సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Feb 18, 2020 , T00:01

చెరువులను రక్షించుకోవాలె

చెరువులను రక్షించుకోవాలె

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిషన్‌ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలోని చెరువులన్నింటిని పునరుద్ధరిస్తున్నది. ఇప్పటికే వేలాది చెరువులు మరమ్మతులకు కూడా నోచుకున్నాయి. ఈ రకంగా అభివృద్ధి చెందిన చెరువులను కంటికి రెప్పలా కాపాడుకో వాల్సిన బాధ్యత ప్రజలది. కానీ అది సక్రమంగా జరుగడం లేదు. ఈ చెరువుల్లో చెత్త పారేయడం, మాంసం వ్యర్థాలు పడేయడం, కళేబరా లు పారేయడం ద్వారా చెరువులు కాలుష్యం బారిన పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు చెరువుల రక్షణ గురించి పట్టించుకోవాలి.  

- దూలం రాజేశ్‌, సుభాష్‌నగర్‌, పెద్దపల్లి


సగర్వంగా తిరిగిరావాలె

న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా తొలుత అన్ని ట్వంటీ- ట్వంటీ మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కానీ తర్వాత జరిగిన  వన్డే మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఇక న్యూజిలాండ్‌ పర్యటనలో మిగిలింది టెస్టు మ్యాచ్‌లే. ఈ టెస్టుల్లోనైనా పూర్తి ఆధిక్యం ప్రదర్శిం చి విజయంతో సగర్వంగా స్వదేశానికి తిరిగి రావాలి.  

- జూలపల్లి మోహన్‌, మానకొండూర్‌, కరీంనగర్‌


అప్రమత్తంగా ఉండాలి

కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తు న్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్‌ కేసుల గురించి వదంతులు వస్తున్నాయి. దీంతో ఈవార్తలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ విషయంలో అధికార యంత్రాంగం చెప్పేదాకా అత్యుత్సాహం ప్రదర్శించకూడదు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. కరోనా వైరస్‌ విస్తరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ఒకవేళ ఎవరికైనా కరోనా వైరస్‌ ఉన్నదని తేలితే ఆ వ్యాధిగ్రస్థులకు సకల సదుపాయాలతో ప్రత్యేక వైద్యం అందించ డానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి. వదంతులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు.

- జంపాల అంజయ్య, యాదాద్రిభువనగిరి జిల్లా


logo