గం ద్వారా ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారానే నీరు చేరుతుంది. 25 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి మిడ్‌మానేరు జలాశయం గతేడాదే సిద్ధమైంది. 20 టీఎం సీల ఎల్లంపల్లి, 24 టీఎంసీల దిగువ మానేరు జలాశయాలు ఇదివరకే పూర్తయి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మిడ్‌మానేరు జలాశయంలో 24 టీఎంసీల నీరు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా నింపడం జరిగింది. అక్కడి నుంచి మానేరు నది ద్వారా దిగువమానేరు జలాశయానికి, అక్కడి నుం చి కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్‌, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాలో ఉన్న మొదటి దశ ఆయకట్టుకు, జనగామ, ఖమ్మం, సూర్యాపే ట జిల్లాల్లో ఉన్న రెండో దశ ఆయకట్టుకు, చెరువులను నింపడానికి నీటి ని తరలించడం జరుగుతున్నది.


శ్రీరాంసాగర్‌కు వరద వచ్చినప్పుడు కాళేశ్వరం లింక్‌ 1, 2లో ఉన్న పంపులను తిప్పవలసిన అవసరం ఉండదు. ఎస్సారెస్పీకి వరద రాని సందర్భంలో, ఒకవేళ ఎల్లంపల్లికి నీరు వస్తే అప్పుడు లింక్‌ 1 (మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి) పంపులు తిప్పే అవసరం రాదు. లింక్‌ 2లో(ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు) ఉన్న రెండు భూగర్భ పంపుల ద్వారా మిడ్‌మానేరుకు నీరు చేరుతుంది. మిడ్‌మానేరు నుంచి పైన చెప్పినట్టు ఎస్సారెస్పీ మొదటి దశ, రెండో దశ ఆయకట్టుకు నీరు సరఫరా అవుతుంది. అదే సమయంలో ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా వరద కాలువ రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఒక టీఎంసీ నీరు ఎస్సారెస్పీ జలాశయానికి చేరుతుంది. ఎస్సారెస్పీలో ఏర్పడిన కొరత ఈ రివర్స్‌ పంపింగ్‌ ద్వారా తీరుతుంది. ఎస్సారెస్పీ జలాశయంపై నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఆధారపడిన కాకతీయ కాలువ ఆయకట్టు (దిగువ మానేరు వరకు), నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న లక్ష్మి కాలువ కింద ఉన్నఆయకట్టు, నిర్మల్‌ జిల్లాలో ఉన్న సరస్వతి కాలువ ఆయకట్టు, అలిసాగ ర్‌, గుత్ప ఎత్తిపోతల పథకాల కింద నిజాంసాగర్‌ ఆయకట్టు, అటు నిర్మ ల్‌ జిల్లాలో ఉన్న కాళేశ్వరం ఆయకట్టుకు, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉన్న చిన్న ఎత్తిపోతల పథకాల ఆయకట్టు, మిషన్‌ భగీరథ అవసరాలు ఈ రివర్స్‌ పంపింగ్‌ పథకం ద్వారా తీరుతాయి. రివర్స్‌ పంపింగ్‌ పథకం పనులు కూడా వేగంగా పూర్తి వినియోగంలోకి వచ్చాయి.


ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి జలాశయాల్లో నీరు లేనప్పుడు, వరద లేనప్పు డు మాత్రమే కాళేశ్వరం లింక్‌ 1, 2 ఉన్న మొత్తం 5 పంప్‌హౌజుల్లో ఉన్న పంపులను తిప్పడం జరుగుతుంది. అంటే లింక్‌ 1లో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి, లింక్‌ 2లో ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు నీరు చేరుతుంది. అక్కడినుంచి పైన చెప్పినట్టు దిగువమానేరు, కాకతీయ కాలువ ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరు చేరుతుంది. గతంలో ఎస్సారెస్పీ జలాశయంపై 13 లక్షల ఎకరాల మొదటి రెండో దశ ఆయకట్టు ఆధారపడేది. రెండోదశ ఆయకట్టుకు కాలువలు తవ్వి 15 ఏండ్లు అయినా నీరు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎస్సారెస్పీ జలాశయంపై దిగువమానేరు వరకు ఉన్న ఆయకట్టు మాత్రమే ఆధాపడుతుంది. దిగువమానేరు కింద ఆయకట్టుకు కాళేశ్వరం నీరు మిడ్‌ మానేరు, దిగువమానేరు ద్వారా అందుతుంది. ఇప్పుడు కాళేశ్వరం వచ్చినందున మొదటిదశకు, రెండోదశకు నికరంగా నీరందే పరిస్థితి ఏర్పడిం ది, ఎస్సారెస్పీ కాలువల ఆధునీకరణ కోసం ప్రభుత్వం 2000 కోట్లు మంజూరు చేసి పనులని పూర్తిచేసింది. కాళేశ్వరం నీరు వచ్చేనాటికి ఈ కాలువల పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం ఇంజినీర్లను ఆదేశించి పనులు పూర్తిచేయించింది. దిగువ మానేరు కింద కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, జనగామ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఆయకట్టుకు నీరందుతున్నది. కాళేశ్వరం రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో తొలి ఫలితం ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణకే అన్న విషయం పైన ఇచ్చిన వివరణ ద్వారా తెలుస్తున్న ది. పైన పేర్కొన్న అన్ని జిల్లాలకు ఒకేసారి నీరు సరఫరా అవుతుంది కను క కాళేశ్వరం తొలి ఫలితం ఆయా జిల్లాలకు దక్కుతుందన్న మంత్రి హరీశ్‌ రావు ప్రకటన ఇవ్వాళ అక్షరాల నిజమైంది. ఈ విషయాన్ని మం త్రి అత్యంత స్పష్టతతో, సోయితో ఆయా జిల్లాలకు వెళ్లినప్పుడు ప్రకటించారు. కోడుగుడ్డు మీద ఈకలు పీకే మేధావులు మాత్రం అందులో తప్పును వెతికి విమర్శించే సాహసం చేశారు. ఇప్పుడు ఎస్సారెస్పీ జలాశయం నుంచి దిగువ మానేరు దాకా కాకతీయ కాలువ కింద ఐదు లక్షల అరువై వేల ఎకరాల ఆయకట్టుకు యాసంగి పంటకు నీరు ఇస్తున్నారు. దిగువ మానేరు కింద ఉన్న శ్రీరాంసాగర్‌ మొదటి దశ ఆయకట్టు 4 లక్షల ఎకరాలకు, రెండో దశ ఆయకట్టు 4 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీరు యాసంగి పంటకు సరఫరా అవుతున్నది. శ్రీరాంసాగర్‌ చరిత్రలోనే మొదటిసారి యాసంగిలో మొత్తం 13 లక్షల ఎకరాలకు సాగునీరు అం దుతున్నది. అంతకుముందుం వానకాలం పంటకాలంలో 620కి పైగా చెరువులను నింపడం సూర్యాపేట రైతాంగం చూశారు. (అప్పుడు కూడా ఇవి ఎల్లంపల్లి నీళ్ళా? కాళేశ్వ రం నీళ్ళా అన్న అర్థం లేని చర్చను లేవనెత్తిన ప్రబుద్ధులున్నారు.) ఇది కాళేశ్వరం వచ్చినందువల్లనే సాధ్యమవుతున్నది నిర్వివాదాంశం. దానితో పాటు వరద కాలువ ప్రిజంలో ఒక టీఎంసీ నీటిని నింపి వరద కాలువ, కాకతీయకాలువ మధ్యలో ఉన్న 50 వేల ఎకరాలకు ఆయకట్టుకు వరదకాలువలో ఏర్పాటుచేసిన తూముల ద్వారా సాగునీరు అందించడానికి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ ప్రక్రి య కూడా మొదలైంది. కాళేశ్వరం తొలి ఫలితం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని రైతాంగానిదే అన్న నిజం ఇవ్వాళ నిర్ద్వందంగా రుజువైంది.


logo