సోమవారం 30 మార్చి 2020
Editorial - Feb 18, 2020 , 22:55:17

అప్పుడే ప్రజలు ఆదరిస్తారు

అప్పుడే ప్రజలు ఆదరిస్తారు

బీజేపీ నేతలకు తెలంగాణ సోయి లేదు. ఎంతసేపూ అధికారపార్టీపై విమర్శలు చేయడమే కానీ రాష్ట్ర ప్రయోజనాలు వారికి పట్టవు. పార్లమెంటు వేదికగా ఎన్నడూ రాష్ర్టానికి సంబంధించిన పెండింగ్‌ ప్రాజెక్టుల గురించి గానీ రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి గట్టిగా డిమాండు చేసిన దాఖలాలు కనిపించవు. కానీ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అని ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రం ఇస్తుంటారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలనుకోవడంలో తప్పులేదు. కానీ అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రయోజనాలు, హక్కుల గురించి కూడా పనిచేయాలి. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు. ఈ విషయం బీజేపీ నేతలకు తెలువదని అనుకోలేం. కానీ అసత్యాలు, విష ప్రచారాలతో అధికారంలోకి రావాలనుకోవ డం హాస్యాస్పదం. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. అందుకే రాష్ట్రం సిద్ధించేదాకా పోరాటాన్ని ఆపలేదు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు తెలుసుకోవాలి. అధికారం కోసం అబద్ధాలు చెప్పి ప్రజల మభ్యపెట్టాలని అనుకుంటే ఏమౌతుందో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తగినవిధంగా సమాధానం చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నేతలు తెలంగాణ సోయి తో పనిచేయాలి. విమర్శలకే పరిమితం కాకుండా రాష్ర్టాభివృద్ధి కోసం, కేం ద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధుల గురించి తమవంతు ప్రయత్నం చేయాలి. అప్పుడే ఎంతోకొంత ప్రజలు ఆదరిస్తారు. 

- కె. కుమారస్వామి, జనగామ


అనర్హులుగా ప్రకటించాలె

దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఎక్కువ మంది నేర చరిత్ర కలిగి ఉన్నవారే ఉన్నారని ఇటీవల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా పార్టీలు నేర చరిత్ర కలిగిన నాయకుల పేర్లు బహిర్గతం చేయాలం టూ కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా త్వరగా నేర విచారణ చేయించాలని, శిక్షలు పడ్డవారికి వెంటనే అనర్హులుగా ప్రకటించాలని తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును అన్ని రాజకీయపార్టీలు ఆహ్వానించడం హర్షణీయం. విచారణ లో నేరం రుజువైతే ఆయా నాయకుల ను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయాలి. అప్పుడే ప్రజాస్వా మ్యం పరిఢవిల్లు తుంది. ఆదిశగా చర్యలు తీసుకోవాలి.   

- రాయపురం మనీష, బోయినపల్లి


logo