శనివారం 28 మార్చి 2020
Editorial - Feb 21, 2020 , T00:15

ఫెడరల్‌ఫ్రంటే దేశానికి దిక్సూచి

ఫెడరల్‌ఫ్రంటే దేశానికి దిక్సూచి

ప్రజలు ఇఫ్పుడు బంగారు తెలంగాణ కావాలని కలగంటున్నారు. దాన్ని కూడా కేసీఆర్‌ సాకారం చేసి తీరుతాడు. అందులో భాగమే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పాలనాతీరు, సాగునీరు ప్రాజెక్టులని చెప్పాను. అప్పుడు నా మిత్రులు.. ఫెడరల్‌ ఫ్రంట్‌ కూడా ఆయన కన్న కలే అని అంటూ.. ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశవ్యాప్తంగా ఒక వేదిక అవసరం ఉన్నదని అర్థమవుతుందన్నారు. 

పది రోజుల కిందట మిత్రులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూ రు జిల్లా కావలికి వెళ్లాను. రెండు దశాబ్దాల కిందట నేను విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. అప్పటి కావ లి జవహర్‌ భారతి కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ చదువుకునే విద్యార్థులంతా పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకున్నారు. ఈ సమ్మేళనానికి వివిధ హాదాల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన 300 మందికి పైగా పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. రెండు దశాబ్దాల తర్వాత కలుసుకోవడంతో జ్ఞాపకాలను, నాటి విద్యార్థి ఉద్యమాలను  నెమరేసుకోవడంతో పాటు నేటి ప్రాంతీయ, జాతీయ రాజకీయాల గురించి తెలంగాణ ఉద్య మ ప్రస్తావన, సీఎం కేసీఆర్‌ పాలన, తెలంగాణలో అమలవుతున్న సంక్షే మ కార్యక్రమాల గురించి వారు నాతో చర్చించారు. ఏపీలో జరుగుతు న్న పరిణామాల గురించి ప్రస్తావన వచ్చినా, వారంతా తెలంగాణ రాజకీయాలపై, జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపించారు. బహుశా నేను ‘టీ న్యూస్‌' ఇన్‌పుట్‌ ఎడిటర్‌గా ఉండటం, తెలంగాణ నుంచి రావడమే కారణం కావచ్చు. జాతీయ రాజకీయాల పట్ల, తెలంగాణ సీఎం కేసీఆర్‌ విజన్‌ పట్ల వాళ్ల అబ్జర్వేషన్స్‌  ఆసక్తికరంగా అనిపించాయి. వారి పరిశీల న, అభిప్రాయాలే ఈ వ్యాసానికి భూమిక.

నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక తీసుకువస్తున్న చట్టా లపై, ముఖ్యంగా సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్సీఆర్‌లపై, అదే సందర్భంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్రంతో అనుసరిస్తున్న వైఖరి మీద వాళ్ల అభిప్రాయాలు నాతో పంచుకున్నారు. కేసీఆర్‌ రాజకీయంగా చాలా మెచ్యూరిటీ ఉన్న రాజకీయవేత్త కాబట్టే సందర్భం, సమయాన్ని బట్టి తన వ్యూహాలకు పదునుపెడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలోనే జాతీయ రాజకీయాల గురించి చర్చిస్తూ.. భారీ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ కొద్దినెలల కాలంలోనే  దేశంలో వివిధ రాష్ర్టాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడం ప్రస్తావనకు వచ్చిం ది. అదే సందర్భంలో రాష్ట్రంలో రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారం లోకి వచ్చాక జరిగిన వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు గురిం చి కూడా గుర్తుచేశారు. ఈ చర్చ సమయంలోనే కొందరు కేసీఆర్‌ లేవనెత్తిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రస్తావన తీసుకువచ్చారు. కేసీఆర్‌ విజన్‌ ఉన్న నాయకుడు కాబట్టే దేశంలో జరుగబోయే పరిణామాలను అంచనా వేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ అవసరం ఉందని గుర్తించి వివిధరాష్ర్టాల ముఖ్యమంత్రులు, నేతలతో భేటీ అయ్యారని గుర్తుచేశారు. నేడు మోదీ అనుసరిస్తు న్న విధానాలు చూస్తే ఫెడరల్‌ ఫ్రంట్‌ అవసరం ఎంత ఉందో అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. ఈ చర్చ కొనసాగింపుగానే కేసీఆర్‌ విజన్‌ గురిం చి ఉద్యమ సమయంలో వ్యూహాలు, ఎత్తుగడల గురించి కూడా చర్చ జరిగింది. కేసీఆర్‌ పట్ల వాళ్ల అభిప్రాయాలను షేర్‌ చేసుకుంటూనే,  దశా బ్దకాలంగా కేసీఆర్‌ను దగ్గరినుంచి చూసిన జర్నలిస్ట్‌గా నీ అబ్జర్వేషన్‌ ఏం టి అని నన్నడిగారు. ఒక విలక్షణమైన నాయకుడిని దగ్గరినుంచి చూసే అవకాశం నాకు రావడం అదృష్టమన్నాను. ఏడాది తర్వాత ఎటువంటి రాజకీయ పరిణామాలు జరుగబోతాయో అంచనా వేయడంతోపాటు, ఏడాది తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయానికి ఇప్పుడే ఒక భూమిక ను ఏర్పాటుచేయడం విలక్షణమైన లక్షణాలు కలిగిన నాయకుడి పని తీరని చెప్పాను. ప్రజలకు ఏం కావాలో సంపూర్ణ అవగాహనతో నిర్ణయా లు తీసుకుంటారని అందుకే ప్రతిపక్షాలు చాలా బలహీనపడ్డాయని ప్రజలకు బాగా కనెక్టయిన నాయకుడని వారికి వివరించాను.

