బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Feb 25, 2020 , T00:05

అదనపు పడకగదులు

అదనపు పడకగదులు

కరీంనగర్‌, వరంగల్‌, సిద్ధిపేట, హైదరాబాద్‌లలో ఉన్న ప్రభుత్వ దవాఖానల్లో ఐసీయూ పడకలు సరిపోవంట లేదు. అత్యవసర పరిస్థి తుల్లో రోగులు ప్రైవేట్‌ దవాఖానాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో పభుత్వం అదనపు గదుల ఏర్పాటుచేసేందుకు నిధులు మంజూరు చేసింది.అయితే అదనపు పడకగదులు ఏర్పాటు చేస్తుండటంతో ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభు త్వ దవాఖానలు కార్పొరేట్‌ దవాఖానలను తలపించే విధంగా తయా రవ్వాలి. అప్పుడే మరింతగా సామాన్య ప్రజలు ప్రభుత్వ సేవలను వినియోగించుకోగలుగుతారు. 

- బేగరి ప్రవీణ్‌కుమార్‌, అంతారం, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా


అవగాహన కల్పించాలె

ఎండకాలం మొదలైంది. అప్పుడే భానుడు భగభగ మండిపోతున్నా డు. ఏటా వడదెబ్బతో వందల సంఖ్యల్లో ప్రజలు మరణిస్తున్న విష యం తెలిసిందే. కాబట్టి ప్రజలు వడదెబ్బకు గురికాకుండాప్రభుత్వం సలహా సూచనలు ఇవ్వాలి. వడదెబ్బ పట్ల ప్రచార, ప్రసార సాధనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి.   

- జూలపల్లి మోహన్‌, మానకొండూర్‌, కరీంనగర్‌

మారనున్న రూపురేఖలు

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి ష్ఠాత్మకంగా తీసుకొని ‘పట్టణ ప్రగతి’ కార్యక్ర మాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో పది రోజుల పాటు జరుగనున్నది. ఇందులో భాగంగా పారిశుద్ధ్యం, పచ్చదనం, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించనున్నారు. ప్రభుత్వం గతంలో ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పల్లె రూపురేఖలను మార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం ద్వారా పట్టణాల రూపు రేఖలను కూడా మార్చనున్నారు. ఇటీవల ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు ఇతర ప్రజాప్రతినిధులు పట్టణ ప్రగతి కార్య క్రమంలో చురుగ్గా పాల్గొని తమ తమ పట్ట ణాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి. పట్టణా లు, నగరాల్లో ఉన్న అన్నిరకాల సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా కృషిచేయాలి. 

- నర్మాల కృష్ణతేజ, లక్ష్మీనగర్‌, కరీంనగర్‌


logo