శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Feb 18, 2020 , T00:10

ప్రజాహితానికే పట్టం

ప్రజాహితానికే పట్టం

తెలంగాణలోనూ బీజేపీ హిందుత్వ చర్యలు కేసీఆర్‌ ప్రజల అవసరాలను తీర్చే పథకాల ముందేం పనిచేయలేదు.రాష్ట్రంలో కేసీఆర్‌ వ్యవసాయాధారంగా బతికే కోట్లాదిమందిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి నమూనా తయారుచేశారు. దశాబ్దాలుగా నీటి కొరతతో తల్లడిల్లుతున్న తెలంగాణ రైతాంగానికి నీరందించడానికి మిషన్‌ కాకతీయ, కాళేశ్వరంలాంటి ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టి చాలావరకు పూర్తిచేశారు. ప్రతి ఇం టికీ తాగు నీరందించడానికి మిషన్‌ భగీరథ పథకంతో మంచినీళ్లం దించారు. రైతుబంధు, వృద్ధాప్య పింఛన్‌, రుణమాఫీ ఇతర అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరేట్టు చేశారు.

కేసీఆర్‌పై వ్యతిరేకత ఉందని ఎంత ప్రచారం జరిగినా జాతీయపార్టీలు ఎన్ని అభాండాలు వేసినా రెండోసారి ఎన్నికల్లో ఓడించడానికి బీజేపీ,కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఎంత ప్రయత్నించినా ఓడించలేకపోయారు. ఆయా పార్టీలకు రాష్ట్రంలో చిరునామాలు కూడా లేని విజయపరంపరను కొనసాగిస్తున్న నేత కేసీఆర్‌. అందుకు కారణం జాతీయపార్టీలు ఆరోపిస్తున్నట్లు ధనప్రవాహం కానే కాదు. విమర్శలతో గెలువాలని చూసిన కాంగ్రెస్‌, మతం సెంటిమెంట్‌తో గెలువాలని చూసిన బీజేపీ బొక్కబోర్లాపడ్డాయి. 

కేజ్రీవాల్‌ దేశ రాజధాని నగరమైన ఢిల్లీ రాష్ర్టానికి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అతని సిద్ధాంతం అవినీతిరహిత ఢిల్లీ, తద్వారా భారత్‌. అతని బలం, బలగం అవినీతిరహిత సమాజం. సామాన్య ప్రజలు బక్కచిక్కిన అతి సామాన్యుడైన కేజ్రీవాల్‌ ఉత్తర భారతానికే కాదు, మొత్తం దేశానికే గుండెకాయ లాంటిదైన ఢిల్లీ రాష్ట్ర సింహాసనాన్ని అధిష్టించడం సామాన్యమైన విషయం కాదు. ఢిల్లీకే పరిమితమైన ఓ ప్రాంతీయపార్టీ వంద పాతికేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను, దేశాన్నేలుతున్న జాతీయపార్టీ బీజేపీని ఢిల్లీలో చిరునామాల్లేకుండా ఓడించడం అసమానం.సాధారణంగా ఐదేండ్లు పాలించిన పార్టీపై వ్యతిరేకత ఏర్పడటం సహ జం. కానీ కేజ్రీవాల్‌పై ఏ మాత్రం వ్యతిరేకత ఏర్పడలేదు. అందుకు కార ణం ఆయన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం. కులం, మతం, ప్రాంతం అని కాకుండా సామాన్య మానవుడికి, మధ్యతరగతి మనిషికి ఏం కావాలో అవి నెరవేర్చడం. డబ్బు, మద్యం ఏరులై పారిస్తున్న జాతీయపార్టీలకు భిన్నంగా, తానుచేసిన పనులకు ఓట్లడగడం గమనార్హం. అవినీతిరహిత పాలన అనే ఒకేఒక నినాదంతో, ఆచరణతో నూ ఎన్నికలు గెలువవచ్చని రుజువుచేసిన ధీరోదాత్తుడు కేజ్రీవాల్‌. ఒం టిచేత్తో ధనబలం, మీడియా బలం, మాఫియా బలం ఏవీ లేకుండా నిజాయితీతో మనిషి కోసం మంచి పాలనను అందిస్తే గెలుపు సాధ్యమేనని రుజువుచేసిన అసామాన్య రాజకీయవేత్త మన కేజ్రీవాల్‌.