ఉద్యమ సమయంలో నేను రిపోర్టర్‌గా టీఆర్‌ఎస్‌ బీట్‌ చూసేవాడిని. కేసీఆర్‌ కేంద్రమంత్రిగా, కరీంనగర్‌ ఎంపీగా కేసీఆర్‌ రాజీనామా, 2006 కరీంనగర్‌ ఉపఎన్నిక, 2008 ఉపఎన్నికల కవరేజ్‌ సందర్భంగా కేసీఆర్‌ తో ఎక్కువ టైం ట్రావెల్‌ చేసే అవకాశం నాకు దక్కింది. అప్పుడు కేసీఆ ర్‌ ఎప్పుడూ ఒకమాట చెప్పేవారు. రాజకీయ నాయకుడనే వాడు కలలు కనాలి. కలలు కనడం అంటే విజన్‌ ఉండటం. కలలు కనలేనివాడు నాయకుడే కాదంటూనే.. ఆ కలను సాకారం చేసుకొని తీరుతానని చెప్పేవారు. అన్నట్లుగానే తెలంగాణ తెచ్చారు.

ప్రజలు ఇఫ్పుడు బంగారు తెలంగాణ కావాలని కలగంటున్నారు. దాన్ని కూడా కేసీఆర్‌ సాకారం చేసి తీరుతాడు. అందులో భాగమే  తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పాలనా తీరు, సాగునీరు ప్రాజెక్టులని చెప్పాను. అప్పుడు నా మిత్రులు.. ఫెడరల్‌ ఫ్రంట్‌ కూడా ఆయన కన్న కలే అని అంటూ.. ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీకీ ప్రత్యామ్నాయంగా దేశవ్యాప్తంగా ఒక వేదిక అవసరం ఉన్నదని అర్థమవుతుందన్నారు. రోజురోజుకూ కాంగ్రెస్‌ బలహీనపడుతున్న నేపథ్యంలో బీజేపీకీ ప్రత్యేమ్నాయంగా ప్రాంతీయపార్టీల కూటమి ఏర్పడాల్సిన అవసరమున్నదని వారు గుర్తుచేశారు. దానికి కేసీఆరే నాయకత్వం వహించాలన్నారు.

