సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Feb 19, 2020 , 23:05:11

ప్రాణాలు తీస్తున్న ఈత సరదా

ప్రాణాలు తీస్తున్న ఈత సరదా

ఈత సరదా ప్రాణాలు తీస్తున్నది. తరుచుగా చెరువుల్లో మునిగి విద్యార్థుల మృతి అని వస్తున్న వార్తలు చూస్తుంటే గుండె తరుక్కు పోతున్నది. కాబట్టి  తల్లిదండ్రులు ఈత పట్ల విద్యార్థులకు అవగాహ న కల్పించాలి. పెద్దలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను చెరువులో కి పంపించ కూడదు. పెద్దల సమక్షంలోనే పిల్లలకు ఈత నేర్పించాలి. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి పెద్ద చెరువు వద్ద లేక్‌ వ్యూ పోలీసుల ను నియ మించాలి. అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి.

- బి.వెంకటేశ్‌ గౌడ్‌, గజ్వేల్‌, సిద్దిపేట జిల్లా 

అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలె

రానున్నది ఎండాకాలం. ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. కాబట్టి అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఎక్కడైనా అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లయితే ఆస్తి, ప్రాణనష్టం వాటిళ్లకుండా అగ్నిమాపక శాఖాధికారులు సర్వసన్నద్ధం గా ఉండాలి. నిత్యం అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలి. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి.

- మొగుళ్ల సునీల్‌, బేగంపేట్‌, హైదరాబాద్‌

ప్రాణాలు తీస్తున్న ఈత సరదా

ఈత సరదా ప్రాణాలు తీస్తున్నది. తరుచుగా చెరువుల్లో మునిగి విద్యార్థుల మృతి అని వస్తున్న వార్తలు చూస్తుంటే గుండె తరుక్కు పోతున్నది. కాబట్టి  తల్లిదండ్రులు ఈత పట్ల విద్యార్థులకు అవగాహ న కల్పించాలి. పెద్దలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను చెరువులో కి పంపించ కూడదు. పెద్దల సమక్షంలోనే పిల్లలకు ఈత నేర్పించాలి. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి పెద్ద చెరువు వద్ద లేక్‌ వ్యూ పోలీసుల ను నియ మించాలి. అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి.

- బి.వెంకటేశ్‌ గౌడ్‌, గజ్వేల్‌, సిద్దిపేట జిల్లా 

భాషా ఉన్నతిని నిలుపుదాం

వెలుగు జిలుగులు విరజిమ్మిన తెలుగు భాషకు పరభాషా వ్యామోహమనే గ్రహణం పట్టింది. దాంతో మన తెలుగు సంస్కృతికి సంబంధించి న అలవాట్లు, అభిరుచులు, సంస్కృతీ సంప్ర దాయాలు ఒక్కొక్కటి కనుమరుగవుతున్నా యి. కొందరైతే తెలుగు మాట్లాడితే తమ అంతస్తుకు, గొప్పత నానికి భంగమనుకుంటు న్నారు. ఇలాంటివారు తమ పద్ధతి మార్చుకొ ని తెలుగు భాషను గౌరవించడం నేర్చుకోవా లి. అప్పుడే మన తెలుగుభాషలోని మాధు ర్యం, నుడికారపు సొంపు తొణికిసలాడుతుం ది. మనది తెలుగు భాష, మనం తెలుగు వాళ్లం. మనది తెలుగు జాతి. మనభాష చెక్కు చెదరకుండా చూసుకోవాలి. మన దేశంలో అత్యధికులు మాట్లాడే నాలుగోది తెలుగు భాష. ఇంతటి గొప్ప భాష ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి.

- కాయల నాగేంద్ర , హైదరాబాద్‌

logo