దేశానికి రెండవ రాజధాని కాగల అన్నీ అర్హతలున్న ఒకేఒక మహానగరం అని అంబేద్కర్‌తో చెప్పబడిన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ కూడా మినీ ఇండియా లాంటిదే. వివిధ రాష్ర్టాల జనమే కాకుండా ప్రపంచదేశాల ప్రజలూ ఇక్కడున్నారు. బక్కచిక్కిన శరీరధారియైన కేసీఆర్‌ రాజకీయ మానసిక సింహబలుడై ఒంటిచేత్తో తెలంగాణ సాధించాడు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన దాదాపు అన్నీ ఎన్నికల్లోనూ జాతీ యపార్టీలుగా చెప్పుకోబడే కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలన్నింటినీ ఓడించి రెం డుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్‌. తెలంగాణ ఆత్మగౌరవం, స్వయంపాలన, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని అదే చేశారు కేసీఆ ర్‌. మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు తెలంగాణ సెంటిమెంట్‌ ఉపయోగపడిందనుకున్నా ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఘన విజయం కేసీఆర్‌కు ఎలా సాధ్యమైంది. ఐదేండ్లు పాలన చేసిన తర్వాత ఏ పార్టీకైనా సాధారణంగా వ్యతిరేకత వస్తుంది. కానీ కేసీఆర్‌ ఐదేండ్ల పాలన జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మొదటిసారి కంటే ఎక్కువ ఓట్లను, సీట్లను పొంది విజేతగా నిలిచారు. అందుకు కారణం కేజ్రీవా ల్‌లా కేసీఆర్‌ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, నూటికి నూరుపాళ్లు హామీలు నెరవేర్చడం. ఇంతవరకు తెలంగాణాను పాలించిన పార్టీల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ హామీలు నెరవేర్చి ప్రజోపయోగకర పనులు చేయడం.కేసీఆర్‌పై వ్యతిరేకత ఉందని ఎంత ప్రచారం జరిగినా జాతీయ పార్టీ లు ఎన్ని అభాండాలు వేసినా రెండోసారి ఎన్నికల్లో ఓడించడానికి బీజే పీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఎంత ప్రయత్నించినా ఓడించలేక పోయా రు. ఆయా పార్టీలకు రాష్ట్రంలో చిరునామాలు కూడా లేని విజయ పరంపరను కొనసాగిస్తున్న నేత కేసీఆర్‌. అందుకు కారణం జాతీయపార్టీలు ఆరోపిస్తున్నట్లు ధనప్రవాహం కానే కాదు. విమర్శలతో గెలువాలని చూసిన కాంగ్రెస్‌, మతం సెంటిమెంట్‌తో గెలువాలని చూసిన బీజేపీ బొక్కబోర్లా పడ్డాయి. వారు కోట్లాదిమంది తెలంగాణ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గమనించలేదు. తెలిసినా తెలియనట్టు నటించారు. ఇతర పార్టీల మీదున్న వ్యతిరేక ఓట్లతో కాదు, టీఆర్‌ఎస్‌ పార్టీ మీదున్న అనుకూల అభిమాన ఓట్లతో కేసీఆర్‌ గెలిచాడు. ప్రజలు మెచ్చే పాలనను అందిస్తే గెలుపు సాధ్యమేనని కేజ్రీవాల్‌ నిరూపించినట్టే కేసీఆర్‌  నిరూపించాడు.

ఢిల్లీ రాష్ర్టాన్ని కేజ్రీవాల్‌, తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్‌ ఒంటిచేత్తో గెలిపించి ఢిల్లీ పాదుషాగా కేజ్రీవాల్‌, హైదరాబాద్‌ పాదుషాగా కేసీఆర్‌ సమున్నతంగా నిలబడినారు. దేశ రాజధాని ఢిల్లీలో, రెండవ రాజధానిగా చెప్పుకోబడే మహానగరం హైదరబాద్‌లో జాతీయపార్టీలకు స్థానం లేదని నిరూపించిన మహానాయకులు కేజ్రీవాల్‌, కేసీఆర్‌. స్వాతంత్య్రానంతర కాలం నుంచి జాతీయపార్టీలు వివిధ రాష్ర్టాల పట్ల చూపుతున్న వివక్ష, పెంచిపోషిస్తున్న కుల, మత, జాతి వైరుధ్యాలు, ప్రజలను ఓటర్లుగా మాత్రమే చూడటం లాంటి పనులతో వాటిపట్ల ఏవగింపు కలిగేట్టు చేశా యి. ఢిల్లీ, తెలంగాణలో మాత్రమే కాదు, దేశంలోని అనేక ష్ర్టాల్లో ప్రాంతీయపార్టీలు బలపడటానికి, అవే తమ సమస్యలు తీర్చే పార్టీలని ప్రజలు భావించడానికి, జాతీయపార్టీల బాధ్యతారాహిత్య ప్రవర్తనే కారణం.మధ్యతరగతి, సామాన్య స్థితిగతుల నుంచి వచ్చి అసామాన్య రాజకీ యవేత్తలుగా ఎదిగి, అసంఖ్యాక ప్రజల హృదయాలను గెలిచి విజేతలుగా నిలిచారన్నది వాస్తవం. ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం మాత్రమే కాదు ప్రజల హృదయాలను గెలిచిన నేతలు కేసీఆర్‌,  కేజ్రీవాల్‌. వీళ్లకి ప్రజల్లో అపూర్వ ఆదరణ ఎలా సాధ్యమైంది? పాలకులుగా వాళ్ళు చేసిన పనులు ఓట్ల కోసం ప్రజలను చేరుకునే ప్రచార సరళితోనే ఇది సాధ్యమైంది. బీజేపీ లా కేజ్రీవాల్‌ తన పార్టీ గెలుపు కోసం మతం, ధనం లాంటి విషయాలపై ఆధారపడలేదు. కేసీఆర్‌ తన గెలుపు కోసం కాంగ్రెస్‌లా ఎదుటివారి ఫెయిల్యూర్స్‌ పైన్నో, ఆరోపణలపైన్నో, ఆధారపడలేదు, బీజేపీలా హిందుత్వాన్ని మతతత్వాన్ని రెచ్చగొట్టలేదు. వీరిరువు రూ తాముచేసిన పనుల గురించే చెప్పారు. చేయబోయే పనుల గురించే చెప్పి ఓట్లడిగారు. తమ ఇదివరకటి హామీలు నెరవేర్చి, చేస్తున్న హామీల ను నెరవేర్చగలమని నమ్మకం ఓటర్లలో కలిగించారు.

