శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Feb 22, 2020 , 22:51:07

అంతర్జాతీయంగానూ అప్రతిష్ఠ

అంతర్జాతీయంగానూ అప్రతిష్ఠ

శరణార్థుల పట్ల శ్రద్ధ ఉంటే వారికి పౌరసత్వం కేసు పరిష్కారమయ్యేంతవరకు తాత్కాలిక వసతితో పాటు విద్య, వైద్య, ఉద్యోగ సౌకర్యాలు కల్పించి ఉండాల్సింది. అభివృద్ధి చెందిన దేశాలు మత ప్రమేయం లేకుండా శరణార్థులందరికీ కనీస అవసరాలు తీరుస్తాయి. ఉగాండాలో, భూటాన్‌లో వివక్షకు గురైన హిందువులకు అమెరికా అలాంటి వసతులు కల్పించింది.113 కోట్ల మంది నివసిస్తున్న దేశంలో 31 వేల మందికి పౌరసత్వం ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఇంతటి రాజకీయం చేయాల్సిన అవసరం ఉన్నదా? ప్రతి అంశం రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నించడమే ఇప్పుడున్న అలజడులకు కారణం. ఆఫ్ఘనిస్థాన్‌లో గత రెండు దశాబ్దాలుగా భారతదేశం వేలకోట్ల ఖర్చుతో మౌలిక సౌకర్యాలు కల్పించింది. దక్షిణాసియాలో అన్నిదేశాలు చైనా ప్రభావంలోకి వెళ్లాయి. ఒక్క బంగ్లాదేశ్‌ మాత్రమే భారతదేశం వైపున ఉన్నది.

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ఆందోళన లు తగ్గుమొఖం పట్టడం లేదు. షాహీన్‌బాగ్‌ భారత దేశంలో తియన్‌ మెన్‌ స్క్వేర్‌  అయ్యింది. మతభేదం లేకుండా ప్రజలందరూ షాహీ న్‌బాగ్‌ నిరసనను గమనిస్తున్నారు. భారతీ య స్ఫూర్తికి భిన్నమైన చట్టాన్ని ప్రజలు ఇంతగా నిరసిస్తారని మోదీ ప్రభుత్వం ఊహించి ఉండదు. ఇటీవల ఎన్నికల్లో ఢిల్లీ రాష్ట్ర ప్రజలు కేజ్రీవాల్‌ను ఎన్ను కొని నిరసనలకు ఆమోదం తెలిపారు. కొన్ని రాష్ట్ర శాసనసభలు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేస్తున్నా యి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌,  పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌ రాష్ర్టాలతో పాటు తెలంగా ణ రాష్ట్రం కూడా తీర్మానం చేయతలపెట్టింది. 


ఈ చట్టం పట్ల కేసీఆర్‌ స్పష్టమైన వైఖరి అవలంబించారు. పార్లమెంటులో చట్టాన్ని వ్యతిరేకించి టీఆర్‌ఎస్‌ సభ్యులు ఓటు వేసినప్పుడు ఆ చట్టంలో ఉన్న ప్రజా వ్యతిరేక విధానాలు చాలామందికి అవ గాహన కాలేదు. ప్రజా నిరసన ఉవ్వెత్తున లేచినప్పుడు మాత్రమే చట్టంలోని ఆం దోళనకరమైన అంశాలు చర్చకు వచ్చాయి. గంగా జమున తెహజీబ్‌ సంస్కృతిని కలిగి ఉన్న అతికొద్ది ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. హైందవ ముస్లిం సంస్కృతుల మేళవింపుగా ప్రజల ఆచారవ్యవహారాలు సాగించే అరుదైన సంప్రదాయం తెలంగా ణలో ఉన్నది. ఇదే సంప్రదాయాన్ని శతాబ్దాలుగా కొనసాగించిన లక్నో, వారణాసి, అలహాబాద్‌, అయోధ్య ప్రాంతాలు మత వైషమ్యాలతో కలుషితమయ్యాయి. కానీ గాంధీ ప్రశంసించిన హైదరాబాద్‌ సంస్కృతి జీవనదిలా ప్రవహిస్తున్నది.


