శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Feb 21, 2020 , T00:20

కాంగ్రెస్‌లో మథనం

కాంగ్రెస్‌లో మథనం

బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పొందడం పట్ల చిదంబరం వంటి కాంగ్రెస్‌ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. చిదంబరం ప్రకటన పట్ల షర్మిలా ముఖర్జీ నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. అయితే చిదంబరం ప్రకటన పార్టీ జయాపజయాలకు విషయమై కాదు. విలువలకు సంబంధించినది. కాంగ్రెస్‌ పార్టీ గట్టి ప్రతిఘటన ఇవ్వలేనప్పటికీ, బీజేపీ రాజకీయాలను ప్రజలు తిరస్కరించడం పట్ల వ్యక్తమైన హర్షమిది. చిదంబరం మాదిరిగానే మరికొంద రు కాంగ్రెస్‌ నాయకులు ఈ పరిణామాన్ని స్వాగతించారు. ఈ విలువలు ఇప్పుడు కాకున్నా మరోసారైనా కాంగ్రెస్‌కు జీవం పోస్తాయన్న ఆశ చాలామంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులకు ఉండవచ్చు.

ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో అంతర్మథనం సాగుతున్నది. ఢిల్లీ ఎన్నికలు ఒక సందర్భాన్ని సృష్టించాయి కానీ, ఈ ఎన్నికలతో నిమిత్తం లేకుండా పార్టీ నాయక త్వ అంశంపై చర్చ తప్పనిసరిగా సాగవలసిందే. ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ వరుసగా రెండవసారి ఘోర పరాజయాన్ని పొందింది. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలువకపోవడమే కాదు, 66 మంది అభ్యర్థులలో 63 మంది డిపాజిట్‌ కోల్పోయారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పడిన ఓట్లు తొమ్మిది శాతానికి కొంచెం ఎక్కువ. ఈసారి ఇంకా తక్కువగా దాదాపు నాలుగున్నర శాతానికి పడిపోయాయి. పార్టీ బలమైన అభ్యర్థులుగా గుర్తింపు పొందిన వారు కనీసం ఐదు శాతం ఓట్లు తెచ్చుకోలేకపోవడం ఆశ్చర్యకరం. మైనారిటీలు బలంగా ఉన్నచోట్ల పార్టీ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుందనే భావన మొదట్లో వ్యక్తమైంది. కానీ అంతటా అదే పరిస్థితి. అయితే 2015 నాటికి ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మరింత దెబ్బతిన్నప్పటికీ, ఈ రెండింటికీ మధ్య జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి 22.46 శాతం ఓట్లు రావడం గమనార్హం. అంతకుముందు 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి 24.55 శాతం ఓట్లు లభించాయి. గత లోక్‌సభ ఎన్నికలలో ఢిల్లీ ఓటర్లు బీజేపీకి ఘన విజయం కట్టబెట్టారు. కానీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఈ మొత్తం ఎన్నికల సరళిని పరిశీలిస్తే జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ ఉపయోగించుకోలేకపోతున్నదని స్పష్టమవుతున్నది.

బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజ యం పొందడం పట్ల చిదంబరం వంటి కాంగ్రెస్‌ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. చిదంబరం ప్రకట న పట్ల షర్మిలా ముఖర్జీ నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. అయితే చిదంబరం ప్రకటన పార్టీ జయాపజయాల కు విషయమై కాదు. విలువలకు సంబంధించినది. కాంగ్రెస్‌ పార్టీ గట్టి ప్రతిఘటన ఇవ్వలేనప్పటికీ, బీజే పీ రాజకీయాలను ప్రజలు తిరస్కరించడం పట్ల వ్యక్తమైన హర్షమిది. చిదంబరం మాదిరిగానే మరికొంద రు కాంగ్రెస్‌ నాయకులు ఈ పరిణామాన్ని స్వాగతించారు. ఈ విలువలు ఇప్పుడు కాకున్నా మరోసారైనా కాంగ్రెస్‌కు జీవం పోస్తాయన్న ఆశ చాలామంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులకు ఉండవచ్చు. తాజాగా శశిథరూర్‌ చేసిన ప్రకటన చర్చను పార్టీ నాయకత్వంవైపు మళ్ళించింది. పార్టీ నాయకత్వం కోసం ఎన్నిక లు నిర్వహించాలని ఆయన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి విజ్ఞప్తిచేశారు. త్వరలో 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. రాజస్థాన్‌, మధ్యప్ర దేశ్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నది. మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నది. ఈ లెక్కన దాదాపు పదిహేను సీట్లను కాం గ్రెస్‌ పార్టీ సులభంగా గెలుచుకోగలదని అంచనా. ప్రియాంకగాంధీని ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించాలని కొందరు కోరుతున్నారు. మధ్య ప్రదేశ్‌ నాయకులు తాము ప్రియాంకను రాజ్యసభకు పంపించడానికి సిద్ధమని ప్రకటించారు. ప్రియాంక పార్లమెంటులో అడుగుపెడితే పార్టీ నాయకత్వం చేపట్టడం సులభమవుతుంది.

రాహుల్‌గాంధీ వైఫల్యం నేపథ్యంలో సోనియాగాంధీ తాత్కాలికంగా నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ శ్రేణుల్లో కూడా ఇది తాత్కాలిక ఏర్పాటు అనే స్పష్టత ఉన్నది. సోనియా పూర్వం మాదిరిగా క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకత్వ సమస్యను తొందరగా పరిష్కరించడం అవసరమనే అభిప్రాయం పార్టీ సీనియర్‌ నాయకులలో బలం గా వ్యక్తమవుతున్నది. వచ్చే రెండు నెలల్లో నాయకత్వ సమస్య ఖరారవుతుందనే ఊహాగానాలు వినపడుతున్నాయి. మోదీ పట్ల నెలకొన్న వ్యతిరేకతను ఉపయోగించుకోవడానికి లోక్‌సభ ఎన్నికలలో రాహుల్‌గాంధీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయారు. ఈ నేపథ్యంలో పార్టీ ఘోర పరాజయం పొందింది. ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకత రూపుదిద్దుకోక ముందు రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. పార్టీ పదవికి రాజీనామా సమర్పించినా, నాయకత్వం కోల్పోవడం ఆయనకు ఇష్టం లేదు. తెర వెనుక చక్రం తిప్పుతూనే ఉన్నారు. రాహుల్‌ గాం ధీ మళ్ళా నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తారనే వార్తలు పార్టీ నాయకులలో, కార్యకర్తలలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రియాంకకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలనే భావన కొందరు సీనియర్‌ నాయకులలో నెలకొన్నది. నాయకత్వం ఎవరు స్వీకరించినా పార్టీ పరిస్థితి వెంటనే మారిపోదు. ఇతర రాజకీయపక్షాలతో కూటమిగా ఏర్పడటం ద్వారానే కాంగ్రెస్‌ పార్టీ బీజేపీని ఎదుర్కొనగలుగుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తించకపోవడం వల్ల రాహుల్‌గాంధీ తప్పుడు వ్యూహం అనుసరించారు. ఢిల్లీ ఎన్నికలలో ఆప్‌ గెలుపు పట్ల కాంగ్రెస్‌ నాయకులు కొందరు హర్షం వ్యక్తం చేయడాన్ని కూడా ఈ కోణంలోనే అర్థం చేసుకోవాలె. 


logo