కేజ్రీవాల్‌ ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్‌ పాఠశాలల కంటే గొప్పగా తీర్చి దిద్దారు. నాణ్యమైన విద్యను అందించారు. ప్రభుత్వరంగ విద్యను బలోపేతం చేశారు. ఢిల్లీలో ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సౌకర్యం కల్పించారు. ఉచిత విద్యుత్తు ఇస్తూనే ఢిల్లీ ప్రజల నీటి సమస్య తీర్చారు. ఢిల్లీ ఆర్థికస్థితిగతులను బాగుపరుచడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి విశేషంగా కృషిచేశారు. అదే సమయంలో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ ముస్లిం వ్యతిరేకతను, పాకిస్థాన్‌ వ్యతిరేకతను రెచ్చగొడుతూ మతసామరస్యాన్ని దెబ్బతీసే పనులు చేశారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క విషయాన్ని పట్టించుకోకుండా మందిర్‌, మసీదు సమస్యను, సీఏఏ, ఎన్నార్సీలను సమర్థిస్తూ కేజ్రీవాల్‌ను కూడా పాకిస్థాన్‌ ఏజెంటుగా చిత్రించారు. కేజ్రీవాల్‌ చర్యల ముందు బీజేపీ  రెచ్చగొట్టే చర్యలేమీ పని చేయలేదు. 

తెలంగాణలోనూ బీజేపీ హిందుత్వ చర్యలు కేసీఆర్‌ ప్రజల అవసరాలను తీర్చే పథకాల ముందేం పనిచేయలేదు. రాష్ట్రంలో కేసీఆర్‌ వ్యవసాయాధారంగా బతికే కోట్లాదిమందిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి నమూనా తయారుచేశారు. దశాబ్దాలుగా నీటి కొరతతో తల్లడిల్లుతున్న తెలంగాణ రైతాంగానికి నీరందించడానికి మిషన్‌ కాకతీయ, కాళేశ్వరంలాంటి ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టి చాలావరకు పూర్తిచేశారు. ప్రతి ఇం టికీ తాగు నీరందించడానికి మిషన్‌భగీరథ పథకంతో మంచినీళ్లం దిం చారు. రైతుబంధు, వృద్ధాప్య పింఛన్‌, రుణమాఫీ ఇతర అనేక సంక్షే మ పథకాల ద్వారా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరేట్టు చేశారు. నిరంతర విద్యు త్తునిచ్చి వ్యవసాయం, పరిశ్రమలను ఆదుకున్నారు.  సబ్బండ వృత్తుల వారికి ఆ వృత్తులతో బతికేట్టు చేశారు. విద్య, వైద్యం విషయంలోనూ కేసీఆర్‌ ప్రజలను ఆదుకున్నారు.ఇలా కేసీఆర్‌, కేజ్రీవాల్‌ తమ రాష్ర్టాలను దేశంలోనే రోల్‌మోడల్స్‌గా తీర్చిదిద్దిన, దిద్దుతున్న ఘనత వారిది. ఢిల్లీ, హైదరాబాద్‌ పాదుషాలు కేజ్రీవాల్‌, కేసీఆర్‌లు తమ దృష్టిని జాతీయ రాజకీయాల వైపు కేంద్రీకరిస్తే మంచిదేమో!


logo