పౌరసత్వ చట్టంపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం విమర్శకులందరిని పాకి స్థాన్‌ ఏజెంట్లుగా, దేశద్రోహులుగా చిత్రీకరించడానికి  ప్రయత్నం చేస్తున్నది. బంగ్లా దేశ్‌, పాకిస్థాన్‌లలో మైనారిటీలు వివక్షకు గురవుతున్నారని ఈ చట్టంలో చేర్చడం జరిగిందని చెప్తున్నారు. దేశ విభజనతో సంబంధం లేని ఆఫ్ఘనిస్థాన్‌ ఈ లిస్టులో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? హిందూ పక్షపాత ప్రభుత్వం అయిన ప్పుడు హిందువులకు ఇబ్బందులు కలిగిస్తున్న శ్రీలంక, భూటాన్‌ దేశాలను ఈ లిస్టులో ఎందుకు చేర్చలేదు? లౌకిక కాంగ్రెస్‌ ప్రభుత్వం అశ్రద్ధ వహించి ఉండవ చ్చు కానీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం అవతరించిన ఈ ప్రభుత్వం శ్రీలంక శర ణార్థులకు మానవతా దృక్పథంతో పౌరసత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? దశా బ్దాలుగా శ్రీలంక శరణార్థులు దయనీయమైన జీవనం సాగిస్తున్నారు. 


భూటాన్‌ మత వివక్ష విధానం వల్ల లోట్శాంపాలుగా పిలవబడుతున్న హిందువులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 2011లో యాభై వేల మంది హిందువులను క్యాం పుల్లో నిర్బంధిస్తే ప్రపంచదేశాలు జాలిపడి తమతమ దేశాల్లో పౌరసత్వం ఇచ్చాయి. అమెరికా 42 వేల మంది  హిందువులకు పౌరసత్వం ఇచ్చింది. గమనించవలసిన విషయమేమంటే ఈ దేశాలన్నీ క్రైస్తవ మత ప్రాబల్యం కలిగినవి. సుమారు లక్ష  మంది హిందువులను భూటాన్‌ నుంచి వెళ్లగొట్టారు. 76,000 మంది ఇంకా క్యాంపుల్లో నిర్బంధంలో ఉన్నారు. మానవహక్కుల పరిరక్షణ కోసమైనా భారత ప్రభుత్వం తన నిరసనను తెలిపి ఉండాల్సింది. మోదీ ప్రభుత్వమే తీవ్ర మత వివ క్ష అవలంబించడం వల్ల ఇతర దేశాలకు సలహాలిచ్చే అర్హతను కోల్పోయింది. హిం దువులపై ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే శ్రీలంక, భూటాన్‌ శరణార్థులకు  ఆశ్రయ మిచ్చి ఉండాల్సింది. ఏ మైనారిటీ భారతీయుడు అభ్యంతరం తెలిపి ఉండేవా డు కాడు. శ్రీలంక, భూటాన్‌ కూడా ముస్లిం  దేశాలై ఉంటే పౌరసత్వ చట్టంలో కాంది శీకులకు మేలు జరిగి ఉండేదేమో అనే అనుమానం కలుగుతున్నది.


పౌరసత్వ సవరణ చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం ప్రవాస భారతీయులకు కూడా ఇబ్బందులను కలిగించే అంశాన్ని పెట్టారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2005లో ఓవర్‌సీస్‌ సిటిజన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా అనే ఓసీఐగా పిలవబడుతున్న కార్డును ప్రవా స భారతీయులకు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవాస భారతీయులకు ఓటు హక్కు తప్ప పౌరులతో సమానంగా అన్ని హక్కులు లభించాయి. ఈ చట్టం ప్రకారం ప్రభు త్వం ఓసీఐ కార్డును రద్దుచేసే అధికారం తీసుకున్నది. బ్రిటిష్‌ వాళ్లు ప్రవేశపెట్టిన అనేక చట్టాలలో ఏ సెక్షన్‌ ప్రకారమైనా దొంగ కేసు పెట్టి భారతీయ మూలాలకు అనుబంధమైన ఓసీఐ కార్డును రద్దుచేయడానికి అవకాశం ఉన్నది. ఇటీవల మోదీ అమెరికా పర్యటించినప్పుడు ఏడు వేల మంది నిరసన ప్రదర్శన చేశారు. ఆధా రాల్లేకున్నా రాజద్రోహం, దేశద్రోహం అనే కేసులు పెట్టడానికి బ్రిటిష్‌ చట్టాల్లో అనేక అవకాశాలున్నాయి. అర్బన్‌ నక్సలైట్‌ అని ముద్రవేసి ఎనభై ఏండ్లు దాటిన వృద్ధు లను కూడా సంవత్సరాలుగా జైళ్లలో ఉంచుతున్నారు. విదేశాల్లో నిరసన గళం విప్పుతు న్న ప్రవాసభారతీయుల ఓసీఐ కార్డును రద్దుచేసి, వీసా కూడా ఇవ్వకుండా ఇబ్బం దులకు గురిచేసే కుట్రపూరితమైన ఆలోచనలా కనిపిస్తున్నది.


పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో అణిచివేతకు గురై భారతదేశంలోకి వలసవచ్చిన లక్షలాదిమంది హిందూ శరణార్థులకు ఈ చట్టం వల్ల ప్రయోజనం కలుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెప్పాడు. ఆయన ఆధ్వర్యంలో ఉన్న ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ పార్లమెంటు కమిటీకి సమర్పించిన లెక్కలు వేరుగా ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం పౌరసత్వం అర్హతలు కలిగిన హిందువులు 25,447, సిక్కులు 5,807, క్రైస్తవులు 55, బౌద్ధులు 2, పార్శీలు 2-మొత్తం 31,313 మంది ప్రయోజనం పొందుతారు. పాశ్చాత్య దేశాల్లోని చట్టాల వలె పొరుగు దేశాల్లో మత వివక్షకు గురై, వలసవచ్చి ఐదేండ్ల పైబడి భారతదేశంలో నివసిస్తున్న వారికి మత ప్రస్తావన లేకుండా పౌరసత్వం ఇచ్చినట్లయితే ఇప్పుడు ఉన్న 31,313 మంది ఇంత రభస లేకుండానే ప్రయోజనం పొందేవారు.


శరణార్థుల పట్ల శ్రద్ధ ఉంటే వారికి పౌరసత్వం కేసు పరిష్కారమయ్యేంతవరకు తాత్కాలిక వసతితో పాటు విద్య, వైద్య, ఉద్యోగ సౌకర్యాలు కల్పించి ఉండాల్సింది. అభివృద్ధి చెందిన దేశాలు మత ప్రమేయం లేకుండా శరణార్థుల అందరికీ కనీస అవ సరాలు తీరుస్తాయి. ఉగాండాలో, భూటాన్‌లో వివక్షకు గురైన హిందువులకు అమె రికా అలాంటి వసతులు కల్పించింది. 113 కోట్ల మంది నివసిస్తున్న దేశంలో 31 వేల మందికి పౌరసత్వం ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఇంతటి రాజకీయం చేయా ల్సిన అవస రం ఉన్నదా? ప్రతి అంశం రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నించడమే ఇప్పుడున్న అలజడులకు కారణం. ఆఫ్ఘనిస్థాన్‌లో గత రెండు దశా బ్దాలుగా భారతదేశం వేలకోట్ల ఖర్చుతో మౌలిక సౌకర్యాలు కల్పించింది. దక్షిణాసియా లో అన్ని దేశాలు చైనా ప్రభావంలోకి వెళ్లాయి. 


ఒక్క బంగ్లాదేశ్‌ మాత్రమే భారతదేశం వైపున ఉన్నది. షేక్‌ హసీనా నాయకత్వంలో 8 శాతం అభి వృద్ధి రేటుతో బంగ్లాదేశ్‌ లౌకికవాద దేశంగా అద్భుత ప్రగతి సాధిస్తున్నది. బట్టలు ఎగుమతిలో చైనాతో పోటీ పడుతున్నది. ఇప్పుడు చైనాలో వచ్చిన వైరస్‌ వల్ల బంగ్లాదేశ్‌ బట్టలు ఎగుమతిలో ప్రథ మ స్థానం వహించే అవకాశం ఉన్నది. భారతదేశం అవకాశం ఇస్తే సగం మంది బంగ్లా దేశీయులు భారత్‌ వస్తారని కేంద్ర మంత్రి అనడం ఆ దేశాన్ని అగౌరవపరుచడమే. భారతదేశం 4 శాతం ఆర్థిక వృద్ధితో కుంటి నడక నడుస్తుంటే బంగ్లాదేశ్‌ ప్రగతి కొన్ని రంగాల్లో చైనాకు ఇబ్బందికరంగా తయా రైంది. ఆర్థికరంగంలో ప్రపంచదేశాలతో పోటీ పడాల్సిన భారతదేశం మతవాద రాజకీయాల కోసం పొరుగున ఉన్న మిత్రదేశాలతో అకారణంగా వైరం తెచ్చుకొని దశాబ్దాల తరబడి పెంచుకున్న స్నేహబంధాన్ని తెంచు కొనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వచర్యలు రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారతదేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తు న్నాయి. వాటిని సరిదిద్దడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది.

(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు, వాషింగ్టన్‌ డీసీ)


logo