దీంతో వారి అబ్జర్వేషన్స్‌ను తెలుసుకుందామనే ఆసక్తి మరింత పెరిగింది. కేసీఆరే ఎందుకు నాయకత్వం వహించాలని అనుకుంటున్నారో చెప్పాలని మిత్రులను అడిగిన. వారిచ్చిన వివరణ.. సోనియాకు వయోభారం, రాహుల్‌ నాయకత్వానికి జాతీయస్థాయిలో మద్దతు రాకపోవ డమంటూనే సీనియర్‌ సీఎంలైన మమతా, నవీన్‌ పట్నాయక్‌లతో పాటు జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక భావజాలం ఉంటూ సీనియర్‌ నాయకుడిగా ఉన్నా శరద్‌పవార్‌ అన్నిరకాల లాబీయింగ్‌లు చేయగలిగే శక్తి యుక్తులున్నా వయోభారం కారణంగా నాయకత్వం చేపట్టలేని స్థితుల్లో ఉన్నారని వివరించారు. బీజేపీనీ వ్యతిరేకించే వారిలో ప్రస్తుతం సీఎంలుగా ఉన్నవారెవరికీ దేశవ్యాప్త నాయకత్వానికి అవసరమైన లక్షణాలు లేవన్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న వారికి ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉన్నది. ఒకరికి భాష సమస్య అయితే మరొకరిది సీనియారిటీ సమస్య. ఇంకొకరికి జాతీయస్థాయిలో వారి నాయకత్వానికి మద్దతు లేకపోవడం, మరొకరు రాష్ట్రం దాటి బయటకురాని పరిస్థితి. ఇలా ఎవరికి ఉండాల్సిన అడ్డంకులు, బలహీనతలు వారికి ఉన్నాయంటూనే ఏ రకంగా చూసి నా కేసీఆర్‌ ఒక్కడే ఫెడరల్‌ ఫ్రంట్‌కు నాయకత్వం వహించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయనిపిస్తున్నయని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేంద్ర మంత్రిగా ఉంటూ దేశంలోని అన్ని రాజకీయపార్టీల నేతలను కలుస్తూ.. వారి మద్దతు కూడగట్టారు. నాటి పరిచయాలతో పాటు నేడు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడం, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకతను ఆయ నే తొలిసారిగా లేవనెత్తడంతో పాటు ఓ విజన్‌ ఉన్న నాయకుడిగా దేశంలో నదీజలాల వినియోగం, వ్యవసాయరంగం ఇతర కీలకరంగాల్లో దేశం ఏ రకంగా పురోగతి చెందాలో సంపూర్ణ అవగాహన కలిగి ఉండటంతో పాటు జాతీయ రాజకీయాలకు టైం కేటాయించగలిగే వెసులుబాటు ఆయనకే ఉన్నది.

కేటీఆర్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉంటూ వివిధ శాఖల మంత్రిగా రాష్ర్టాన్ని అభివృద్ధిబాటలో పయనింపజేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్‌ సక్సె స్‌ఫుల్‌ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. రేపటిరోజున కేటీఆర్‌ను డిప్యూ టీ సీఎంను చేసి రాష్ట్ర పాలన బాధ్యతలు అప్పజెప్పి కేసీఆర్‌ ముఖ్యమం త్రి హోదాలో ఫెడరల్‌ ఫ్రంట్‌ వ్యవహారాలను చక్కదిద్దే అవకాశం వెసులుబాటు ఆయనకే ఉన్నదన్నారు. అదేమిటి కేటీఆర్‌ కాబోయే సీఎం అని అందరూ అంటుంటే, మీరేమిటి డిప్యూటీ సీఎం అంటున్నారని నేను ఆసక్తిగా అడిగిన. అదేమి లేదన్నా కేసీఆర్‌ సీఎం హోదాలో ఉంటేనే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో కీలక భూమిక పోషించగలరంటూ కేంద్ర రాజకీయాలు పూర్తిస్థాయి పట్టు సాధించాక అప్పుడు కేటీఆర్‌ను సీఎం చేయాలని మా అభిప్రాయమని నా మిత్రులు చెప్పుకొచ్చారు. అలాగే బీజేపీ చెబుతున్న హిందుత్వం బూటకమని చెబుతూ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగల నాయకుడు కేసీఆర్‌ ఆ మిత్రుల విశ్లేషణ. నాడు నేషనల్‌ ఫ్రంట్‌కు ఎన్టీఆర్‌ ఛైర్మన్‌గా ఉన్నాడని చెబుతూ, నేడు కూడా ఫెడరల్‌ ఫ్రంట్‌కు కేసీఆర్‌ ఛైర్మన్‌గా ఉండాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి వచ్చి, దేశం ఓ ముందుచూపున్న నేత నేతృత్వంలో తెలంగాణ లాగా, మనదేశం కూడా ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలు వాలని ఆశిద్దాం.

(వ్యాసకర్త: ఇన్‌పుట్‌ ఎడిటర్‌, టీ న్యూస్‌)


logo