ఆదివారం 29 మార్చి 2020
Editorial - Feb 23, 2020 , 23:34:03

కవితలకు ఆహ్వానం

కవితలకు ఆహ్వానం

సృజన సాహితి సంస్థ ఆధ్వర్యంలో బాపురం నరహరిరావు పుర స్కారం కోసం కవితలకు ఆహ్వానం. కవితల నిడివి 20 లైన్లకు మించరాదు. కవితలు మార్చి 31లోపు అందేలా పంపాలి. చిరునామా: శివేగారి చిన్నికృష్ణ, కాలువపల్లి, ఎంపీ కోటూరు పోస్ట్‌. పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా-517408.

- శివేగారి చిన్నికృష్ణ,6300318230 


‘అమ్మనానీ’లు ఆవిష్కరణ

వెన్నెల సత్యం రచించిన అమ్మనానీలు ఆవిష్కరణ సభ మార్చి 1న ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని జెడ్పీ హైస్కూల్‌లో జరుగుతుంది. డాక్టర్‌ ఎన్‌.గోపి, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, వల్లభాపురం జనార్దన,కన్నోజు లక్ష్మీకాంతం, రాపోలు సీతారామరాజు, డాక్టర్‌ వి.జయప్రకాశ్‌ పాల్గొంటారు.

- తెలుగుపూల తోట, తెలంగాణ సాహితి


‘నాన్న’ కవితలకు ఆహ్వానం

కొత్వాల్‌ అంజనేయులుగారి స్మారకార్థం ‘నాన్న’ కవితలను ఆహ్వానిస్తున్నాం.కవితలు 20 లైన్లకు మించరాదు. రచనలు మార్చి 31లోపు అందేలా పంపాలి. రచనలు పంపాల్సిన వాట్సాప్‌ నెం:భానుశ్రీ కొత్వాల్‌, నల్లగొండ: 9866863913.కొలకలూరి పురస్కారాలు-2020

ఫిబ్రవరి 26న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం,ఎన్టీఆర్‌ కళాప్రాంగణంలో కొలకలూరి సాహిత్య పురస్కార ప్రదానం జరుగుతుంది. ఆచార్య కొలకలూరి మధుజ్యోతి అధ్యక్షతన జరుగు సభలో  గౌరవ అతిథులుగా జస్టిస్‌ చంద్రయ్య, ఆచార్య చిలుమూరి శ్రీనివాసరావు, ఆచార్య సుమకిరణ్‌, ఆచార్య కొలకలూరి లక్ష్మీతులసి మాధవి హాజరవుతారు. అందరికీ ఆహ్వానం.

- కొలకలూరి అనితా శ్రీకరణ్‌


ధనికొండ శతజయంతి ముగింపు సభ

ధనికొండ హనుమంతరావు శతజయంతి ముగింపు సమావేశం మార్చి 1 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, హైదరాబాద్‌ రవీంద్రభారతి  మినీ హాల్‌లో జరుగుతుంది. ధనికొండ రచనాకాలం, నేపథ్యం గురించి  వకుళాభరణం రామకృష్ణ, సంగిశెట్టి శ్రీనివాస్‌, కె.శ్రీనివాస్‌, ఆయన కథల గురించి కాత్యాయని విద్మహే, జగన్నాథ శర్మ మాటాడుతారు. ఎంపిక చేసిన 40 కథల మీద 25మంది యువ రచయితలు, విమర్శకులు చర్చ జరుపుతారు.

- ధనికొండ శతజయంతి ఉత్సవ కమిటీ


logo