గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 16, 2020 , 23:01:44

దారిచూపే దీపం

దారిచూపే దీపం

మార్క్స్‌, ఏంగెల్స్‌ ‘మనది బూర్జువాయు గం’ అని కమ్యూనిస్టు ప్రణాళికలో ఆ వేళ ప్రకటించారు. వారు అలా ప్రకటించి సరిగ్గా 172 ఏండ్లయ్యింది. ఇప్పుడు మనం నయా ఉదారవా ద యుగంలో ఉన్నాం. అలాగే పెట్టుబడిదారీ విధానం ముదిరి నయా ఉదారవాదం అయింది. అది బోర విరుచుకొని విజయగర్వంతో విర్రవీగుతున్న కాలం మనది. యూరప్‌, అమెరికాల్లో ఈ విధానం మొదలై నాలుగు దశాబ్దాలైంది. ఇక్కడ మన పాలకులు దాన్ని మూడు దశాబ్దాల క్రితం కౌగిలించుకొన్నారు.


ఈ వ్యవస్థకు తిరుగులేదనీ, దీనికంటే మెరుగైన వ్యవస్థ ఏదీ లేదనీ సోషలిజం పూర్తిగా విఫలమైందనీ చెప్పే ప్రచారాలతో నయా ఉదారవాదులు ప్రపంచవ్యాప్తంగా ఊదరకొడుతున్నారు. ప్రజలు తమ జీవితానుభవానికి వ్యతిరేక దిశలో ఆలోచించేట్టుగా చేయడమే ఆ ప్రచారాల లక్ష్యం. ప్రచారసాధనాల్లో అత్యధిక శాతం నయా ఉదారవాదుల చేతుల్లోనే ఉన్నాయి. అవి నిజాల మధ్య అబద్ధాలను జొప్పించి ప్రజల బుర్రలను పాడుచేస్తున్నాయి. వారిని తమకు అనుకూలం గా మలుచుకుంటున్నాయి. ఇదంతా ఎల్లకాలం సాగదనేది సత్యం. జనం క్రమంగా కళ్లు తెరుస్తున్నారన్నదీ సత్యమే. ‘బూర్జువా వర్గం పైచేయి సాధించిన ప్రతిచోటా మొత్తం పితృస్వామిక, ఫ్యూడల్‌ సంబంధాలన్నిటినీ ఖతం చేసింది. మతోన్మాదాన్నీ రణోత్సాహాన్నీ.. అది తన సొంత లాభనష్టాల బేరీజు అనే అతి చల్లటి నీటి గుంట లో ముంచేసింది.’ అంటుంది ప్రణాళిక.


అప్పటికి బూర్జువా వర్గం పుట్టి వందేండ్ల యింది. ఆ తర్వాత కొద్దికాలానికే అది ఆ నీటి గుంట నుంచి యుద్ధోన్మాదాన్ని బయటకు తీసి వాడుకొంది. ఇప్పుడిక్కడ మోదీ పాలనలో నయా ఉదారవాదం ఒకపక్క వికాసం, ప్రగతి, ప్రజాస్వామ్యం వగైరా కబుర్లు చెబుతున్నది. మరోపక్క మతోన్మాదాన్నీ, యుద్ధోన్మాదాన్నీ రెచ్చగొట్టి అంతులేని అబద్ధాలతో రాజ్యమేలుతున్నది. ప్రజాస్వామ్య వామపక్ష ఉద్యమాలపైనా దళిత, మైనారిటీ ప్రజలపైనా ఫాసిస్టు తరహా పాశవికత్వాన్ని ప్రయోగిస్తున్నది.


భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా నయా ఉదారవాదానికి వ్యతిరేకంగా జనం మేల్కొంటున్నారు, పోరాడుతున్నారు. మత వివక్షకు వ్యతిరేకంగా దేశంలో విద్యార్థులూ యువజనులూ ప్రతిఘటిస్తున్నారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగులు తమ జీవనపరిస్థితుల ను మెరుగుపర్చుకోవడం కోసం రోడ్లపైకి వస్తు న్నారు. స్వేచ్ఛ కోసం, మానవహక్కుల కోసం, శాంతి కోసం సామాజిక న్యాయం కోసం బుద్ధి జీవులు కూడా కదులుతున్నారు. విడివిడి అంశాలపై జరుగుతున్న ఈ ఉద్యమాలన్నీ కలిసి పెరిగి పెద్దవై మొత్తంగా నయా ఉదారవాదాన్ని ఊడ్చిపారేసే ఒక మహాపోరుగా మారాలన్నదే ఆశ. 


మార్క్సిజం అంటే గతానుభవాల సారం. దాన్ని గ్రహించగలిగితే ప్రస్తుత సమస్యలను ఎదుర్కోడానికి కావలసిన శిక్షణ మనకు లభి స్తుంది. ఆ పునాదితో కొత్తగా వచ్చిపడే సమస్యల మూలాలను గ్రహించవచ్చు. ఆ సమస్యలను సృజనాత్మకంగా ఎదుర్కోవచ్చు.మోదీ అండ్‌ కో ఇవ్వాళ ప్రగతివాదంపై చేస్తు న్న దాడులకు జవాబుగా ప్రగతిశీల సాహిత్యాన్ని ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకుపోవాలనుకుం టున్నాం. తొలి ప్రయత్నంగా ‘కమ్యూనిస్టు ప్రణాళిక’నూ దానితో పాటు ఏంగెల్స్‌ రాసిన ‘కమ్యూనిజం సూత్రాల’నూ కలిపి లక్ష ప్రతులు ముద్రిస్తున్నాం. వామపక్ష, ప్రజాతంత్ర ప్రచుర ణ సంస్థలమైన మేం వామపక్ష ఉద్యమాల సహకారంతో ఈ పనికి పూనుకొన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం.

(ఈ పుస్తకానికి ప్రచురణకర్తలు రాసిన ముందుమాట నుంచి..)


logo
>>>>>>